నీటిలో గర్భా నృత్యం.. నివ్వెరపోతున్న జనం! | Underwater Garba Dance Amazed | Sakshi
Sakshi News home page

నీటిలో గర్భా నృత్యం.. నివ్వెరపోతున్న జనం!

Published Mon, Oct 23 2023 9:47 AM | Last Updated on Mon, Oct 23 2023 12:14 PM

Underwater Garba Dance Amazed - Sakshi

దేశవ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలు వేడుకగా కొనసాగుతున్నాయి. పలుచోట్ల గర్బా, దాండియా నృత్యాల కోలాహలం కనిపిస్తోంది. ఈ సంప్రదాయ వేడుకలకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. అయితే నీటిలో గార్బా నృత్యం చేస్తున్న ఓ డ్యాన్సర్‌కు చెందిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ఈ వీడియో క్లిప్‌లో నీటిలో మునిగి గర్బా నృత్యం చేస్తున్న ఒక యువకుడిని చూడవచ్చు. ఇది వీక్షకులను అమితంగా ఆకట్టుకుంటోంది. ఈ నృత్యం చేస్తున్న కళాకారుని పేరు జైదీప్ గోహిల్. తన ఇన్‌స్టాగ్రామ్ బయోలో తాను భారతదేశపు మొట్టమొదటి నీటి అడుగున నృత్యం చేసే వ్యక్తినని పేర్కొన్నాడు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆ కళాకారుడని అభినందనల్లో ముంచెత్తుతున్నారు.
ఇది కూడా చదవండి: టాయిలెట్‌కు కారు దిగిన భర్త.. అంతలోనే మాయమైన భార్య!
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement