ఆకట్టు... అండర్ కట్.. | Latest New Look of cut designs | Sakshi
Sakshi News home page

ఆకట్టు... అండర్ కట్..

Published Thu, Jun 30 2016 10:56 PM | Last Updated on Mon, Sep 4 2017 3:49 AM

ఆకట్టు... అండర్ కట్..

ఆకట్టు... అండర్ కట్..

న్యూలుక్
తలకట్టు అలంకరణ ఓ సింగారం. కురుకులను అందంగా సింగారించుకోవడం ఓ కళ. అందుకు వేలాది కేశాలంకరణలు మతులు పోగొడుతున్నాయి. వాటిలో ఇప్పుడు ప్రత్యేకంగా దారిచూసుకుని వచ్చేసింది అండర్‌కట్. తలకట్టు కింది భాగంలో మరో అందమైన ‘కట్’ దీని ప్రత్యేకత.
 
* టాటూలు ఒంటిమీద వేయించుకోవడం, అందమైన డిజైన్లను రూపొందించుకోవడం తెలిసిందే! తలకట్టు కింది భాగంలో టాటూని తలపించేలా ‘కట్’ డిజైన్ చేస్తే.. ఇలా చూడచక్కని హెయిర్ స్టైల్స్ దర్శనమిస్తాయి. వాటిలో పువ్వులు, నక్షత్రాలు, కోణాకృతులు.. ఎన్నో.

* కట్ డిజైన్ ఒక్కటే అయితే ఏం బాగుంటుంది అనుకున్నారేమో ఇప్పుడు ఆ డిజైన్ తలకట్టు కింది భాగంలో మరింత మెరుపులీనుతూ కనిపించాలని గ్లిటర్స్ ఉపయోగిస్తున్నారు. అందులో భాగంగా ఈ డిజైన్స్ రంగురంగుల గ్లిటర్స్‌తో అందంగా మెరిసిపోతున్నాయి.
 
* విదేశాల నుంచి దిగుమతి అయిన ఈ ట్రెండ్ ఇప్పుడిప్పుడే మార్కెట్లో దర్శనమిస్తోంది. ఆడ-మగ ఇద్దరినీ విశేషంగా ఆకట్టుకుంటున్న ఈ కట్‌ని మీరూ ఫాలో అవాలనుకుంటే కట్‌తో పాటు గ్లిటర్‌కి కూడా కాస్త పనిచెప్పండి. వేడుకగా మెరిసిపోండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement