Rubber band
-
క్యూట్ అప్‌డూ
సిగ సింగారం ఈ హెయిర్ స్టయిల్‌ను ‘క్యూట్ అప్‌డూ’ అంటారు. ఇది ఎలాంటి డ్రెస్సుల మీదికైనా నప్పుతుంది. అంతేకాదు ఎలాంటి పార్టీలకైనా ఈ స్టయిల్‌ను నిశ్చింతగా వేసుకోవచ్చు. దీన్ని వేసుకోవడానికి జుత్తు మరీ పొడవుగా ఉండాల్సిన పని లేదు. కాబట్టి అందరూ హాయిగా ఈజీగా వేసుకోవచ్చు. ఈ క్యూట్ అప్‌డూ మీకు మంచి రాయల్ లుక్‌ను అందిస్తుంది. ఈ సిగ సోయగం మీకూ కావాలంటే.. వెంటనే ట్రై చేయండి మరి. ముందుగా జుత్తునంతా చిక్కులు లేకుండా దువ్వుకోవాలి. తర్వాత ఫొటోలో కనిపిస్తున్న విధంగా ముందు భాగంలోని జుత్తు వెనక్కు రాకుండా ఏదైనా ప్లక్కర్ పెట్టేయాలి. ఆపైన వెనుక భాగం జుత్తుకు రబ్బర్ బ్యాండ్ పెట్టేయాలి. ఇప్పుడు పోనీని మెలితిప్పుకోవాలి (కొద్దికొద్దిగా జుత్తును తీసుకొని ట్విస్ట్ చేసుకోవాలి). జుత్తు ఎంత పఫ్ఫీగా ఉంటే కొప్పు అంత అందంగా కనిపిస్తుంది. నుదురు దగ్గర జుత్తును కాస్తంత పఫ్ఫీగా పెట్టుకుంటే.. ముందు నుంచి హెయిర్ స్టయిల్ అదిరిపోతుంది. ఆ పోనీని గుండ్రంగా చుడుతూ.. కొప్పులా చేసుకోవాలి. తర్వాత కొప్పులో నుంచి జుత్తు బయటికి రాకుండా స్లైడ్స్ పెట్టుకోవాలి. అలా అని కొప్పు మరీ టైట్గానూ ఉండకూడదు. ఇప్పుడు నుదురు దగ్గర జుత్తును మూడు పాయలుగా తీసుకొని అల్లాలి. ఆపైన ఒక్కో అల్లికకు ఇరువైపుల నుంచి ఒక్కో పాయను తీసుకొని, జడలో అల్లుకుంటూ పోవాలి. జడను కొప్పు వరకు అల్లి, చివరకు రబ్బర్ బ్యాండ్ పెట్టేయాలి. జడను అల్లుకునేటప్పుడు, కొప్పు ఏమాత్రం కదలకుండా, వదులు కాకుండా చూసుకోవాలి. తర్వాత ఆ జడ చివర్లలోని జుత్తును మెలితిప్పుకోవాలి. ఆ మెలితిప్పిన జుత్తును కొప్పు చుట్టూ చుట్టాలి. మధ్యమధ్యలో జుత్తు చిట్లిపోకుండా హెయిర్ స్ప్రే చేసుకుంటూ ఉండాలి. చివరగా కొప్పు వదులు కాకుండా స్లైడ్స్ పెట్టుకోవాలి. అవసరమనుకున్న ప్రతి చోటా స్లైడ్స్ పెట్టుకుంటే, కొప్పులో నుంచి వెంట్రుకలు బయటికి రావు. అలాగే, చివరికి మరోసారి హెయిర్ స్ప్రే చేసుకుంటే.. మీ హెయిర్ స్టయిల్ లుక్కే మారిపోతుంది. కావాలనుకుంటే హెయిర్ స్టయిల్ పూర్తిగా వేసుకున్నాక, ఏవైనా ఫ్లవర్ క్లిప్స్, స్టాన్ క్లిప్స్‌తో అలంకరించుకోవచ్చు. అప్పుడు కొప్పు మరింత అందంగా కనిపిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, క్యూట్ అప్‌డూ హెయిర్ స్టయిల్‌నూ మీరు వేసుకొని మురిసిపోండి. -
బబుల్ బన్
సిగ సింగారం షార్ట్ హెయిర్ గలవారు కేశాలంకరణలో ఎన్నో రకాల స్టైల్స్‌తో వెలిగిపోవచ్చు. పార్టీకి వెస్టర్న్ వేర్ ధరించినప్పుడు ఎలాంటి హెయిర్ స్టైల్ బాగుంటుంది అని ఆందోళన చెందకుండా సింపుల్‌గా అనిపించడంతో పాటు సౌకర్యంగానూ సౌకర్యంగానూ, స్టైల్‌గానూ ఉండే ఈ బబుల్బన్ని ట్రై చేయవచ్చు. ఈ కేశాలంకరణను కేవలం 2 నిమిషాలలోనే చేసుకోవచ్చు. 1. జుట్టును చిక్కుల్లేకుండా దువ్వాలి. పోనీటెయిల్‌లా జుట్టునంతా నడినెత్తిమీదకు దువ్వి రబ్బర్ బ్యాండ్ పెట్టాలి. 2. రబ్బరు బ్యాండ్ పెట్టిన జుట్టు కొంత పైకి పెట్టి, మరో వరుస అదే రబ్బరు బ్యాండ్ వేయాలి. 3. ఫొటోలో చూపిన విధంగా కొంత కుచ్చు వచ్చేలా జుట్టును, రబ్బర్బ్యాండ్ను సెట్ చేసుకోవాలి. 4. రబ్బర్ బ్యాండ్ చుట్టూతా కింద మిగిలిన జుట్టును మడచి తిప్పాలి. 5. జుట్టు చివరలను మడ వాలి. రబ్బర్‌బ్యాండ్ పెట్టిన దగ్గర కొద్దిగా వదులు చేసిన మధ్య నుంచి జుట్టు చివరలను బయటకు తీయాలి. 6. పైన బన్ ఒక పువ్వు గుత్తిలా చేత్తోనే సెట్ చేయాలి. 7. జుట్టు చివరలను నీటుగా సర్ది, మడవాలి. 8. బయటకు రాకుండా జుట్టుకు దగ్గరగా చివరలను క్లిప్‌తో సెట్ట చేయాలి. 9. ఫొటోలో చూపిన విధంగా నడి నెత్తి మీద అందమైన బుడగలాంటి అలంకరణ ముచ్చట గొలుపుతుంది. సహజమైన కండిషనర్ దుమ్ము, పొగ.. వంటివి శిరోజాలను త్వరగా పొడిబారేలా చేస్తున్నాయి. పొడిగా మారిన వెంట్రుకల చివర్లు చిట్లడం, ఊడిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. పరిష్కారం.. * బాగా మగ్గిన అరటిపండును గుజ్జులా చేసి, దాంట్లో గుడ్డు సొన వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి, 15-30 నిమిషాలు ఉంచాలి. తర్వాత వెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఈ మిశ్రమం కురులకు సహజసిద్ధమైన కండిషనర్‌లా ఉపయోగపడుతుంది. * పావు కప్పు ఆర్గానిక్ యాపిల్ సైడర్ వెనిగర్‌ను కప్పు నీటిలో కలపాలి. షాంపూతో తలస్నానం చేసిన తర్వాత ఆ నీటితో వెంట్రుకలను తడపాలి. ఈ మిశ్రమం జుట్టుకు మంచి కండిషన్‌ని ఇస్తుంది. * షాంపూ చేసిన తర్వాత బేకింగ్ సోడాలో అతి కొద్దిగా కొబ్బరి నూనె కలిపి వెంట్రుకలను తడిపి, ఆ తర్వాత కడిగేయాలి. -
సింగిల్ శాటిన్ పూల అందాలు!
మేడ్ ఇన్ హోమ్ ఓ చిన్న క్లిప్... కురులకు కొత్త అందాన్ని అద్దుతుంది. అందుకే మార్కెట్ నిండా రకరకాల మోడళ్ల క్లిప్పులు దర్శనమిస్తున్నాయి. కానీ ఎన్నని కొంటాం! రేట్లు మండిపోతున్నాయి కదా! అందుకే ఇంట్లోనే క్లిప్పులు తయారు చేయడం మొదలుపెట్టండి. పెద్ద కష్టమేమీ కాదు. మొదట క్లాత్ మీద కావలసిన ఆకారంలో రేకుల డిజైన్ వేసుకోవాలి. తర్వాత రేకుల్ని కత్తిరించి, వాటి అంచుల్ని కొద్దిగా వెనక్కి రోల్ చేయాలి. తర్వాత వీటన్నిటినీ పువ్వులా పేర్చుకుంటూ గమ్‌తో అతికించాలి లేదా పిన్ చేయాలి. ఆపైన మధ్యలో ఓ పూస కానీ రాయి కానీ అతికిస్తే అందమైన పువ్వు తయారవుతుంది. దీన్ని రబ్బర్ బ్యాండ్‌కి అతికించాలి. లేదంటే సింపుల్‌గా ఉండే మెటల్ క్లిప్స్ మార్కెట్లో దొరుకుతాయి. కొన్ని కొని పెట్టుకుంటే వాటికి కూడా అతికించుకోవచ్చు. క్లాత్ పెద్ద ఖరీదు కాదు కాబట్టి రకరకాల రంగుల బట్టని కొద్దికొద్దిగా కొని పెట్టుకుంటే, అవసరమైనప్పుడు క్షణాల్లో డ్రెస్సుకి తగ్గ క్లిప్ తయారు చేసుకోవచ్చు. మీకోసం ఇక్కడ కొన్ని మోడల్స్ ఉన్నాయి... చూసి ప్రయత్నించవచ్చు. -
గుండె వేగాన్ని కొలిచే రబ్బర్‌బ్యాండ్
లండన్: మీ చేతికి ఒక రబ్బర్ బ్యాండ్ ఉంది.. అది మీ గుండె కొట్టుకునే వేగాన్ని, ఊపిరి తీసుకునే విధానాన్ని చెప్పేస్తుంది.. అంతేకాదు మీ శరీర కదలికలను కూడా గుర్తిస్తుంది. ఇదేమిటి అంటారా? సాధారణ రబ్బర్‌బ్యాండ్ తరహాలోనే ‘గ్రాఫీన్ (కార్బన్ మూలకం)’ను చేర్చి రూపొందించిన సరికొత్త రబ్బర్‌బ్యాండ్లు ఇవి. సర్రే యూనివర్సిటీ, డబ్లిన్ ట్రినిటీ కాలేజీ పరిశోధకులు దీనిని రూపొందించారు. సాధారణంగా గుండెపోటుతోనో, ఏదైనా వ్యాధితోనో బాధపడుతున్న వారికి తరచూ గుండె కొట్టుకునే వేగాన్ని, శ్వాసక్రియను, శరీర కదలికలను పరిశీలించాల్సి ఉంటుంది. మరి అందుకోసం చాలా రకాల పరికరాలున్నాయి. కానీ అవన్నీ చాలా ఖరీదైనవి, పరిమాణంలోనూ పెద్దగా ఉంటాయి.. దాంతో పాటు వినియోగించే విధానమూ కొంత కష్టమే. దీనిపై పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు.. సాధారణ ప్లాస్టిక్‌కు గ్రాఫీన్‌ను చేర్చి ‘ఎలక్ట్రోమెకానికల్’ పదార్థాన్ని అభివృద్ధి చేశారు. దీనిని సెన్సర్‌గా వినియోగించుకుని గుండె కొట్టుకునే వేగాన్ని, ఊపిరి తీసుకునే వేగాన్ని, కీళ్లు, కండరాలు వంటి శారీరక కదలికలను సులువుగా గుర్తించవచ్చని.. ఇది చాలా చవక అని వారు చెబుతున్నారు.