Clips
-
నీటిలో గర్భా నృత్యం.. నివ్వెరపోతున్న జనం!
దేశవ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలు వేడుకగా కొనసాగుతున్నాయి. పలుచోట్ల గర్బా, దాండియా నృత్యాల కోలాహలం కనిపిస్తోంది. ఈ సంప్రదాయ వేడుకలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అయితే నీటిలో గార్బా నృత్యం చేస్తున్న ఓ డ్యాన్సర్‌కు చెందిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో క్లిప్‌లో నీటిలో మునిగి గర్బా నృత్యం చేస్తున్న ఒక యువకుడిని చూడవచ్చు. ఇది వీక్షకులను అమితంగా ఆకట్టుకుంటోంది. ఈ నృత్యం చేస్తున్న కళాకారుని పేరు జైదీప్ గోహిల్. తన ఇన్స్టాగ్రామ్ బయోలో తాను భారతదేశపు మొట్టమొదటి నీటి అడుగున నృత్యం చేసే వ్యక్తినని పేర్కొన్నాడు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆ కళాకారుడని అభినందనల్లో ముంచెత్తుతున్నారు. ఇది కూడా చదవండి: టాయిలెట్‌కు కారు దిగిన భర్త.. అంతలోనే మాయమైన భార్య! -
Shraddha Walkar Case: కీలక ఆధారంగా ఆమె వాయిస్ రికార్డు..
యావత్తు దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన శ్రద్ధా వాకర్ హత్యకేసులో ప్రధాన నిందితుడు అఫ్తాబ్ పూనావాలా నేరం చేశాడనేందుకు కీలక సాక్ష్యాధారాలను పోలీసులు కోర్టుకి సమర్పించారు. వాటిలో కోర్టులో ప్లే చేసిన శ్రద్ధా వాయిస్ రికార్డు క్లిప్ ఈ కేసుకి కీలకంగా మారింది. ఈ మేరకు ఈ కేసుకి సంబంధించిన వాదనలు సోమవారం సాకేత్ కోర్టులో జరిగాయి. పోలీసులు నిందితుడు అఫ్తాబ్ పూనావాలాని కోర్టులో హజరుపరిచారు. ఈ కేసు విచారణకు శ్రద్ధ తడ్రి కూడా హజరయ్యారు. కోర్టులో ఢిల్లీ పోలీసులు అతడు నేరం చేశాడని రుజువు చేసేందుకు విశ్వసనీయమైన సాక్ష్యాధారాలు ఉన్నాయని చెప్పారు. అందుకు సంబంధించిన ఆధారాలను పబ్లిక్ ప్రాసిక్యూటర్లు అమిత్ ప్రసాద్, మధుకర్ పాండేలు కోర్టుకి సమర్పించారు. ఈ కేసుకి సంబంధించి నేరం చేయడానికి దారితీసిన ఆరు పరిస్థితులు, ముగ్గురు ప్రత్యక్ష సాక్ష్యలను గురించి కోర్టుకి వివరించారు. అలాగే ఆమె హత్యకు ముందు చివరిసారిగా చూసిన వారి గురించి కూడా కోర్టుకి తెలిపారు. ఈ నేరం సహజీవనం కారణంగా జరిగిందని, అతడితో రిలేషన్ షిప్లో ఉన్నంత కాలం ఆమె హింసకు గురైందని చెప్పారు. అలాగే శ్రద్ధా నవంబర్ 23, 2022న ముంబైలోని వసాయి పోలీస్టేషన్‌కి చేసిన ఫిర్యాదు కూడా ఈ హత్య కేసుకి బలమైన ఆధారమని చెప్పారు . అలాగే శ్రద్ధా ప్రాక్టో యాప్ ద్వారా వైద్యుల నుంచి కౌన్సిలింగ్ తీసుకుంటున్న విషయం గురించి పేర్కొన్నారు. ఆ ఆన్లైన్ కౌన్సిలింగ్లో వైద్యులకు అఫ్తాబ్ తనను వెంటాడి వెతికి మరీ చంపేస్తాడని చెబుతున్న ఆడియో క్లిప్‌ను సైతం కోర్టులో ప్లే చేశారు. ఆ క్లిప్‌లో ఒక రోజు అఫ్తాబ్ తన గొంతు పట్లుకున్నట్లు వైద్యులకు చెబుతున్నట్లు వినిపిపిస్తుంది. శ్రద్ధాకు సంబంధించిన మూడు డిజిల్ మొబైల్ ఫోన్లను కూడా కోర్టుకి సమర్పించారు. అలాగే శ్రద్ధా బ్యాంకు లావాదేవీలను నిర్వహించి ఫ్రిజ్, రంపం, నీళ్లు, క్లినర్, అగరబత్తులను కొన్న ఆధారాలను సైతం కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. పైగా అఫ్తాబ్ నేరాన్ని కప్పిపుచ్చేందుకు ఆమె బతికే ఉందన్నట్లు ఆమె సోషల్ మీడియా ఖాతాను నిర్వహించాడని ఢిల్లీ పోలీసుల తరుఫు న్యాయవాదులు కోర్టుకి విన్నవించారు. అతను హత్య చేశాడనేందుకు పూర్తి ఆధారాలు ఉన్నాయి కావున భారత శిక్షాస్మృతి ప్రకారం 302/201 సెక్షన్ల కింది నిందితుడిని తగిన విధంగా శిక్షించాలని న్యాయవాదులు కోర్టుని కోరారు. అదనపు సెషన్స్ జడ్జి మనీషా ఖురానా కకర్ డిల్లీ పోలీసుల తరుఫు న్యాయవాదుల వాదనలు విన్న తర్వాత వాటిపై ప్రతిస్పందించడానికి లీగల్ ఎయిడ్ కౌన్సిల్(ఎల్ఏసీ) జావేద్ హుస్సేన్‌కి కొంత సమయం ఇచ్చారు. ఈ మేరకు జడ్డి ఈ కేసుకి సంబంధించి తదుపరి వాదనల కోసం మార్చి 25కి వాయిదా వేసింది. (చదవండి: ఇందిరా గాంధీ టైంలోనే హక్కులను హరించబడ్డాయ్!: కేంద్ర మంత్రి) -
పలువరస సరిచేసుకోవడం కేవలం అందం కోసమేనా?
మా ఇద్దరు పిల్లల పలువరస కూడా చక్కగా లేదు. ఒకింత ఎగుడు దిగుడుగానే ఉంది. కేవలం అందం కోసమే పలువరస సరిచేయడం కోసమే అంత ఖర్చుచేయాలా అనుకుంటున్నాను. నా భావన సరైనదేనా? దయచేసి తెలియజేయండి. పలువరస సరిచేసుకోవడం అన్నది కేవలం అందం కోసమే కాదు. దానితో ఎన్నో ప్రయోజనాలున్నాయి. పలువరసను చక్కదిద్దే వైద్యప్రక్రియను ఆర్థోడాంటిక్స్ అంటారు. ముందుగా ఆర్థోడాంటిక్స్ అంటే ఏమిటో చూద్దాం.ఆర్థో, డోంటోస్ అనే రెండు పదాల కలయికే ఆర్థోడోంటిక్స్. ఆర్థో అంటే సరిచేయడం, డోంటోస్ అంటే దంతాలు. అంటే పళ్లను సరిచేయడం అని అర్థం. చాలామంది ఆర్థోడోంటిక్ చికిత్స అనగానే అందంగా కనిపించడానికి చేయించుకునేదనే భావనతో ఉంటారు. ఇది బాగా డబ్బున్నవాళ్లు చేయించుకునే చికిత్స అనీ... కేవలం బాహ్య సౌందర్యానికి ప్రాధాన్యం ఇస్తూ చేయించుకునే చికిత్స అనేది చాలామందిలో ఉండే అపోహ. దాంతో చాలామంది ఈ చికిత్సకు దూరంగా ఉంటున్నారు. ఈ చికిత్స వల్ల మునుపటి కంటే అందంగా కనిపించడమనేది నిజమే అయినా... దీని వల్ల ఒనగూడే లాభం మాత్రం అదొక్కటి మాత్రమే కాదు. ఈ చికిత్స వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకోవాలంటే... ముందు అస్తవ్యస్తంగా ఉండే పళ్ళ వల్ల కలిగే నష్టాలు గుర్తించాలి. ఎగుడుదిగుడు పలువరసతో నష్టాలివి ఎగుడు దిగుడుగా ఉండే పళ్లు ఎంత తోముకున్నా పూర్తిగా శుభ్రం కావు. అందువల్ల నోటి దుర్వాసన, చిగుళ్లనుండి రక్తం కారడం, చివరకు చిగుళ్ల వ్యాధి వల్ల పళ్లు బలహీనపడి ఆహారం సరిగా నమలలేకపోవడం వంటి అనర్థాలు ఏర్పడతాయి. తినేప్పుడు విపరీతమైన నొప్పి కలుగుతుంది. అంతేకాకుండా చిగుళ్ల వ్యాధి కారణంగా పళ్లు ఊడిపోవడం కూడా జరుగుతుంది. ఎత్తుగా ఉండే పళ్ల వల్ల చిగుళ్ల వ్యాధి రావచ్చు.చాలామంది అనుకునేట్టు ఆహారం నమలడం అంటే కేవలం పళ్లు మాత్రమే చేసే పనికాదు. పళ్లతో పాటు దవడలు, వాటిని కదిల్చే కండరాలు, వాటిని నియంత్రించే నరాలు, నాలుక, పెదాలు, బుగ్గలు చెవి ముందు ఉండే రెండు ప్రత్యేకమైన కీళ్లూ... ఇవన్నీ కలిసి సమష్టిగా చేసే ప్రక్రియ. వీటన్నిటిలో దేనిలో అయినా లోపం ఉంటే అది మిగతా వాటన్నింటి మీదా ప్రభావం చూపుతుంది. నోటిలో ఉండే పళ్లు, వాటితో సంబంధం ఉన్న ఈ మిగతా అవయవాలు సమతౌల్యంతో పనిచేయాలి. సున్నితమైన ఈ బాలెన్స్ దెబ్బతింటే రకరకాల దంత వ్యాధులకు గురవ్వాల్సి వస్తుంది.ఉదాహరణకు పళ్లు ఎగుడు దిగుడుగా అంటే అవి వాటి స్థానం నుండి లోపలకు బయటకు జరిగాయని అనుకుందాం. అప్పుడు ఆహారం నమలడం కష్టమవుతుంది. అప్పుడు మనకు తెలియకుండానే అంటే అసంకల్పితంగానే మన శరీరం మన దవడ ఎముకల్ని పక్కకి జరుపుతుంది. దీనివల్ల కండరాల మీద, నరాల మీద ఒత్తడి పెరిగి చెవినొప్పి, మెడ నొప్పి రావడం జరుగుతుంది. అంతేకాదు పదే పదే దవడలు పక్కకి జరపడం వల్ల పళ్ళలో సన్నని పగుళ్ళు ఏర్పడి కేవిటీస్ రావడం, చిగుళ్లు దెబ్బతిని పళ్లు బలహీనం కావడం జరుగుతుంది.వంకరగా ఉండే పళ్ల వల్ల జరిగే మరొక నష్టం దవడల ఎదుగుదల గతి తప్పి ముఖం ఆకృతి మారిపోవడం. వంకర పళ్ల వల్ల కొన్నిసార్లు దవడలు చిన్నగా ఉండిపోతే, కొన్నిసార్లు క్రింది దవడ ఎక్కువ పెరిగిపోవడం జరుగుతుంది. ఈ రెండు సందర్భాలలోనూ ముఖం అందవిహీనంగా తయారవడమే కాక, పైన, కింది దవడలు మధ్య సమతుల్యత దెబ్బతింటుంది. వీటిని సరి చేయాలంటే శస్త్ర చికిత్సలే శరణ్యం.ఆర్థోడోంటిక్స్ ద్వారా ఈ సమస్యలనే కాదు కృత్రిమ దంతాల అమరిక సమయంలో ఉత్పన్నమయ్యే సమస్యలని కూడా అధిగమించవచ్చు. ఉదాహరణకు, ఒక పన్ను ఊడిపోతే దాని స్థానంలోకి పక్క పళ్లు ఒరిగిపోవడం లేదా వాలిపోవడం మామూలే. అలా ఒరిగిన పళ్లని తిరిగి సరిగ్గా నిలబెడితేనే, కృత్రిమంగా పెట్టే దంతాలు చక్కగా అమరుతాయి. అలాంటి ఒరిగిపోయిన పళ్లని కేవలం ఆర్థోడోంటిక్స్ ద్వారా మాత్రమే సరిచేయొచ్చు. ఈ సౌకర్యాలతో పాటూ అందం కూడా అదనంగా సమకూరుతుంది. చిన్న వయసే మేలు... దవడలు, దంతాల మధ్య ఉన్న అసమతుల్యతలను చిన్న వయసులోనే సరి చేసుకోవడం మంచిది. చిన్న వయసులో అయితే పిల్లలలో సహజంగా ఉన్న ఎదుగుదలని వాడుకోవడం ద్వారా ఎముకల్ని మనకి కావాల్సిన విధంగా మలచుకోవచ్చు. చిన్నగా ఉన్న ఎముకల్ని పెద్దవి చేయొచ్చు. మరీ పెద్దగా ఉన్న ఎముకల ఎదుగుదలని నియంత్రించవచ్చు. చిన్న వయసులోనైతే ఆర్థోడోంటిక్స్ లేదా ఆర్థోపెడిక్స్ ద్వారా దంతాలు లేదా దవడ ఎముకలను సరి చేసుకోవడానికి ఖర్చు కూడా తక్కువ అవుతుంది. అదే పెద్ద వయసు వారిలోనైతే శస్త్రచికిత్స ఒక్కటే మార్గం. దానివల్ల ఖర్చులే కాదు రిస్క్ కూడా ఎక్కువే. అందువల్ల మగపిల్లలైతే 11–13 ఏళ్లూ, ఆడపిల్లలైతే 10–12 ఏళ్ల మధ్యలో ఆర్థోడోంటిక్స్ లేదా క్లిప్స్ చికిత్స మొదలుపెట్టడం అన్ని విధాలా శ్రేయస్కరం. క్లిప్స్, ఆర్థోడోంటిక్ చికిత్సలో మొదటి రెండు వారాలు చాలా ముఖ్యం. చికిత్సలో భాగంగా దంతాల మీద క్లిప్స్ అతికిస్తారు. ఈ క్లిప్స్ వల్ల పెదాలు బుగ్గలు మీద గాయాలు ఏర్పడి, చిన్న పిల్లలని కాస్తంత ఇబ్బంది పెట్టవచ్చు.ఈ గాయాలు నయమవ్వడానికి రెండువారాల సమయం అవసరమవుతుంది. ఇక మరో విషయం ఏమంటే... క్లిప్స్ పెట్టుకున్న తర్వాత ఒక రెండు వారాల వరకు పిల్లలు తాము ఎదుటివాళ్ళకు ఎలా కనిపిస్తున్నామో లేదా స్నేహితులు గేలి చేస్తారేమో అని బెరుకుగా ఉంటారు. ఇలాంటి బెరుకులూ, భయాలూ ఆందోళనల నుంచి బయటపడడానికి కూడా వేసవి సెలవులు ఉపయోగపడతాయి.