ఇంట్లో దొరికే వాటినే సౌందర్య సాధనాలుగా ఉపయోగించుకుని అందాన్ని సంరక్షించుకోవడం చూశాం. వాటిల్లో ఎక్కువగా సెనగపిండి, బియ్య పిండి, మొక్కల ఆధారితమైనవే. ఇక్కడొక ఇన్‌ఫ్లుయెన్సర్ ఏకంగా పచ్చిమిర్చి కూడా అందానికి ఉపయోగపడుతుందంటూ ఏం చేసిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ఆ వీడియోలో ఢిల్లీకి చెందిన శుభంగి ఆనంద్ అనే ఇన్‌ఫ్లుయెన్సర్ వివాదాస్పదమైన బ్యూటీ టిప్‌ని షేర్ చేసింది. అందులో పచ్చిమిరపకాయలతో లిప్‌స్టిక్ వేసుకున్నట్లు చూపించింది. సహజమైన బొద్దు పెదవుల కోసం ఇది ప్రయత్నించమంటూ తన అనుభవాన్ని షేర్ చేసుకుంది. అయితే ఈ వీడియోని చూసిన నెటిజన్లు ఒక్కసారిగా ఫైర్ అయ్యారు.
strong>
ఘాటుతో ఉండే పచ్చిమిర్చి వంటివి చర్మానికి హాని కలిగించేవని. ఇలాంటి పిచ్చిపిచ్చి టిప్స్ షేర్ చేయొద్దని తిట్టిపోశారు. పెద్దాలు బొద్దుగా ఉండటం అటుంచితే..అవి కాలిన గాయాల వలే వాచిపోయి అసహ్యంగా మారతాయని కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు.
అయినా అందానికి సంబంధించినవి సమంజసంగా హానికరం కానివి పెట్టాలి. ఏదో సోషల్ మీడియా క్రేజ్ కోసం ఇలా చేస్తే..వ్యూస్ రావడం మాట దేవుడెరగు అస్సలు ఆ అకౌంట్‌కి సంబంధించిన వీడియోలను అసహ్యించుకునే ప్రమాదం లేకపోలేదు.
(చదవండి: నడవలేనంత అనారోగ్య సమస్యలతో వినోద్ కాంబ్లీ: ఆ వ్యాధే కారణమా..?)
Comments
Please login to add a commentAdd a comment