మహిళలకు నాయకత్వ లక్షణాలు అవసరం | Leadership qualities necessary for women | Sakshi
Sakshi News home page

మహిళలకు నాయకత్వ లక్షణాలు అవసరం

Published Tue, Aug 6 2013 2:05 AM | Last Updated on Fri, Sep 1 2017 9:40 PM

మహిళలకు నాయకత్వ లక్షణాలు అవసరం

మహిళలకు నాయకత్వ లక్షణాలు అవసరం

మాదాపూర్, న్యూస్‌లైన్: మహిళలు పారిశ్రామిక రంగంలో రాణించాలంటే ప్రతి ఒక్కరూ నాయకత్వ లక్షణాలు కలిగి ఉండాలని కెనైటిక్ ఇంజినీరింగ్ లిమిటెడ్ వైస్ చైర్మన్ సులజ్జ చిరోబియా మోత్వానీ పేర్కొన్నారు. సోమవారం మాదాపూర్‌లోని ఓ హోటల్‌లో ఫిక్కీ మహిళా ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ‘లీడర్‌షిప్ ఇన్ ఉమెన్’ కార్యక్రమం నిర్వహించారు.

ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. మహిళా పారిశ్రామికవేత్తల సాధికారత కోసం ఏర్పాటు చేసిన సంస్థ వారికి పలు సలహాలు, సూచనలు అందిస్తుందన్నారు. ఫిక్కీ మహిళా ఆర్గనైజేషన్ చైర్మన్ జోత్స్నా అంగారా మాట్లాడుతూ మహిళలకు కావాల్సిన నాయకత్వ లక్షణాలు, పారిశ్రామిక రంగాల్లో ముందుకు దూసుకువెళ్లడానికి అవసరమైన సూచనలు అందిస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement