ఎల్లవేళలా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే అందం.. కలకాలం నిలచి ఉండాలంటే చర్మానికి ప్రత్యేకమైన ట్రీట్‌మెంట్స్ అవసరం. అందుకోసమే ఈ కిట్! ప్రతి ఒక్కరికీ యూజ్ అవుతుంది. సహజమైన సౌందర్యాన్ని పొందాలనుకునే వాళ్లు ఇలాంటి మైక్రోడెర్మాబ్రేషన్ సిస్టమ్‌ను వెంట ఉంచుకోవాల్సిందే.
ఈ మెషిన్ శరీరంపైనున్న మృతకణాలను సున్నితంగా తొలగిస్తుంది. మేకప్‌తో పాడైన చర్మాన్ని నిమిషాల్లో సరిచేస్తుంది. వయసుతో వచ్చే ముడతల్ని ఇట్టే పోగొడుతుంది. చర్మాన్ని బిగుతుగా, కాంతిమంతంగా మార్చి.. సరికొత్త అందాన్ని ఇస్తుంది. ఇంట్లో ఈ డివైస్ ఉంటే.. ప్రత్యేక మెరుగుల కోసం పార్లర్‌కి వెళ్లాల్సిన పనిలేదు. ఈ టూల్.. చర్మానికి ఎక్స్‌ఫోలియేటర్ స్క్రబ్‌ను అందిస్తుంది. సెన్సిటివ్, ఆటో, మాన్యువల్ అనే పలు మోడ్స్ ఇందులో ఉంటాయి. సిస్టమ్‌కి అటాచ్ అయి ఉన్న పొడవాటి ప్లాస్టిక్ ట్యూబ్‌తోనే ట్రీట్‌మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ప్రొఫెషనల్ పోర్ ఎక్స్‌ట్రాక్షన్ టిప్, గ్రేడ్ డైమండ్ టిప్, మాగ్నెటిక్ ఇన్ఫ్యూజర్ టిప్ ఇలా ఆ ట్యూబ్‌కి అటాచ్ చేసుకోవాల్సిన వేరువేరు పార్ట్స్.. మెషిన్‌తో పాటు లభిస్తాయి.
పోర్ ఎక్స్‌ట్రాక్షన్ సాయంతో చర్మంపైనున్న చిన్న చిన్న గుంతలు, రంధ్రాలను తగ్గించుకోవచ్చు. డైమండ్ టిప్ సాయంతో ముడతలు, గీతలను పోగొట్టుకోవచ్చు. మాగ్నెటిక్ ఇన్ఫ్యూజర్ సాయంతో చర్మం లోతుల్లో పేరుకున్న వ్యర్థాలు తొలగించుకోవచ్చు. ప్లాస్టిక్ ట్యూబ్‌ని సులభంగా పెన్ పట్టుకున్నట్లుగా పట్టుకుని, చర్మం మీద పెట్టి ట్రీట్‌మెంట్ తీసుకోవాలి. ఈ మెషిన్ చూడటానికి మినీ టాయిలెట్ బాక్స్‌లా కనిపిస్తుంది. ఈ సిస్టమ్‌కి ఒకవైపునున్న పవర్ బటన్, స్టార్ట్ బటన్, లెవెల్స్.. అన్నిటినీ అడ్జస్ట్ చేసుకుని సులభంగా వినియోగించుకోవచ్చు.
(చదవండి: నత్తల విసర్జకాలు, తేనెటీగల విషంతో బ్యూటీ ప్రొడక్ట్స్! కొరియన్ల బ్యూటీ రహస్యం ఇదేనా!)
Comments
Please login to add a commentAdd a comment