
న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ ఊపిరి వదిలినప్పుడు ఎనిమిది మీటర్ల దూరం వరకూ ప్రయాణించగలదని, గాల్లోనే నాలుగు గంటలపాటు ఉండగలదని అమెరికాలోని మసాచూసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు జరిపిన తాజా పరిశోధన తెలిపింది. దీంతో వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తున్న ఒకట్రెండు మీటర్ల భౌతిక దూరం ఎంతవరకూ పనిచేస్తుందనేది ప్రశ్నార్థకంగా మారింది. జర్నల్ ఆఫ్ ద అమెరికన్ మెడికల్ అసోసియేషన్ తాజా సంచికలో ప్రచురితమైన పరిశోధన వ్యాసంలో ఎంఐటీ శాస్త్రవేత్తలు ఈ విషయాలను స్పష్టం చేశారు. (కమ్ముకున్న కరోనా)
దగ్గు, తుమ్ము వంటి వాటివల్ల గాల్లో ఏర్పడే మేఘాల్లాంటి నిర్మాణాలపై 1930లలో జరిగిన పరిశోధనల ఆధారంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒకట్రెండు మీటర్ల భౌతిక దూరాన్ని ప్రతిపాదించిందని, కానీ ఈ అంచనాలు ఇప్పుడు పనికిరావని అసోసియేట్ ప్రొఫెసర్ లిడియా బౌరౌబా హెచ్చరించారు అన్ని రకాల నీటి తుంపర్లు వైరస్‌ను కలుపుకుని 23 నుంచి 27 అడుగుల దూరం ప్రయాణించగలవని తెలిపారు.తుంపర బిందువు పరిమాణంపై ఏకపక్షంగా నిర్ణయాలు జరిగాయని, వాటి ఆధారంగా మార్గదర్శకాలు జారీ చేశారని ఆరోపించారు. (దివాలా అంచున ఎయిర్‌లైన్స్)
Comments
Please login to add a commentAdd a comment