హెయిర్ ఆర్ట్
ప్రస్తుత ఫ్యాషన్ ప్రపంచంలో కాదేది కళకు అనర్హం. కాలి గోటి నుంచి తల వెంట్రుకల ద్వారా ప్రతీదీ స్టైలిష్‌గా ఉండాలి. ఫ్యాషన్‌లో ట్రెండ్ సెట్ చేయాలి. ఈ క్రేజీ ట్రెండ్‌కనుగుణంగా డిజైనర్లు కూడా కొత్త కొత్త డిజైన్లతో ఆకట్టుకుంటున్నారు.
అయితేతాజాగా సరికొత్త హెయిర్ ఆర్ట్‌తో వారెవ్వా అనిపించుకున్నారు ఒక స్టైలిస్ట్. దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది.
జుట్టు ఉన్న అమ్మ ఏ కొప్పు పెట్టినా అందమే అన్నట్టు ఈ వీడియోలో హెయిర్ ఆర్టిస్ట్ అతేఫ్ కాబిరి జుట్టును రకరకాలుగా కళాత్మకంగా తీర్చిద్దిద్దింది. అద్భుతమైన డిజైన్లతో అబ్బుర పోయేలా చేసింది. @రైన్‌మేకర్ అనే యూజర్ ఈ వీడియోను ట్వీట్ చేశారు.
A compilation of the most extraordinary and complex hair artworks Atefeh Kabiri.
[📹 atefe_kabiri_hairstylist]pic.twitter.com/U4IAQ1SLx8— Massimo (@Rainmaker1973) December 27, 2024
Comments
Please login to add a commentAdd a comment