క్రౌన్ బ్రెయిడ్
సిగ సింగారం
హెయిర్ స్టైల్స్ అనగానే చాలా మంది భయపడతారు జుట్టున్నమ్మ ఏ కొప్పు పెట్టినా చెల్లుతుంది అని. కానీ, పొట్టి జుట్టు, పల్చని జుట్టు ఉన్న వారు కూడా అందమైన కేశాలంకరణలను తీర్చిదిద్దుకోవచ్చు. ఇక్కడ ఇస్తున్న క్రౌన్ కేశాలంకరణను 5 నిమిషాలలోనే వేసుకోవచ్చు. వేడుకలలో శిరోలంకరణతోనే కిరీటాన్ని తలదాల్చిన మహారాణిలా వెలిగిపోవచ్చు.
1. జుట్టును చిక్కుల్లేకుండా పై నుంచి కిందవరకు దువ్వాలి. నుదుటికి రెండువైపులా ఉన్న జుట్టును పై నుంచి నాలుగు పాయలు తీసుకోవాలి.
2. ఎడమ వైపు, కుడివైపు రెండువైపులా నాలుగు పాయల జడలను విడి విడిగా అల్లాలి.
3. ముందుగా అల్లిన కుడి జడ కింద నుంచి మరో నాలుగు పాయలు తీసుకొని మళ్ళీ జడ అల్లాలి.
4. ఆ తర్వాత ఎడమ జడ కింద నుంచి మరో నాలుగు పాయలు తీసుకొని జడ అల్లాలి.
5. ఒకవైపు రెండు, మరో వైపు రెండు మొత్తం నాలుగు జడలు పూర్తవ్వాలి.
6. ముందుగా అల్లిన పై జడలను చివరల వరకు అల్లి, కింద రెండు జడలను సగం వరకు అల్లాలి.
7. పై రెండు జడలను, కింది రెండు జడలను కలిపి క్రాస్‌గా అమర్చాలి.
8. ఈ నాలుగు జడలను కలిపి పూర్తిగా చివరి వరకు అల్లాలి.
9. జడ ఎడమ నుంచి కుడివైపు చెవి మీదుగా తీసుకెళ్లాలి.
10. నడి నెత్తి మీద జడల చివరల వెంట్రుకలు బయటకు రాకుండా జాగ్రత్తగా మడచి పిన్నులు పెట్టాలి.
చిన్న చిన్న స్టోన్స్ ఉన్న క్లిప్స్‌ను కూడా ఈ అలంకరణలో ఉపయోగించవచ్చు.
ఐదు నిమిషాలలో మీ కేశాలంకరణ ఇలా అందమైన కిరీటంలా మారిపోతుంది.