మేకప్ అనగానే వేసుకున్నప్పుడూ అతిలోక సుందరిలా..తీసేశాక ఆమెనా అన్నంత సందేహం వస్తుంది. ముఖ్యంగా కలర్ తక్కువగా ఉండే వాళ్ల గురించి ఇక చెప్పాల్సిన పని లేదు. అందుకే చామనఛాయా ఉన్న చాలమంది వధువులు, కాస్త రంగు తక్కువగా ఉన్నవారు మేకప్ వేసుకునేందుకు సుముఖత చూపించరు. ఎందుకంటే మేకప్ తర్వాత వాళ్ల లుక్ మారిపోతుంది. దీంతో ఇబ్బందిగా ఫీలవుతుంటారు. అదే తమ రంగుకి అనుగుణమైన మేకప్‌తో అందంగా కనిపించేలా చేస్తే ఆత్మవిశ్వాసంగా, నిండుగా ఉంటుంది. అలాంటి మేకప్ నైపుణ్యంతో ఇక్కడొక కళాకారిణి అందరి హృదయాలను దోచుకుంటోంది. ఎవ్వరైనా ఆమె మేకప్ నైపుణ్యతకు ఫిదా అయిపోతారు. ఇంతకీ ఎవరంటే ఆమె..!
చెన్నై(Chennai)కి చెందిన మేకప్ ఆర్టిస్ట్(makeup artist) నిర్మలా మోహన్ స్కిన్ టోన్‌కు సరిపోయే మేకప్‌లతో ఆకట్టుకుట్టోంది. రంగు తక్కువగా ఉన్నా కూడా ఇనుమడింప చేసే మేకప్‌తో అందంగా కనిపించేలా చేస్తోంది. అందానికి అసలైన నిర్వచనం చెప్పేలా మేకప్ నైపుణ్యంతో ఫిదా చేస్తోంది. చర్మం కలర్(skin colour) నలుపుగా ఉన్నవాళ్లని తెల్లగా కనిపించేలా మేకప్ వేస్తారు చాలామంది.
ఆ తర్వాత అసలు రంగు ఇదా అని ముఖం మీదే అనడంతో కలర్ తక్కువగా ఉండే అమ్మాయిలు మేకప్ వేసుకునేందుకు భయపడుతున్నారు. అలా కాకుండా వారి రంగుకి సరిపోయే మేకప్‌తో వాళ్ల చర్మం రంగులోనే మరింత అందంగా కనిపించేలా తీర్చిదిద్దితుంది నిర్మల. ఇదే ఆమె బ్యూటీ ట్రిక్కు. అందుకు సంబంధించిన వీడియోలను ఇన్‌స్టాలో షేర్ చేయడంతో అందరూ ఆమె కళా నైపుణ్యాన్ని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు.
ఇలా రంగు తక్కువగా ముదురు గోధుమ రంగులో ఉండే వాళ్ల స్కిన్ టోన్‌కి అనుగుణమైన రంగులోనే కాంతిమంతంగా కనిపించేలా చేస్తే.. వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపినవాళ్లం అవుతాం. వారి ముఖాలు కూడా కాంతిగా వెలుగుతాయి. ఎట్టిపరిస్థితుల్లోనూ ఇలాంటి వాళ్లకు వైట్ వాష్ చేయకూడదు. మేకప్ వేస్తేనే అందం లేదంటే చూడలేం అన్నట్లు ఉండకూడదు. సహజ సౌందర్యం ఉట్టిపడేలా తీర్చిదిద్దే మేకపే అమ్మాయిలకు గౌరవంగా ఉంటుందని అంటోంది నిర్మల. దీంతో వాళ్లు మునుపటి రూపాన్ని చూపించేందుకు వెనడుగు వేయరని నమ్మకంగా చెబుతోంది.
(చదవండి: తల్లే కూతురు పెళ్లిని ఆపేసింది..! ట్విస్ట్ ఏంటంటే..)
Comments
Please login to add a commentAdd a comment