బాబుకు నాయక త్వ లక్షణాలు లేవు: ఎర్రబెల్లి
యాదగిరికొండ: ఏపీ సీఎం చంద్రబాబుకు నాయకత్వ లక్షణాలు లేవని ఇటీవల టీఆర్‌ఎస్‌లో చేరిన టీడీపీ శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. శనివారం ఉదయం ఆయన యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో పూజలు నిర్వహించి విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణలో టీడీపీ మునిగిపోయే నావ అని అన్నారు. ‘నా కేడర్‌ను కాపాడుకోవడానికి, పాలకుర్తి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవడానికే నేను టీఆర్‌ఎస్‌లో చేరాను’ అని పేర్కొన్నారు.
మునిగే నావలో ఎంతో దూరం ప్రయాణం చేయలేరని, బాబు తెలంగాణలో ఎంతచేసినా టీడీపీని బతికించుకోలేరన్నారు. యాదాద్రిని టీడీపీ అధికారంలో ఉన్న పదేళ్లు పట్టించుకోలేదన్నారు. ప్రస్తుతం ఈ ఆలయం దేశంలోనే అగ్రగామిగా పేరు గడించిందని, దీనికి కారణం సీఎం కేసీఆరే’ అని ఎర్రబెల్లి అన్నారు.