ముసురుతో వాతావరణం చల్లగా ఉంది. ఇంతకుమించిన వెదర్ ఉండదనుకుంటూ వాకింగ్‌కి బయలుదేరింది రవళి. అర కిలోమీటరు నడిచిందో లేదో సడెన్‌గాకుంభవృష్టి. నిమిషంలో తడిసి ముద్దయింది. ఇంటికి తిరిగి వచ్చేసరికి జుట్టుపొడిబారింది. కానీ మొత్తం చిక్కులే చిక్కులు. అప్పుడిక తల స్నానం చేసే టైమ్‌లేక ఆదరాబాదరా దువ్వేసి ఆఫీస్‌కి వెళ్లింది. ఇలాంటి అలవాట్లు జుట్టుకు ఎంతైనా హానికరం అంటున్నారు కేశాలంకరణ నిపుణులు.
సాక్షి, సిటీబ్యూరో : ‘వాన రాకడ... కరెంటు పోకడ’ చెప్పలేం అన్నట్టుగా ఉండే ఈ సీజన్‌లో నెత్తిన కురిసే నీళ్లు... మన ముఖ సౌందర్యానికి కారణమయ్యే వెంట్రుకలకు హానికరంగా పరిణమిస్తుంటాయి. ఎడాపెడా తడవడం, పొడి బారడం... మళ్లీ తడవడం, పొడిబారడం తరచూ ఇలాంటి పరిస్థితుల్ని ఎదుర్కోవడం ఈ సీజన్‌లో సహజం. అయితే దీని వల్ల జుట్టు చిక్కులు పడిపోవడం లాంటి సాధారణ సమస్యల నుంచి వెంట్రుకలు ఊడిపోవడం తదితర తీవ్రమైన సమస్యలూ వస్తాయని, వర్షాకాలం జుట్టుకు చేసే హాని అంతా ఇంతా కాదని అంటున్నారు కేశాలంకరణ నిపుణులు. దీనికి సంబంధించి వీరు ఇస్తున్న సూచనలివీ...
⇔ వాన నీరు మురికి, ఎసిడిక్‌గా ఉంటుంది. అందుకే వర్షంలో తడిసిన వెంటనే తలని శుభ్రం చేసుకోవాలి. అలా కాకుండా గంటల తరబడి, రోజుల తరబడి అలానే ఉంచుకుంటే జుట్టుకి హాని కలిగే అవకాశాలెక్కువ.
⇔ వారానికి రెండుసార్లు తప్పనిసరిగా తలకు షాంపూ పెట్టుకోవాలి. మైల్డ్ డీప్ క్లీన్సింగ్ షాంపూ వాడితే మురికిని మూలాల నుంచి తొలగిస్తుంది.
⇔ వెంట్రుకల కుదుళ్లను సైతం శుభ్రపరిచి ఫంగల్ బ్యాక్టీరియా అంటువ్యాధుల నుంచి రక్షణ కల్పించే ప్యాంటీన్ ప్రొ–వి లాంటి షాంపూని తల ఉపరితలానికి పట్టేలా వినియోగించాలి.
⇔ జుట్టు పొడిబారుతుంది కాబట్టి నూనె పట్టించాలి. డీప్ కండిషనింగ్‌గా కూడా ఇది పనిచేస్తుంది.
⇔ ఈ సీజన్లో హెయిర్‌ని ముడివేసే స్టైల్స్ మంచిది కాదు. వర్షం నీరు నెత్తిపై నిల్వ ఉండడానికి ఇది దోహదం చేస్తుంది. తప్పదనుకుంటే లూజ్ పోనీటెయిల్స్ లేదా బన్స్‌కు పరిమితమవ్వాలి.
⇔ వీలుంటే నాణ్యమైన వాటర్ ప్రూఫ్ జాకెట్ లేదా హుడీ (తల మీద నుంచి నడుము వరకు ఉండే కోట్)ని ధరించి బయటకు వెళ్లడం ఉత్తమం.
⇔ సరైన దువ్వెన, పళ్ల మధ్య తగినంత గ్యాప్ ఉండేది ఎంచుకోవాలి. దీనితో కుదుళ్ల నుంచి దువ్వడానికి అవకాశం ఉంటుంది.
⇔ అత్యధికంగా కండిషన్‌నర్ వాడొద్దు. కండిషనర్‌ని కేవలం వెంట్రుకల చివర్లు, లెంగ్తŠస్ మీద మాత్రమే అప్లయ్ చేయండి.
⇔ వెంట్రుకల కుదుళ్ల నుంచి శక్తివంతంగా మార్చడానికి ప్రొటీన్, ఐరన్ ఉండే ఆహారం తీసుకోవాలి. మ్యాకెరెల్, సాల్మన్ లాంటి చేపలు... వాల్‌నట్స్, పెరుగు, పాలకూర తదితర బాగా తీసుకోవాలి.
⇔ ఈ సీజన్‌లో హెయిర్ స్టైల్స్ మెయింటెయిన్ చేయడం సవాల్. అందుకే షార్ట్‌గా కత్తిరించుకుంటే బెటర్.
జాగ్రత్తలు అవసరం...
తల వెంట్రుకలకి వర్షాకాలం పరీక్ష లాంటిదని చెప్పాలి. ఈ సీజన్లో హెయిర్‌ని పరిరక్షించుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే అది ఒక్కోసారి తీవ్రమైన సమస్యలకు దారి తీస్తుంది. అయితే కొంచెం కేర్ తీసుకుంటే ఈ సీజన్‌ని తేలిగ్గా దాటేయవచ్చు. – సృజన, కేశాలంకరణ నిపుణురాలు
Comments
Please login to add a commentAdd a comment