సంప్రదాయంగా క్లిప్స్ అనేవి మెటల్‌తో తయారవుతాయి. మెటల్ క్లిప్స్ ఎబ్బెట్టుగా అనిపిస్తే పన్ను రంగులో కలిసిపోయే సిరామిక్ క్లిప్స్ కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఆర్థోడోంటిక్ చికిత్సకి ఒకటి నుంచి రెండేళ్ల సమయం పట్టవచ్చు. చికిత్సని వేగవంతం చేయడానికి సెల్ఫ్ లైగెటింగ్ క్లిప్స్ అనేవి కూడా అందుబాటులో ఉన్నాయి ఒకవేళ చికిత్స చేయించుకోవడం ఇష్టమే అయినా, దంతాల మీద క్లిప్స్ పెట్టుకోవడం ఇష్టం లేని వాళ్ళకోసం అలైనర్స్ అనే కొత్త విధానం అందుబాటులోకి వచ్చింది. అలైనర్స్ అనేవి త్రీడీ సాంకేతికత ద్వారా పారదర్శకమైన ప్రత్యేకమైన రెసిన్ పదార్థంతో తయారుచేసేవి. రోగి సమస్యకు అనుగుణంగా అవసరమైన సంఖ్యలో అలైనర్స్ ఉంటాయి. అలైనర్స్ను ప్రతి రెండు వారాలకు ఒకసారి మార్చుకోవాలి. అలైనర్స్ వాడుతున్నట్టు కానీ చికిత్స జరుగుతున్నట్టుగాని ఎదుటివారికి తెలియకపోవడమే వీటి ప్రత్యేకత. ఆర్థోడోంటిక్ చికిత్సలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు: ►రోజూ ఉదయం రాత్రి రెండు పూటలా పళ్లు శుభ్రపరచుకోవడం కోసం తప్పనిసరి. ►గట్టిగా ఉండే ఆహారాలు అంటే చిక్కీలు, మురుకులు, సకినాల వంటివి తినకూడదు. ►ముందు పళ్లతో ఎటువంటి పదార్థాలను కొరకకూడదు. ►గ్యాస్ ఉన్న శీతల పానీయాలు సేవించకూడదు. ఆర్థోడోంటిక్ చికిత్స వల్ల ప్రయోజనాలివే... ►పళ్లు తోముకోవడానికి అనువుగా ఉండే చక్కని పలువరుస. ►పలువరుస చక్కగా ఉండి, దంత క్షయం తగ్గుతుంది. చిగుళ్ల వ్యాధి వచ్చే అవకాశాలు తగ్గుతాయి. ►ముఖం అందంగా తయారవడం వల్ల ఆత్మన్యూనతా భావం తగ్గి, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. డా. ఎన్.కె.ఎస్. అరవింద్, డాక్టర్ అరవింద్ ఆర్థోడోంటిక్ అండ్ డెంటల్ క్లినిక్, ఏఎస్ రావు నగర్, హైదరాబాద్ -
క్రౌన్ బ్రెయిడ్
సిగ సింగారం హెయిర్ స్టైల్స్ అనగానే చాలా మంది భయపడతారు జుట్టున్నమ్మ ఏ కొప్పు పెట్టినా చెల్లుతుంది అని. కానీ, పొట్టి జుట్టు, పల్చని జుట్టు ఉన్న వారు కూడా అందమైన కేశాలంకరణలను తీర్చిదిద్దుకోవచ్చు. ఇక్కడ ఇస్తున్న క్రౌన్ కేశాలంకరణను 5 నిమిషాలలోనే వేసుకోవచ్చు. వేడుకలలో శిరోలంకరణతోనే కిరీటాన్ని తలదాల్చిన మహారాణిలా వెలిగిపోవచ్చు. 