Surreal Underwater Puzzle Adventure Game Review In Telugu - Sakshi
Sakshi News home page

Surreal Underwater Puzzle Game: మహాసముద్రంలో మిస్టరీలు.. మరి మీరు రెడీనా!

Published Sat, Jun 18 2022 3:58 PM | Last Updated on Sat, Jun 18 2022 4:59 PM

Surreal Underwater Adventure Game Puzzle: Telugu Review - Sakshi

సముద్రంలో కనివిని ఎరగని జీవజాలాలే కాదు... ఎన్నో మిస్టరీలు దాగున్నాయి. వాటిని ఛేదించాలనుకుంటున్నారా? ఉత్సాహం ఉందా? అయితే  పదండీ...

ఈ నెలలో విడుదలైన సర్రియల్‌ అండర్‌ వాటర్‌ అడ్వెంచర్‌ గేమ్‌ ఫజిల్‌... స్లీట్‌. సముద్రాన్ని బయటి నుంచి చూడడం వేరు, సముద్రగర్భంలోకి వెళ్లడం వేరు. ఇప్పుడు మనం లో లోపటికి వెళుతున్నాం. అదిగో... తిమింగలానికి బాప్‌లాంటి రాక్షస తిమింగలం ఎదురొస్తుంది. అది నోరు తెరిస్తే... కోరల రూపంలో పదునైన గునపాల వనం కనిపిస్తుంది. అది మళ్లీ నోరు మూసే లోపే మనం తప్పించుకోవాలి. (క్లిక్‌: యూట్యూబ్‌లో ఫస్ట్‌ అప్‌లోడ్‌ చేసిన వీడియో ఇదే!)

కమ్మని సంగీతం వినిపిస్తే అటువైపు వెళతాం. ఏదో జంతువులాగుంది. బూర వాయిస్తుంది. వెళ్లాలా? వద్దా? అని ఆలోచించేలోపే అది మనపై ఎటాక్‌ చేయవచ్చు. అటు వైపు వెళితే... మన ‘పాతాళభైరవి’లో హీరోకు కనిపించే పే.....ద్ద విగ్రహంలాంటిది కనిపించి కళ్లెర్ర చేయవచ్చు. ఇంకొంచెం దూరం వెళితే... అందమైన దీపాలు అద్భుతమైన వెలుగుతో కనిపిస్తాయి. ‘ఆహా’ అనుకునే లోపే ఆ దీపాలు కాస్త భారీ గొంగళి పురుగుల ఆకారంలో మనల్ని వేటాడడానికి వస్తుంటాయి. ఇవి కొన్ని మాత్రమే. మరి మీరు రెడీనా! 

జానర్‌: అడ్వెంచర్‌ ఇండీ  
డెవలపర్స్‌: స్పైరల్స్‌ సర్కస్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement