అనంత్‌ -రాధిక పెళ్లి వేడుక: తమిళియన్‌ హెయిర్‌ స్టైల్‌లో ఇషా..! | Isha Ambani Rocks Stunning Tamilian Jadai Hairstyle For Anant Ambani Wedding Event, Pics Goes Viral | Sakshi
Sakshi News home page

అనంత్‌ -రాధిక పెళ్లి వేడుక: తమిళియన్‌ హెయిర్‌ స్టైల్‌లో ఇషా..!

Published Wed, Jul 10 2024 4:37 PM | Last Updated on Wed, Jul 10 2024 5:16 PM

Isha Ambani Rocks Stunning Tamilian Jadai Hairstyle For Anant Ambani Wedding Event

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ దిగ్గజం ముఖేష్‌ అంబానీ-నీతాల చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ పెళ్లి వేడుకలు అత్యంత వైభవోపేతంగా సాగుతున్నాయి. సంగీత్‌ దగ్గర నుంచి హల్దీ వరుకు సాగిన వివాహ సంబరాల్లో అంబానీ కుటుంబసభ్యులు మునిగితేలుతున్నారు. ఆ వేడుకల్లో వాళ్లంతా ఏళ్ల నాటి సంప్రదాయ ఫ్యాషన్‌ స్టైల్‌ని గుర్తుచేసేలా.. ఆయా వస్త్రధారణలో కనిపించి ఆశ్చర్యపరుస్తున్నారు. 

ఆ వేడుకలో నీతా నుంచి ఇషా, శ్లోకా మెహతా వివిధ రకాల లగ్జరీయస్‌ ఫ్యాషన్‌ డిజైనర్‌వేర్‌లతో అలరించారు. ఇప్పుడూ తాజాగా ఇషా సరికొత్త హెయిర్‌ స్టైల్‌లో కనిపించింది. ఇది తమిళయన్‌ హెయిర్‌ స్టైల్‌లో జడను వేశారు. జడ పైభాగంలో మొగ్ర పువ్వులతో ఓ పెద్ద కొప్పులా ఉండి..కింద నుంచి గోల్డెన్‌ థ్రెడ్‌తో అల్లారు. ఇక అందుకు తగ్గట్టుగా గ్రీన్‌ లెహంగాలో స్టన్నింగ్‌ లుక్‌లో కనిపించారు. 

అలాగే వాటికి మ్యాచింగ్‌ అయ్యేలా చెవిపోగులు ఇరువైపుల సూర్యుడు, చంద్రుడుని ధరించిందా అన్నంతా గ్రాండ్‌ లుక్‌లో కనిపించింది ఇషా. కాగా, అనంత్‌-రాధికలు జూలై 12న శుక్రవారం వివాహ బంధంతో ఒక్కటికానున్నారు. ఈ వివాహం అనంతరం జూలై 14న గ్రాండ్‌ రిసెప్షన్‌ జరగనుంది. ఇది మంబై నగరంలోని అంబానీ జియో వరల్డ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ , వారి కుటుంబ సభ్యుల సమక్షంలో జరగనున్నట్లు సమాచారం.

 

(చదవండి: నాజూగ్గా ఉండాలనుకుంటే..మొరింగ నీటిని ట్రై చేయండి..!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement