కొప్పులో నెలవంక | different hairstyles with womens | Sakshi
Sakshi News home page

కొప్పులో నెలవంక

Published Thu, Dec 19 2013 12:30 AM | Last Updated on Sat, Sep 2 2017 1:45 AM

కొప్పులో నెలవంక

కొప్పులో నెలవంక

వాలు జడ, పొట్టి జడ, పాయల జడ, ఫిష్ టెయిల్, ఫ్రెంచ్ ప్లాట్.. ఇలా వందలకొద్దీ హెయిర్ స్టైల్స్ ఉంటే, వాటి అలంకరణలు వేలకొద్ది ఉన్నాయి. అయితే ఒక వయసు దాటాక జడలు అంతగా నప్పవు. అలాగని కొప్పులు వేస్తే మరీ ‘పెద్దవారిలా కనిపిస్తాం’ అని ముఖం ముడుచుకోవాల్సిన అవసరం లేదు ఈ కేశాలంకరణ ఆభరణాలు మీ దగ్గరుంటే! అవి బంగారపువే కానక్కర్లేదు. ఇమిటేషన్ గోల్డ్‌లో విభిన్నరకాలు మార్కెట్లో లభిస్తున్నాయి.

వాటిలో రాళ్లు పొదిగినవి, రంగురంగుల పూసలు ఉన్న అందమైన క్లిప్స్ ఉన్నాయి. వెండి డిజైన్లు, ఫ్యాబ్రిక్ డిజైనర్ పువ్వులనూ తలలో తళుక్కుమనిపించవచ్చు. కొప్పుకిందుగా క్లిప్ పెడితే ఒక అందం, నెలవంక మాదిరిగా ఒకవైపు మాత్రమే అలంకరిస్తే మరొక అందం, కొప్పు మధ్యలో సింగారిస్తే ఇంకొక అందం. వేడుకల్లో వెలిగిపోయేలా నేటితరం అమ్మాయిలను సైతం ఆకట్టుకునే  కొప్పుల సింగారాలు ఇవి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement