సింగిల్ శాటిన్ పూల అందాలు!
మేడ్ ఇన్ హోమ్
ఓ చిన్న క్లిప్... కురులకు కొత్త అందాన్ని అద్దుతుంది. అందుకే మార్కెట్ నిండా రకరకాల మోడళ్ల క్లిప్పులు దర్శనమిస్తున్నాయి. కానీ ఎన్నని కొంటాం! రేట్లు మండిపోతున్నాయి కదా! అందుకే ఇంట్లోనే క్లిప్పులు తయారు చేయడం మొదలుపెట్టండి. పెద్ద కష్టమేమీ కాదు.
మొదట క్లాత్ మీద కావలసిన ఆకారంలో రేకుల డిజైన్ వేసుకోవాలి. తర్వాత రేకుల్ని కత్తిరించి, వాటి అంచుల్ని కొద్దిగా వెనక్కి రోల్ చేయాలి. తర్వాత వీటన్నిటినీ పువ్వులా పేర్చుకుంటూ గమ్‌తో అతికించాలి లేదా పిన్ చేయాలి. ఆపైన మధ్యలో ఓ పూస కానీ రాయి కానీ అతికిస్తే అందమైన పువ్వు తయారవుతుంది.
దీన్ని రబ్బర్ బ్యాండ్‌కి అతికించాలి. లేదంటే సింపుల్‌గా ఉండే మెటల్ క్లిప్స్ మార్కెట్లో దొరుకుతాయి. కొన్ని కొని పెట్టుకుంటే వాటికి కూడా అతికించుకోవచ్చు. క్లాత్ పెద్ద ఖరీదు కాదు కాబట్టి రకరకాల రంగుల బట్టని కొద్దికొద్దిగా కొని పెట్టుకుంటే, అవసరమైనప్పుడు క్షణాల్లో డ్రెస్సుకి తగ్గ క్లిప్ తయారు చేసుకోవచ్చు. మీకోసం ఇక్కడ కొన్ని మోడల్స్ ఉన్నాయి... చూసి ప్రయత్నించవచ్చు.