Hair Styles
-
అనంత్ -రాధిక పెళ్లి వేడుక: తమిళియన్ హెయిర్ స్టైల్లో ఇషా..!
రిలయన్స్ ఇండస్ట్రీస్ దిగ్గజం ముఖేష్ అంబానీ-నీతాల చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి వేడుకలు అత్యంత వైభవోపేతంగా సాగుతున్నాయి. సంగీత్ దగ్గర నుంచి హల్దీ వరుకు సాగిన వివాహ సంబరాల్లో అంబానీ కుటుంబసభ్యులు మునిగితేలుతున్నారు. ఆ వేడుకల్లో వాళ్లంతా ఏళ్ల నాటి సంప్రదాయ ఫ్యాషన్ స్టైల్‌ని గుర్తుచేసేలా.. ఆయా వస్త్రధారణలో కనిపించి ఆశ్చర్యపరుస్తున్నారు. ఆ వేడుకలో నీతా నుంచి ఇషా, శ్లోకా మెహతా వివిధ రకాల లగ్జరీయస్ ఫ్యాషన్ డిజైనర్‌వేర్‌లతో అలరించారు. ఇప్పుడూ తాజాగా ఇషా సరికొత్త హెయిర్ స్టైల్లో కనిపించింది. ఇది తమిళయన్ హెయిర్ స్టైల్లో జడను వేశారు. జడ పైభాగంలో మొగ్ర పువ్వులతో ఓ పెద్ద కొప్పులా ఉండి..కింద నుంచి గోల్డెన్ థ్రెడ్‌తో అల్లారు. ఇక అందుకు తగ్గట్టుగా గ్రీన్ లెహంగాలో స్టన్నింగ్ లుక్‌లో కనిపించారు. అలాగే వాటికి మ్యాచింగ్ అయ్యేలా చెవిపోగులు ఇరువైపుల సూర్యుడు, చంద్రుడుని ధరించిందా అన్నంతా గ్రాండ్ లుక్‌లో కనిపించింది ఇషా. కాగా, అనంత్-రాధికలు జూలై 12న శుక్రవారం వివాహ బంధంతో ఒక్కటికానున్నారు. ఈ వివాహం అనంతరం జూలై 14న గ్రాండ్ రిసెప్షన్ జరగనుంది. ఇది మంబై నగరంలోని అంబానీ జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ , వారి కుటుంబ సభ్యుల సమక్షంలో జరగనున్నట్లు సమాచారం. View this post on Instagram A post shared by Ambani Family (@ambani_update) (చదవండి: నాజూగ్గా ఉండాలనుకుంటే..మొరింగ నీటిని ట్రై చేయండి..!) -
మాస్క్ దెబ్బకు కళ్లకు కొత్త అందాలు
సాక్షి, హైదరాబాద్: కరోనా, లాక్డౌన్ల కారణంగా నగరవాసుల్లో సౌందర్య పోషణ పెరిగింది. అందివచ్చిన ఖాళీ సమయం కొత్త అందాలను అందుకోమని ప్రేరేపించింది. మాస్క్‌తో ముఖాన్ని మూసుకోవాల్సి వచ్చినా.. అధరాలు లిప్స్టిక్స్ అద్దుకుంటూనే ఉన్నాయి. కళ్లు కొత్త అందాలు సంతరించుకుంటూనే ఉన్నాయి. హెయిర్ కేర్, హైజీన్ కేర్ కూడా పెరిగింది. అత్యధిక సమయం నాలుగ్గోడల మధ్యనే నడిచిపోయింది కాబట్టి.. అందంగా కనపడాలనే ఆసక్తి తగ్గిందని అనుకుంటే అపోహే అంటున్నాయి కాస్మొటిక్ బ్రాండ్స్ తయారీ సంస్థలు. గతేడాది ఆన్లైన్ వేదికగా నమోదైన విక్రయాలు దీనినే సూచిస్తున్నాయని ప్రముఖ ఆన్లైన్ మేకప్ ఉత్పత్తుల విక్రయ సంస్థ పర్పుల్ డాట్ కామ్ ప్రతినిధులు చెబుతున్నారు. అయితే మార్చి నుంచి జూన్ వరకూ కాస్త నిదానించినా.. ఆ తర్వాత రెట్టింపు విక్రయాలు నమోదయ్యాయంటున్నారు. సాధారణంగా ఒక తరహా మేకప్‌కు అలవాటైపోయిన తర్వాత అంత త్వరగా దాన్ని మార్చడానికి కార్పొరేట్, ఐటీ తదితర రంగాలకు చెందిన వారు ఇష్టపడరు. అలా గత కొన్నేళ్లుగా కొనసాగుతున్న మేకప్ శైలులను మార్చుకునేందుకు అవసరమైన వెసులుబాటును లాక్డౌన్, వర్క్ ఫ్రమ్ హోమ్ అందించింది. దీంతో ప్రయోగాత్మక మేకప్ శైలులు అలవాటయ్యాయి. సౌకర్యవంతంగా ఉన్నాయి కదాని అంటిపెట్టుకున్న పాత స్టైల్స్ నుంచి బయటకు వచ్చేలా ఈ లాక్డౌన్ సిటిజనులను ప్రేరేపించింది. అదే కాస్మెటిక్స్ రంగానికి మరింత ఊతమిచ్చింది. అన్‌లాక్ సమయంలో హెల్త్, వెల్నెస్ ఉత్పత్తుల్లో 750శాతం పెరుగుదల నమోదైందని సమాచారం. హెయిర్ కేర్, హైజీన్ కేర్ కూడా మంచి సేల్స్ సాధించాయి. మాస్క్‌తో అందమైన ‘చూపు’.. మాస్క్‌లు తప్పనిసరి కావడంతో ఐ మేకప్‌కి బాగా డిమాండ్ ఏర్పడిందని నగరానికి చెందిన బ్యూటీషియన్ కపిల చెప్పారు. ముఖం మొత్తం మీద కళ్లు మాత్రమే బాగా కనిపించే అవకాశం ఏర్పడటంతో నగరవాసులు కంటిని మెరిపించేందుకు విభిన్న రకాల ప్రయత్నాలు చేస్తున్నారన్నారామె. విచిత్రమేమిటంటే.. ఐ మేకప్ ఉత్పత్తుల విక్రయాలను ఇది పెంచడంతో పాటు గతంతో పోలిస్తే లిప్ స్టిక్స్ సేల్స్ కూడా చెక్కు చెదరలేదు. ‘నిమిషానికి 2 లిప్స్టిక్స్ చొప్పున మేం విక్రయించాం. దాదాపుగా 10లక్షల లిప్స్టిక్స్ సేల్స్ నమోదయ్యాయని’ ఆన్లైన్ విక్రయసంస్థ ప్రతినిధి చెప్పారు. అలాగే హెల్త్‌కేర్ సప్లిమెంట్స్, హెర్బల్ టీ ఐటమ్స్, హెయిర్ మాస్క్‌లు, ఫేషియల్ సెరమ్స్, టోనర్స్ కూడా మంచి సేల్స్ సాధించాయి. మాయిశ్చరైజర్స్, బాడీ లోషన్స్ మాత్రం సీజనల్ మార్పులకు అనుగుణంగా హెచ్చుతగ్గులకు గురవుతున్నాయి. నేచురల్.. ఫుల్.. కరోనా కాలంలో నేచురల్ మేకప్ ఉత్పత్తులకు డిమాండ్ ఏర్పడింది. లాక్డౌన్ ప్రారంభంలో నెమ్మదించిన సేల్స్.. అన్‌లాక్ నుంచీ అనూహ్యంగా ఊపందుకున్నాయి. పెరిగిన డిమాండ్‌కు తగ్గట్టుగా మొత్తం 750 బ్రాండ్స్, 50వేల ఉత్పత్తులకు పెంచాం. ప్రతి నెలా 300 కొత్త ఉత్పత్తులను పరిచయం చేస్తున్నాం. ఈ నెల 3 నుంచి 12 వరకూ ఐ హార్ట్ బ్యూటీ పేరిట పర్పుల్ డాట్ కామ్ వేదికగా అతిపెద్ద సేల్స్ నిర్వహిస్తున్నాం. – నిపుణ్ అనేజా, పర్పుల్ డాట్ కామ్. -
హెయిర్‌స్టైల్‌ను కట్ చేసే రోబోట్ రూపకల్పన
-
పోనీ టెయిల్ వేశాడు ఫ్యాషన్ బొమ్మను చేశాడు
అనుష్కశర్మ – విరాట్ కోహ్లీ... మోస్ట్ డిజైరబుల్ కపుల్. ఒకరు సినీతార, ఒకరు క్రీడా తార. ఇద్దరిదీ గ్లామర్ ఫీల్డే. సినీతారలైతే వెండి తెర మీదే కాదు బయట కూడా బంగారు బొమ్మల్లా అందంగా కనపడాలనుకుంటారు. అంతర్జాతీయ డ్రెస్ డిజైనర్లతో ప్రత్యేకంగా డిజైన్ చేయించుకుంటారు. ఇప్పుడు మేకప్, హెయిర్ స్టయిల్స్‌కి కూడా నిపుణులను ఎంచుకుంటున్నారు. బ్రిటన్‌తోపాటు ఇతర ఐరోపా దేశాల నుంచి, అమెరికాల నుంచి ప్రత్యేకమైన హెయిర్ స్టయిలిస్ట్లను పిలిచి, ఫ్యాషన్ ప్రపంచంలో కొత్త రకమైన హెయిర్ స్టయిల్‌తో కొత్తగా కనపడాలనుకుంటున్నారు. అనుష్క శర్మ కూడా మరింత వినూత్నంగా కనిపించాలనే లక్ష్యంతో ఫ్రెంచ్ నుంచి ఫ్లోరియన్ హ్యూరెల్ అనే హెయిర్ స్టయిలిస్టుని రప్పించుకున్నారు. వచ్చీరాగానే అనుష్కను అందాల బొమ్మలా చూపించడానికి ఫ్లోరియన్ హ్యూరెల్ తహతహలాడారు. ‘‘అక్టోబరు 27, దీపావళి రోజున అనుష్క శర్మను దీపకాంతులలో తళతళలాడుతూ, సంప్రదాయం ఉట్టిపడేలా, అందమైన పురాతన చిత్రపటంలా రెడీ చేయాలనుకున్నాను. జుట్టును లూజ్‌గా వదిలే యడం లేదా పోనీ టెయిల్ కట్టాలనుకున్నాను. పోనీ టెయిల్ అయితే చాలా అందంగా ఉంటుంది అనిపించింది. అంతే. వెంటనే అరేబియన్ గుర్రం తోకలాంటి పోనీటెయిల్ కట్టేశాను. ఆ చిన్న మార్పుతోనే అనుష్కశర్మ కళ్లలో కాంతులు కనిపించాయి’’ అని గుర్తు చేసుకున్నాడు ఈ ఫ్రెంచి స్టెయిలిష్ కుర్రవాడు. ‘ద స్కై ఈజ్ పింక్’ చిత్రంలో ప్రియాంక చోప్రాకు కూడా అతడు పనిచేశాడు. ‘అనుష్కశర్మ, విరాట్‌కోహ్లీ జంట అంటే నాకు చాలా ఇష్టం. అనుష్కశర్మ పర్ఫెక్ట్గా కనిపించడం కోసం నాకే చాయిస్ ఇస్తారు’ అని అంటాడు హ్యూరెల్. -
మీ హెయిర్ స్టైల్ పోలిసుల కంటపడకుండా చూసుకోండి
కర్ణాటక, మాలూరు: పట్టణంలోని పోకిరిలకు, ఆడపిల్లలను వేధించే వారికి పట్టణ పోలీసులు సోమవారం వినూత్న రీతిలో బుద్ధి చెప్పారు. గత వారం విద్యార్థిని రక్షిత హత్య ఉదంతం అనంతరం మేల్కొన్న పోలీసులు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో పట్టణంలో పోకిరిలు, ఆడపిల్లలను వేధించే వారు, వినూత్న రీతిలో హేర్ కటింగ్ చేయించుకున్న వారు, గడ్డాలు విడిచిన వారికి తగిన హెచ్చరికలు జారీ చేసే ప్రయత్నం చేపట్టారు. ఇందులో భాగంగా ఎస్ఐ ఎం. ఎన్ మురళి నేతృత్వంలోని పోలీస్ సిబ్బంది సోమవారం ఉదయం పట్టణంలోని ప్రముఖ వీధులలో సంచరించి స్టైల్‌గా గడ్డం పెంచిన వారిని, చిత్ర విచిత్రంగా తల వెంట్రుకలు పెంచిన వారిని గుర్తించి వారిని నేరుగా కటింగ్ షాపులకు తీసుకు వెళ్లి గడ్డాలను, స్టైల్ కటింగ్లను తీయించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎస్ఐ మురళి పట్టణంతో పాటు తాలూకాలోని ప్రతి గ్రామంలోను ఇలాంటి వారిని గుర్తించి గట్టిగా బుద్ధి చెబుతామన్నారు. పట్టణంలో బీట్ వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు. -
రెయిన్ ట్రీట్.. హెయిర్ కట్
ముసురుతో వాతావరణం చల్లగా ఉంది. ఇంతకుమించిన వెదర్ ఉండదనుకుంటూ వాకింగ్‌కి బయలుదేరింది రవళి. అర కిలోమీటరు నడిచిందో లేదో సడెన్గాకుంభవృష్టి. నిమిషంలో తడిసి ముద్దయింది. ఇంటికి తిరిగి వచ్చేసరికి జుట్టుపొడిబారింది. కానీ మొత్తం చిక్కులే చిక్కులు. అప్పుడిక తల స్నానం చేసే టైమ్‌లేక ఆదరాబాదరా దువ్వేసి ఆఫీస్‌కి వెళ్లింది. ఇలాంటి అలవాట్లు జుట్టుకు ఎంతైనా హానికరం అంటున్నారు కేశాలంకరణ నిపుణులు. సాక్షి, సిటీబ్యూరో : ‘వాన రాకడ... కరెంటు పోకడ’ చెప్పలేం అన్నట్టుగా ఉండే ఈ సీజన్లో నెత్తిన కురిసే నీళ్లు... మన ముఖ సౌందర్యానికి కారణమయ్యే వెంట్రుకలకు హానికరంగా పరిణమిస్తుంటాయి. ఎడాపెడా తడవడం, పొడి బారడం... మళ్లీ తడవడం, పొడిబారడం తరచూ ఇలాంటి పరిస్థితుల్ని ఎదుర్కోవడం ఈ సీజన్లో సహజం. అయితే దీని వల్ల జుట్టు చిక్కులు పడిపోవడం లాంటి సాధారణ సమస్యల నుంచి వెంట్రుకలు ఊడిపోవడం తదితర తీవ్రమైన సమస్యలూ వస్తాయని, వర్షాకాలం జుట్టుకు చేసే హాని అంతా ఇంతా కాదని అంటున్నారు కేశాలంకరణ నిపుణులు. దీనికి సంబంధించి వీరు ఇస్తున్న సూచనలివీ... ⇔ వాన నీరు మురికి, ఎసిడిక్‌గా ఉంటుంది. అందుకే వర్షంలో తడిసిన వెంటనే తలని శుభ్రం చేసుకోవాలి. అలా కాకుండా గంటల తరబడి, రోజుల తరబడి అలానే ఉంచుకుంటే జుట్టుకి హాని కలిగే అవకాశాలెక్కువ. ⇔ వారానికి రెండుసార్లు తప్పనిసరిగా తలకు షాంపూ పెట్టుకోవాలి. మైల్డ్ డీప్ క్లీన్సింగ్ షాంపూ వాడితే మురికిని మూలాల నుంచి తొలగిస్తుంది. ⇔ వెంట్రుకల కుదుళ్లను సైతం శుభ్రపరిచి ఫంగల్ బ్యాక్టీరియా అంటువ్యాధుల నుంచి రక్షణ కల్పించే ప్యాంటీన్ ప్రొ–వి లాంటి షాంపూని తల ఉపరితలానికి పట్టేలా వినియోగించాలి. ⇔ జుట్టు పొడిబారుతుంది కాబట్టి నూనె పట్టించాలి. డీప్ కండిషనింగ్గా కూడా ఇది పనిచేస్తుంది. ⇔ ఈ సీజన్లో హెయిర్‌ని ముడివేసే స్టైల్స్ మంచిది కాదు. వర్షం నీరు నెత్తిపై నిల్వ ఉండడానికి ఇది దోహదం చేస్తుంది. తప్పదనుకుంటే లూజ్ పోనీటెయిల్స్ లేదా బన్స్కు పరిమితమవ్వాలి. ⇔ వీలుంటే నాణ్యమైన వాటర్ ప్రూఫ్ జాకెట్ లేదా హుడీ (తల మీద నుంచి నడుము వరకు ఉండే కోట్)ని ధరించి బయటకు వెళ్లడం ఉత్తమం. ⇔ సరైన దువ్వెన, పళ్ల మధ్య తగినంత గ్యాప్ ఉండేది ఎంచుకోవాలి. దీనితో కుదుళ్ల నుంచి దువ్వడానికి అవకాశం ఉంటుంది. ⇔ అత్యధికంగా కండిషన్నర్ వాడొద్దు. కండిషనర్‌ని కేవలం వెంట్రుకల చివర్లు, లెంగ్తŠస్ మీద మాత్రమే అప్లయ్ చేయండి. ⇔ వెంట్రుకల కుదుళ్ల నుంచి శక్తివంతంగా మార్చడానికి ప్రొటీన్, ఐరన్ ఉండే ఆహారం తీసుకోవాలి. మ్యాకెరెల్, సాల్మన్ లాంటి చేపలు... వాల్నట్స్, పెరుగు, పాలకూర తదితర బాగా తీసుకోవాలి. ⇔ ఈ సీజన్లో హెయిర్ స్టైల్స్ మెయింటెయిన్ చేయడం సవాల్. అందుకే షార్ట్‌గా కత్తిరించుకుంటే బెటర్. జాగ్రత్తలు అవసరం... తల వెంట్రుకలకి వర్షాకాలం పరీక్ష లాంటిదని చెప్పాలి. ఈ సీజన్లో హెయిర్‌ని పరిరక్షించుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే అది ఒక్కోసారి తీవ్రమైన సమస్యలకు దారి తీస్తుంది. అయితే కొంచెం కేర్ తీసుకుంటే ఈ సీజన్‌ని తేలిగ్గా దాటేయవచ్చు. – సృజన, కేశాలంకరణ నిపుణురాలు -
ఫ్యాషన్ మాయ. .మారింది మామ..
తెరపై మెరవాలంటే ఆహార్యం అదిరిపోవాలి. సినిమాకో గెటప్‌లో ప్రేక్షకులను అలరించాలి. శోభన్‌బాబు, ఎన్టీఆర్, ఏఎన్నార్,ఎస్వీఆర్, కృష్ణ... ఇలా ఎందరికో విభిన్న లుక్లిచ్చి, తెరపై క్లిక్‌మనిపించిన ఘనత కృష్ణానగర్కే దక్కింది. రింగురింగుల జుట్టుతో శోభన్‌బాబును, గుబురు జుట్టుతో ఎన్టీఆర్‌ను అద్భుతంగా చూపించిన ప్రతిభ ఇక్కడి ఆర్టిస్టులకే సొంతమైంది. ఆనాటిసినిమాల నుంచి నేటి బాహుబలి వరకు హీరోహీరోయిన్లగెటప్లకు సంబంధించి అన్నీ కృష్ణానగర్నే అందించింది.అయితే పరిస్థితులు మారాయి. పద్ధతులు మారాయి.ఫ్యాషన్ మారింది. కట్టుబొట్టులో ఎన్నో మార్పులు వచ్చాయి.కానీ పని మాత్రం ఇక్కడి నుంచే కొనసాగడం విశేషం. బంజారాహిల్స్: తెరపై కథానాయకులు, కథానాయికల వేషధారణ ఎంతో ముఖ్యం. తలకట్టుతో పాటు డ్రెస్సింగ్ ఇందులో కీలకం. ఒకప్పుడు విగ్గుల నుంచి మొదలు వేషధారణలకు అనుగుణంగా రూపొందించే దుస్తుల డిజైన్లన్నీ కృష్ణానగర్‌లోనే రూపుదిద్దుకునేవి. ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్‌బాబు, ఎస్వీఆర్, కాంతారావు.. ఇలా ఎంతోమంది కథానాయకులకు కావాల్సిన విగ్గులను ఇక్కడి వారే తయారు చేసి అందించేవారు. ఒకప్పుడు విగ్గులను పెట్టడం చాలా కష్టంగా ఉండేది. పాతికేళ్ల కిందట విగ్గులను నట్ల సాయంతో అమర్చేవారు. దీంతో ధరించే వారికి కొంత భారంగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. నట్ల స్థానంలో క్లిప్పులు వచ్చాయని చెప్పారు కృష్ణానగర్‌లోని శ్రీసాయి విగ్స్ నిర్వాహకులు ఎ.సుబ్బారావు. ఒకప్పుడు విగ్గు తయారు చేయడం చాలా కష్టంగా ఉండేదని, చెన్నై నుంచి జుట్టు దిగుమతి చేసుకొని రూపొందించే వాళ్లమని పేర్కొన్నారు. ఎన్నెన్నో మార్పులు... అప్పట్లో విగ్గులను కేవలం జుట్టుతోనే రూపొందించేవారు. కానీ ఇప్పుడు వాటి స్థానంలో సింథటిక్, హ్యూమన్ హెయిర్ విగ్స్, ఆర్గానిక్ విగ్స్... ఇలా ఎన్నో రకాలు వచ్చాయి. వీటికి అవసరమైన కలరింగ్‌తో కూడిన విగ్స్ కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిని ఇప్పుడు కృష్ణానగర్‌లోనే తయారు చేసి ఇండస్ట్రీ అవసరాలు తీరుస్తున్నారు. కానీ డిజిటల్ మార్పుల నేపథ్యంలో హెయిర్ డిజైన్లు పూర్తిగా మారిపోయాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరూ హెయిర్ స్టైలిస్ట్‌లను నియమించుకుంటున్నారు. వారి పాత్రకు అనుగుణంగా తమ తలకట్టును తీర్చిదిద్దుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ముంబై నుంచి హెయిర్ స్టైలిస్ట్‌లు ఇక్కడికి వచ్చేస్తున్నారు. నయా డిజైన్స్ ఆగయా... సినిమాల్లోని వివిధ వేషధారణలకు కావాల్సిన దుస్తులను కృష్ణానగర్‌లో అద్దెకిస్తారు. డాక్టర్, పోలీస్ ఆఫీసర్, లాయర్... ఇలా ఏ పాత్రకైనా నిమిషాల్లో దుస్తులను సరఫరా చేస్తారు. అయితే ఇప్పుడు ఇండస్ట్రీకి అవసరమైన దుస్తులు ఇక్కడి నుంచే అందిస్తున్నా... వాటి రూపురేఖలు మారుతున్నాయి. నవతరం డిజైనర్లు సరికొత్త మార్పులు తీసుకొస్తున్నారు. ఇక్కడి స్టైలిస్టులతోనే నూతన డిజైన్స్‌కు అనుగుణంగా దుస్తులను తీర్చిదిద్దుతున్నారు. డ్రెస్సుల డిజైనింగ్‌లో చాలా మార్పులు చోటుచేసుకున్నాయని కృష్ణానగర్‌కు చెందిన కాస్ట్యూమ్ డిజైనర్ ఖాదర్ పేర్కొన్నారు. ప్రస్తుత హీరోహీరోయిన్లు తమకు కావాల్సిన డ్రెస్సులను డిజైనర్లతో డిజైన్ చేయించుకుంటున్నారని చెప్పారు. ఇప్పుడంతా నెట్లోనే... ఒకప్పుడు స్థానిక హైయిర్ స్టైలిస్టులపైనే ఆధారపడేవారు. కానీ ఇప్పుడు వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా తీసుకొస్తున్నారు. ‘మహానటి’ సినిమాలో కీర్తిసురేష్ కోసం 180 డిజైన్లను పరిశీలించాం. గతంలో సొంతంగా ఆలోచించి డిజైన్ చేసేవాళ్లం. కానీ ఇప్పుడంతా ఇంటర్నెట్లోనే పరిశీలిస్తున్నాం. గ్రాఫిక్స్‌లోనే హెయిర్ స్టైల్ ఎలా ఉంటుందో ముందే చూపిస్తున్నాం. – రజబ్ అలీ, హెయిర్ స్టైలిస్ట్ డిజైన్ వారిది.. తయారీ మాది సినీ ఇండస్ట్రీతో దాదాపు 35 ఏళ్ల అనుబంధం ఉంది. ఎంతోమంది నటీనటులకు డ్రెస్సులను డిజైన్ చేశాం. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. కొత్తగా డిజైనర్లు వచ్చారు. వారి రూపొందించిన డిజైన్లకు అనుగుణంగా మేము దుస్తులను తయారు చేస్తున్నాం. గతంలో అయితే మా అభిరుచి మేరకు మేమే రూపొందించేవాళ్లం. – ఖాదర్, కాస్ట్యూమ్ డిజైనర్ ట్రెండ్స్‌కు అనుగుణంగా... విగ్గుల విషయంలో చాలా మార్పులు వచ్చాయి. ఒకప్పుడు విగ్గు కావాలంటే నలుపుదో, తెలుపుదో ఇచ్చేవాళ్లం. కానీ ఇప్పుడు ట్రెండ్‌కు అనుగుణంగా విగ్గుల రంగులు, స్టైల్స్ మారాయి. ఆయా మార్పులకు అనుగుణంగా తయారు చేసిస్తున్నాం. అవసరమైతే ఇతర ప్రాంతాల నుంచి కావాల్సిన సింథటిక్ జుట్టును తీసుకొస్తున్నాం. – సుబ్బారావు, శ్రీసాయి విగ్స్ గిరాకీ తగ్గింది... నేను 20ఏళ్లుగా కృష్ణానగర్‌లో షాపు ఏర్పాటు చేసుకొని సినిమా వేషాలకు కాస్ట్యూమ్స్ అద్దెకిస్తున్నాను. అప్పట్లో నా దగ్గరే పాత్రలకు తగిన విధంగా డ్రెస్సులు ఉండేవి. వాటినే అద్దెకు తీసుకొనేవారు. అయితే దశాబ్ద కాలంగా హీరోహీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లు సొంతంగా కాస్ట్యూమ్ డిజైనర్లను నియమించుకుంటుండడంతో మాకు గిరాకీ తగ్గింది. – సంగప్ప, కాస్ట్యూమ్స్ విక్రేత -
మోడల్స్ ట్రెండీ..
మోడల్స్ ట్రెండీ హెయిర్ స్టైల్స్‌తో సందడి చేశారు. శేరిలింగంపల్లి హుడా ట్రేడ్ సెంటర్ కాలనీలో వసుంధర సెలూన్, స్పాను శుక్రవారం ప్రారంభించారు. మోడల్స్ పాల్గొని వయ్యారి నడకతో హయలొలికించారు. స్పా డైరెక్టర్ అరుణకుమారి ఉన్నారు. -
అవును.. లవ్‌లో పడ్డాను!
కేశాలంకరణలు పలు రకములు. తెలియాలే కానీ రకరకాల స్టైల్స్ చేసుకోవచ్చు. లావణ్యా త్రిపాఠి అయితే ఏకంగా హెయిర్‌తో హార్ట్ డిజైన్ కూడా చేసుకోగలుగుతారు. ఇక్కడ మీరు చూస్తున్నారుగా! ఇంతకీ ఈ అందాల రాక్షసి హృదయాన్ని ఎవరైనా దోచుకున్నారేమో... అందుకే అతగాడి కోసం ఇలా హెయిర్‌ని హార్ట్‌గా మార్చారేమో అనుకుంటున్నారా? అదేం కాదు. హెయిర్‌తో ఏదైనా ప్రయోగం చేయాలని పించిందట. హార్ట్ అయితే ఈజీగా ఉంటుందని ట్రై చేశానని లావణ్య తెలిపారు. ‘‘యాక్చువల్‌గా పువ్వులా స్టైల్ చేసుకుందామనుకున్నా. కానీ, అది చాలా కష్టం. అందుకే హార్ట్ ఈజీగా ఉంటుందని ఇలా చేశా. లవ్‌లో పడ్డారా? అని అడిగారు కదా.. అవునండి. లైఫ్‌తో లవ్‌లో పడ్డా’’ అన్నారు. -
క్రౌన్ బ్రెయిడ్
సిగ సింగారం హెయిర్ స్టైల్స్ అనగానే చాలా మంది భయపడతారు జుట్టున్నమ్మ ఏ కొప్పు పెట్టినా చెల్లుతుంది అని. కానీ, పొట్టి జుట్టు, పల్చని జుట్టు ఉన్న వారు కూడా అందమైన కేశాలంకరణలను తీర్చిదిద్దుకోవచ్చు. ఇక్కడ ఇస్తున్న క్రౌన్ కేశాలంకరణను 5 నిమిషాలలోనే వేసుకోవచ్చు. వేడుకలలో శిరోలంకరణతోనే కిరీటాన్ని తలదాల్చిన మహారాణిలా వెలిగిపోవచ్చు. 1. జుట్టును చిక్కుల్లేకుండా పై నుంచి కిందవరకు దువ్వాలి. నుదుటికి రెండువైపులా ఉన్న జుట్టును పై నుంచి నాలుగు పాయలు తీసుకోవాలి. 2. ఎడమ వైపు, కుడివైపు రెండువైపులా నాలుగు పాయల జడలను విడి విడిగా అల్లాలి. 3. ముందుగా అల్లిన కుడి జడ కింద నుంచి మరో నాలుగు పాయలు తీసుకొని మళ్ళీ జడ అల్లాలి. 4. ఆ తర్వాత ఎడమ జడ కింద నుంచి మరో నాలుగు పాయలు తీసుకొని జడ అల్లాలి. 5. ఒకవైపు రెండు, మరో వైపు రెండు మొత్తం నాలుగు జడలు పూర్తవ్వాలి. 6. ముందుగా అల్లిన పై జడలను చివరల వరకు అల్లి, కింద రెండు జడలను సగం వరకు అల్లాలి. 7. పై రెండు జడలను, కింది రెండు జడలను కలిపి క్రాస్‌గా అమర్చాలి. 8. ఈ నాలుగు జడలను కలిపి పూర్తిగా చివరి వరకు అల్లాలి. 9. జడ ఎడమ నుంచి కుడివైపు చెవి మీదుగా తీసుకెళ్లాలి. 10. నడి నెత్తి మీద జడల చివరల వెంట్రుకలు బయటకు రాకుండా జాగ్రత్తగా మడచి పిన్నులు పెట్టాలి. చిన్న చిన్న స్టోన్స్ ఉన్న క్లిప్స్‌ను కూడా ఈ అలంకరణలో ఉపయోగించవచ్చు. ఐదు నిమిషాలలో మీ కేశాలంకరణ ఇలా అందమైన కిరీటంలా మారిపోతుంది. -
ఆకట్టు... అండర్ కట్..
న్యూలుక్ తలకట్టు అలంకరణ ఓ సింగారం. కురుకులను అందంగా సింగారించుకోవడం ఓ కళ. అందుకు వేలాది కేశాలంకరణలు మతులు పోగొడుతున్నాయి. వాటిలో ఇప్పుడు ప్రత్యేకంగా దారిచూసుకుని వచ్చేసింది అండర్కట్. తలకట్టు కింది భాగంలో మరో అందమైన ‘కట్’ దీని ప్రత్యేకత. * టాటూలు ఒంటిమీద వేయించుకోవడం, అందమైన డిజైన్లను రూపొందించుకోవడం తెలిసిందే! తలకట్టు కింది భాగంలో టాటూని తలపించేలా ‘కట్’ డిజైన్ చేస్తే.. ఇలా చూడచక్కని హెయిర్ స్టైల్స్ దర్శనమిస్తాయి. వాటిలో పువ్వులు, నక్షత్రాలు, కోణాకృతులు.. ఎన్నో. * కట్ డిజైన్ ఒక్కటే అయితే ఏం బాగుంటుంది అనుకున్నారేమో ఇప్పుడు ఆ డిజైన్ తలకట్టు కింది భాగంలో మరింత మెరుపులీనుతూ కనిపించాలని గ్లిటర్స్ ఉపయోగిస్తున్నారు. అందులో భాగంగా ఈ డిజైన్స్ రంగురంగుల గ్లిటర్స్తో అందంగా మెరిసిపోతున్నాయి. * విదేశాల నుంచి దిగుమతి అయిన ఈ ట్రెండ్ ఇప్పుడిప్పుడే మార్కెట్లో దర్శనమిస్తోంది. ఆడ-మగ ఇద్దరినీ విశేషంగా ఆకట్టుకుంటున్న ఈ కట్ని మీరూ ఫాలో అవాలనుకుంటే కట్‌తో పాటు గ్లిటర్కి కూడా కాస్త పనిచెప్పండి. వేడుకగా మెరిసిపోండి. -
హార్ట్లీ హాట్
సిగ సింగారం ఇది హార్ట్ బన్ హెయిర్ స్టయిల్.. దీన్ని యువత బాగా ఇష్టపడుతుంది. గాగ్రా, లాంగ్ స్కర్ట్స్, జీన్స్‌కు ఈ హెయిర్ స్టయిల్ బాగా నప్పుతుంది. ఇందులో హార్ట్ షేప్ డిజైన్ ఉండటం వల్ల దీన్ని ‘హార్ట్ బన్’ అంటారు. దీన్ని చాలామంది అమ్మాయిలు వాలెంటైన్స్‌డే రోజు తప్పకుండా వేసుకుంటారట. అంత అందంగా ఆకర్షణీయంగా ఉండే ఈ హార్ట్ బన్ను మీరూ ట్రై చేయండి. 1. ముందుగా జుత్తును చిక్కులు లేకుండా దువ్వుకోవాలి. అలాగే ఈ హెయిర్ స్టయిల్‌కు కర్లీ హెయిర్ బాగా నప్పుతుంది కాబట్టి మీ జుత్తును ఫొటోలో కనిపిస్తున్న విధంగా హెయిర్‌ను కర్లీగా చేసుకోండి. 2. ఇప్పుడు ముందు భాగం నుంచి జుత్తును రెండుభాగాలుగా విడదీసి.. విడివిడిగా రెండు రబ్బర్ బ్యాండ్లు పెట్టాలి. తర్వాత చిక్కులు లేకుండా జుత్తునంతా దువ్వుకోవాలి. 3. ఆపైన ఆ రెండు పోనీలలో ఒకదాన్ని తీసుకొని మెలితిప్పాలి. అప్పుడు మిగిలిన పోనీ కదలకుండా జాగ్రత్త పడాలి. 4. ఆ మెలితిప్పిన పోనీని ఫొటోలో కనిపిస్తున్న విధంగా తిప్పుకుంటూ పోవాలి. 5. ఇప్పుడు దాన్ని హార్ట్ షేప్‌లో సగభాగంలా చేసి ఫొటోలో కనిపిస్తున్నట్టుగా మూడు చోట్ల స్లైడ్స్ పెట్టేయాలి. 6. అలాగే రెండో పోనీని కూడా మెలితిప్పాలి. చిన్న చిన్న వెంట్రుకలు మధ్యలో వస్తూ ఉంటే.. హెయిర్ స్ప్రే చేసుకుంటే సరి. 7. ఇప్పుడు ఆ మిగిలిన హార్ట్ భాగాన్ని రెండో పోనీతో పూర్తి చేసి స్లైడ్స్ పెట్టేయాలి. తర్వాత హార్ట్ షేప్ కరెక్ట్‌గా వచ్చిందా లేదా చూసుకోవాలి. రెండు పోనీల చివర్లు కలిసిన చోట మరో రెండు స్లైడ్స్ లేదా ఏదైనా క్లిప్ లేదా ఆర్టిఫీషియల్ ఫ్లవర్‌తో అలంకరించుకొని, మరోసారి జుత్తునంతా దువ్వుకోవాలి.. అంతే! మీ హార్ట్ బన్ అందరి హార్ట్స్‌ను కొల్లగొట్టడం ఖాయం. -
రివర్స్ బ్రెయిడెడ్ బన్..
సిగ సింగారం ఈ హెయిర్ స్టయిల్‌ను సమ్మర్ స్పెషల్‌గా చెప్పుకోవచ్చు. సాధారణంగా మనం ఏదైనా ఫంక్షన్‌కో లేక ఆఫీసుకో వెళ్లినప్పుడు రకరకాల హెయిర్ స్టయిల్స్‌ను వేసుకుంటాం. కానీ ఇంటికి రాగానే ఆ జుత్తునంతా పైకి లాగి, రబ్బర్బ్యాండుతోనో క్లిప్తోనో పైకి పెట్టేసుకుంటాం. అవునా.. కానీ ఈ రివర్స్ బ్రెయిడెడ్ బన్ను వేసుకుంటే అలా రెండు పనులు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటారా? దానికి సమాధానం మీకు పక్కనున్న ఫొటోను చూడగానే అర్థం అవుతుంది. మరి ఆలస్యమెందుకు.. వెంటనే ఈ రివర్స్ బ్రెయిడెడ్ బన్ను ట్రై చేయండి. 1. జుత్తునంతా ఫొటోలో కనిపిస్తున్న విధంగా ముందుకు వేసుకొని, చిక్కులు లేకుండా దువ్వుకోవాలి. అలా దువ్వుకునేటప్పుడు ఆ దువ్వెనను నీళ్లలో ముంచుకుంటూ చిక్కులు తీసుకుంటే జుత్తు సాఫ్ట్‌గా అవుతుంది. 2. ఆపైన జుత్తును మూడు పాయలుగా తీసుకొని జడలా కొద్దివరకు అల్లాలి. తర్వాత రెండు పక్కల నుంచి రెండు పాయలను తీసి ఈ జడలో కలుపుకోవాలి. ఆపైన మళ్లీ రెండు పాయలను తీసి అల్లుకుపోవాలి. (అల్లుకునేటప్పుడు మధ్యమధ్యలో హెయిర్‌స్ప్రేతో స్ప్రే చేసుకోవడం మంచిది. అలా చేస్తే అల్లుతున్నప్పుడు పొట్టి వెంట్రుకలు పాయల నుంచి విడిపోకుండా ఉంటాయి) 3. అలా రెండు పక్కల నుంచి రెండు పాయల్ని తీసి కలుపుకుంటూ నడినెత్తి మీద కాకుండా కొంచెం కింద వరకు అల్లి ఆపేయాలి. తర్వాత మిగిలిన జుత్తుకు రబ్బర్‌బ్యాండ్ పెట్టేయాలి. 4. ఆ మిగిలిన పోనీని అందంగా మెలిక తిప్పుకుంటూ లేదా గుండ్రంగా చుడుతూ కొప్పు పెట్టుకోవాలి. ఆ కొప్పును ఆ బ్యాండ్‌తోనే టై చేసుకోవాలి. లేదూ అనుకుంటే.. వేరే రబ్బర్బ్యాండునూ ఆ కొప్పుకు పెట్టుకోవచ్చు. (ఇప్పుడు ఆ కొప్పు బన్ ఆకారంలోకి వచ్చేలా చూసుకోవాలి) 5. ఇప్పుడు అల్లుకున్న జడ మరీ టైట్‌గా లేకుండా పాయల్ని కొద్దికొద్దిగా కదిలిస్తూ వదులు చేసుకోవాలి. మరీ వదులుగా చేసుకున్నా లుక్ పోతుంది, కాబట్టి జాగ్రత్తగా ఒక్కోపాయను కదిలించాలి. అంతేకాదు కొప్పు కూడా గుండ్రంగా, కొంచెం వదులుగా ఉంటేనే ఈ హెయిర్ స్టయిల్ అందంగా ఉంటుంది. 6. తర్వాత ఫొటోలో కనిపిస్తున్నట్టుగా ఫ్లవర్ బీడ్స్‌ను పాయలకు పెట్టాలి. అంతేకాదు కొంచెం పెద్ద సైజులో ఉన్న పూల గుత్తిని మీ జుత్తుకు పెట్టుకోవాలి. దాంతో మీ కొప్పు అందమే మారిపోతుంది. కావాలంటే మీ డ్రెస్‌కు మ్యాచ్ అయ్యే కలర్ బీడ్స్, పూలగుత్తిని పెట్టుకోవచ్చు. .... చెప్పడం కాదు కానీ.. ఓసారి ఫొటోపై లుక్కేయండి చాలు. ఈ రివర్స్ బ్రెయిడెడ్ బన్‌కు మీరు ఫ్యాన్ అవ్వక తప్పదు. ఈ బీడ్స్ లాంటివి షాపుల్లో విరివిగా దొరుకుతున్నాయి. ఇక కేశాలంకరణలో నో కాంప్రమైజ్... బీడ్స్ తో అలంకరించుకోవాలి. అలా చేస్తే మీ హెయిర్ స్టయిల్ చాలా అందంగా ఉంటుంది. -
అందానికి ఉల్లి తోడు!
సౌందర్య పోషణలో కురులదే కీలకపాత్ర. అందులోనూ స్త్రీలకు ఒత్తై తలకట్టు అందాన్నిస్తుందన్నది నిర్వివాదాంశం కూడా. తలవెంట్రుకలు రాలిపోయే సమస్యతో బాధపడేవారి పాలిట ఉల్లి మంచి మందు. అంతేకాదు, కొందరికి పేను కొరుకుడు వల్ల తలపై అక్కడక్కడ పాయలు పాయలుగా జుట్టు ఊడిపోయి, అసహ్యంగా కనపడుతుంది. అటువంటివారు ఉల్లిపాయను మెత్తగా చితక్కొట్టి లేదా మిక్సీలో వేసి రసం తీసి నెత్తిమీద వెంట్రుకలు పలుచగా ఉన్న చోట రాసుకుంటే నిద్రాణంగా ఉన్న వెంట్రుకల కుదుళ్లు చైతన్యవంతమై, తిరిగి అక్కడ జుట్టు మొలుస్తుందట. ఉల్లిలో ఉండే సల్ఫర్ జీవక్రియలను వేగవంతం చేయడం వల్ల ఇలా జరుగుతుందని శాస్త్రపరిశోధనలు నిరూపిస్తున్నాయి. ఉల్లిపాయను బాగా దంచి, రసం తీసి, కొబ్బరినూనెలో లేదా ఇతర కేశవర్థక తైలాలలో కలిపి తలకు రాసుకున్నా మంచి ఫలితమే. చుండ్రుతో బాధపడేవారు ఉల్లిరసంలో కొద్దిగా తేనె, నిమ్మరసం కలిపి మాడుకు పట్టించి, అరగంట తర్వాత షాంపూతో తలస్నానం చేస్తే అందం ద్విగుణీకృతం అవుతుంది... నిజం! ఉల్లితోడు! అన్నట్టు ఉల్లికి ఆడ, మగ తేడా ఏమీ లేదు. మగవాళ్లు కూడా ఉల్లిరసం రాసుకోవచ్చు. -
ఏమిటీ గ‘లీజు’..?
ఈ దుకాణాన్ని చూశారా..శ్రీకాకుళం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉంది. స్వప్న హెయిర్ స్టైల్స్ పేరుతో..ఓ సెలూన్‌ను నిర్వహిస్తున్నారు. దీనిని..మాజీ కౌన్సిలర్ లండ శ్రీను..మున్సిపాలిటీ నుంచి లీజుకు తీసుకున్నారు. అయితే..దీనిని ఆయన నిర్వహించకుండా..టి.నాగరాజు అనే వ్యక్తికి సబ్ లీజుకు ఇచ్చారు. ఇలా..మున్సిపాలిటీలో..సబ్ లీజుల పర్వం నడుస్తోంది. మున్సిపాలిటీ నుంచి దుకాణాలను తక్కువకు దక్కించుకుని..వాటిని సబ్ లీజులకు ఇచ్చి..అద్దెలు వసూలు చేసుకోవడం ఇక్కడ పరిపాటిగా మారింది. సాక్షాత్తూ..మున్సిపల్ కార్యాలయం ఎదురుగానే..సబ్ లీజుల దందా నడుస్తోందంటే..పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. రిమ్స్‌క్యాంపస్: జిల్లాలో శ్రీకాకుళం, ఆమదాలవలస, ఇచ్ఛాపురం, పలాస మున్సిపాలిటీలు,రాజాం, పాలకొండ నగర పంచాయతీలు ఉన్నాయి. వీటి పరిధిలో వందలాది దుకాణాలు ఉన్నాయి. వీటిని..నిరుపేద వ్యాపారుల అభ్యన్నతి కోసం లీజు ప్రాతిపదికన కేటాయిస్తున్నారు. టెండర్ల ప్ర క్రియ ద్వారా తక్కువ అద్దెలను వసూ లు చేస్తున్నారు. ఇక్కడే కొందరు గలీ జు దారులు తమ చాణక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ప్రభుత్వ ఆలోచనకు తూట్లు పొడుస్తూ..తక్కువ అద్దెలకు దుకాణాలను అద్దెకు తీసుకుని..సబ్ లీజులకు ఇస్తున్నారు. అధిక మొత్తాల్లో అద్దెలను వసూ లు చేసుకుంటున్నారు. ఇలా..70 శాతం దుకాణాలు సబ్లీజులకిచ్చినట్టు తెలుస్తోంది. వాస్తవానికి సబ్‌లీజ్‌కు దుకాణాలను ఇవ్వటం నిబంధనలకు విరుద్ధం. అయినా..అధికారులు పెద్దగా దృష్టి సారించడం లేదు. 331 దుకాణాలకు గాను..200 వరకు సబ్ లీజులే... శ్రీకాకుళం మున్సిపాలిటీలో..ఈ పరిస్థితి మరింత ఎక్కువగా ఉంది. మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 14 షా పింగ్ కాంప్లెక్స్‌లు ఉన్నాయి. వీటిలో మొత్తం 402 దుకాణాలు ఉండగా..331 దుకాణాలను లీజ్‌కు ఇచ్చారు. మిగిలిన 71 ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి. అయితే..లీజ్‌కు తీసుకున్న 331 దుకాణాల్లో సుమారు 200 వరకు సబ్‌లీజులకు వెళ్లినట్టు తెలుస్తోంది.ఇలా సబ్‌లీజుల వ్యవహారం నడుపుతున్న వారంతా..రాజకీయ పలుకుబడి ఉన్నవారు..మున్సిపల్ కౌన్సిలర్లుగా పనిచేసిన వారే కావడం గమనార్హం. పత్తాలేని గుడ్‌విల్ ప్రతిపాదనలు లీజు దుకాణాలను సబ్‌లీజులకు ఇస్తున్న వైనంపై మున్సిపల్ అధికారులు గతంలో గుడ్‌విల్ ప్రతిపాదనలు చేశారు. లీజు దారుల నుంచి సబ్ లీజుకు తీసుకుని అద్దె చెల్లిస్తున్న వారికే నేరుగా దుకాణాలను కట్టబెట్టే ఆలోచన చేశారు. వారి నుంచి కొంత గుడ్‌విల్‌ను మున్సిపాలిటీకి ఇవ్వాలని ప్రతిపాదించారు. ఒక్కో దుకాణానికి సుమా రు *లక్ష వరకు తీసుకుని..దుకాణాలను కట్టబెట్టాలని ఆలోచన చేశారు. కానీ ఈ ప్రతిపాదనలకు పత్తా లేకుం డా పోయింది. ఇప్పటికైనా అధికారులు దృష్టి సారిం చి..ఈ బాగోతానికి చెక్ చెప్పాలని పలువురు కోరుతున్నారు. -
అద్దంలో అందగత్తె
కొన్ని రోజులుగా తెలుగు ప్రేక్షకులు మిస్సవుతున్న నటి సంజన కొత్తగా బిజెనెస్ రంగంలోకి కాలుపెట్టింది. హెయిర్ స్టైల్స్, మేకప్, సౌందర్య సేవలందించే సెలూన్ వ్యాపారంలో అడుగిడింది. ప్రముఖ సెలూన్ సంస్థ మిర్రర్లో భాగస్వామ్యం తీసుకుని వ్యాపార విస్తరణలో మునిగిపోతోంది. మిర్రర్ బ్యూటీ అకాడమీ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్యాషన్ షోలో ఈ ముద్దుగుమ్మ మెరిపించింది. ఈ సందర్భంగా కాసేపు ‘సిటీప్లస్’తో ముచ్చటించింది. ‘తెలుగు అంటే చాలా ఇష్టం. ఇక్కడి పరిశ్రమ ఎంతో ప్రోత్సహించింది. టాలీవుడ్ అంతగా అచ్చిరాలేదు. కన్నడ, మళయాళంలో హిట్లున్నాయి. త్వరలో తెలుగులో ఆర్పీ పట్నాయక్ దర్శకత్వంలో సరదా సినిమాలో నటించబోతున్నా. ఎప్పటికీ తెలుగు పరిశ్రమను వదలిపెట్టను. మంచి కథ దొరికితే తప్పకుండా నటిస్తా. బ్యూటీ అనేది క్రియేటివిటీకి అవకాశం ఉన్న రంగం. నాకు చాలా ఆసక్తి. హాలీవుడ్ మేకప్ ఆర్టిస్టు రాబిన్ స్లేటర్ వద్ద బ్యూటీ టిప్స్ నేర్చుకున్నా. ఆ స్థాయి నిపుణులు మనకు అవసరం. -
ఏళ్లు గడిచినా... వీళ్లింతే!
వీక్షణం కాలం మారేకొద్దీ మనుషులు మారుతూ ఉంటారు. వారి వేషభాషలు, అలవాట్లు, అభిరుచులు... అన్నీ మారతాయి. కానీ ‘రాకబిల్లీ కమ్యూనిటీ’కి చెందినవారిలో మాత్రం ఏ మార్పూ కనిపించదు. ఎందుకంటే... వారు మార్పును ఇష్టపడరు. గతంలో జీవించడమే వారికిష్టం! అమెరికాలో ‘రాకబిల్లీ కమ్యూనిటీ’ అనే ఒక సమూహం ఉంది. వీరంతా 1950ల నాటి వస్త్రధారణలో కనిపిస్తారు. వారి హెయిర్ స్టయిల్స్ కూడా నాటి కాలంలో మాదిరిగానే ఉంటాయి. అది మాత్రమేనా... వారి ఇళ్లలో ఉండే వస్తువులు, వాడే కార్లు కూడా పాత కాలం నాటివే ఉంటాయి. వంట సామాన్ల దగ్గర్నుంచి ఫర్నిచర్ వరకూ అన్నీ అరవై, డెబ్భై దశాబ్దాల క్రితానికి మనల్ని లాక్కుపోతాయి. ఇదంతా ఏంటి అంటే... ‘ఇది మా కమ్యూనిటీ ప్రత్యేకత’ అంటారు వారంతా. ‘గతంలో బతకడంలో ఓ సంతోషం ఉంటుంది. నాటి రోజులు మంచివి. అందుకే ఆ రోజుల నుంచి బయటపడటం మాకు ఇష్టం లేదు’ అని కూడా చెబుతుంటారు. కాలంతో వచ్చే మార్పులు నచ్చనివారు, నాటి సంస్కృతీ సంప్రదాయాల మీద మక్కువ ఎక్కువగా ఉన్నవారు కొందరు కలిసి ‘రాకబిల్లీ కమ్యూనిటీ’గా ఏర్పడ్డారు. అలాగని వీళ్లు నిరక్షరాస్యులేమీ కాదు. అందరూ చదువుకున్నవాళ్లు, మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్నవారు. అయినా కూడా వాళ్లు ఇలానే ఉంటారు, ఇలానే బతుకుతారు. చాలా యేళ్లుగా ఉన్న ఈ కమ్యూనిటీ గురించి జెన్నిఫర్ గ్రీన్బర్గ్ అనే ఫొటోగ్రాఫర్ ద్వారా వెలికి వచ్చింది. పరుగులు తీస్తోన్న ఆధునికత మధ్య పాత తరానికి ప్రతినిధులుగా ఉన్న వీరిని చూస్తే ఆశ్చర్యం వేయడం లేదూ! -
కొప్పులో నెలవంక
వాలు జడ, పొట్టి జడ, పాయల జడ, ఫిష్ టెయిల్, ఫ్రెంచ్ ప్లాట్.. ఇలా వందలకొద్దీ హెయిర్ స్టైల్స్ ఉంటే, వాటి అలంకరణలు వేలకొద్ది ఉన్నాయి. అయితే ఒక వయసు దాటాక జడలు అంతగా నప్పవు. అలాగని కొప్పులు వేస్తే మరీ ‘పెద్దవారిలా కనిపిస్తాం’ అని ముఖం ముడుచుకోవాల్సిన అవసరం లేదు ఈ కేశాలంకరణ ఆభరణాలు మీ దగ్గరుంటే! అవి బంగారపువే కానక్కర్లేదు. ఇమిటేషన్ గోల్డ్‌లో విభిన్నరకాలు మార్కెట్లో లభిస్తున్నాయి. వాటిలో రాళ్లు పొదిగినవి, రంగురంగుల పూసలు ఉన్న అందమైన క్లిప్స్ ఉన్నాయి. వెండి డిజైన్లు, ఫ్యాబ్రిక్ డిజైనర్ పువ్వులనూ తలలో తళుక్కుమనిపించవచ్చు. కొప్పుకిందుగా క్లిప్ పెడితే ఒక అందం, నెలవంక మాదిరిగా ఒకవైపు మాత్రమే అలంకరిస్తే మరొక అందం, కొప్పు మధ్యలో సింగారిస్తే ఇంకొక అందం. వేడుకల్లో వెలిగిపోయేలా నేటితరం అమ్మాయిలను సైతం ఆకట్టుకునే కొప్పుల సింగారాలు ఇవి.