1. జుట్టును చిక్కుల్లేకుండా పై నుంచి కిందవరకు దువ్వాలి. నుదుటికి రెండువైపులా ఉన్న జుట్టును పై నుంచి నాలుగు పాయలు తీసుకోవాలి. 2. ఎడమ వైపు, కుడివైపు రెండువైపులా నాలుగు పాయల జడలను విడి విడిగా అల్లాలి. 3. ముందుగా అల్లిన కుడి జడ కింద నుంచి మరో నాలుగు పాయలు తీసుకొని మళ్ళీ జడ అల్లాలి. 4. ఆ తర్వాత ఎడమ జడ కింద నుంచి మరో నాలుగు పాయలు తీసుకొని జడ అల్లాలి. 5. ఒకవైపు రెండు, మరో వైపు రెండు మొత్తం నాలుగు జడలు పూర్తవ్వాలి. 6. ముందుగా అల్లిన పై జడలను చివరల వరకు అల్లి, కింద రెండు జడలను సగం వరకు అల్లాలి. 7. పై రెండు జడలను, కింది రెండు జడలను కలిపి క్రాస్‌గా అమర్చాలి. 8. ఈ నాలుగు జడలను కలిపి పూర్తిగా చివరి వరకు అల్లాలి. 9. జడ ఎడమ నుంచి కుడివైపు చెవి మీదుగా తీసుకెళ్లాలి. 10. నడి నెత్తి మీద జడల చివరల వెంట్రుకలు బయటకు రాకుండా జాగ్రత్తగా మడచి పిన్నులు పెట్టాలి. చిన్న చిన్న స్టోన్స్ ఉన్న క్లిప్స్‌ను కూడా ఈ అలంకరణలో ఉపయోగించవచ్చు. ఐదు నిమిషాలలో మీ కేశాలంకరణ ఇలా అందమైన కిరీటంలా మారిపోతుంది. -
సింగిల్ శాటిన్ పూల అందాలు!
మేడ్ ఇన్ హోమ్ ఓ చిన్న క్లిప్... కురులకు కొత్త అందాన్ని అద్దుతుంది. అందుకే మార్కెట్ నిండా రకరకాల మోడళ్ల క్లిప్పులు దర్శనమిస్తున్నాయి. కానీ ఎన్నని కొంటాం! రేట్లు మండిపోతున్నాయి కదా! అందుకే ఇంట్లోనే క్లిప్పులు తయారు చేయడం మొదలుపెట్టండి. పెద్ద కష్టమేమీ కాదు. మొదట క్లాత్ మీద కావలసిన ఆకారంలో రేకుల డిజైన్ వేసుకోవాలి. తర్వాత రేకుల్ని కత్తిరించి, వాటి అంచుల్ని కొద్దిగా వెనక్కి రోల్ చేయాలి. తర్వాత వీటన్నిటినీ పువ్వులా పేర్చుకుంటూ గమ్‌తో అతికించాలి లేదా పిన్ చేయాలి. ఆపైన మధ్యలో ఓ పూస కానీ రాయి కానీ అతికిస్తే అందమైన పువ్వు తయారవుతుంది. దీన్ని రబ్బర్ బ్యాండ్‌కి అతికించాలి. లేదంటే సింపుల్‌గా ఉండే మెటల్ క్లిప్స్ మార్కెట్లో దొరుకుతాయి. కొన్ని కొని పెట్టుకుంటే వాటికి కూడా అతికించుకోవచ్చు. క్లాత్ పెద్ద ఖరీదు కాదు కాబట్టి రకరకాల రంగుల బట్టని కొద్దికొద్దిగా కొని పెట్టుకుంటే, అవసరమైనప్పుడు క్షణాల్లో డ్రెస్సుకి తగ్గ క్లిప్ తయారు చేసుకోవచ్చు. మీకోసం ఇక్కడ కొన్ని మోడల్స్ ఉన్నాయి... చూసి ప్రయత్నించవచ్చు.