సాక్షి, హైదరాబాద్: తిరుమలగిరి పోస్టాఫీసు ఉద్యోగులపై సీబీఐ కేసు నమోదు చేసింది. నోట్ల రద్దు సమయంలో ఈ పోస్టాఫీస్ సిబ్బంది, అధికారులు కొత్తనోట్లను అక్రమంగా ప్రైవేట్ వ్యక్తులకు మార్చారని ఆరోపిస్తూ సికింద్రాబాద్ రీజియన్ పోస్టాఫీస్ సీనియర్ సూపరింటెండెంట్ వీబీ గణేశ్ కుమార్ రెండు రోజులక్రితం సీబీఐకి ఫిర్యాదు చేశారు. తిరుమలగిరి పోస్ట్‌మాస్టర్ శ్రీనివాసులు, ట్రెజరర్ ఎస్ చంద్రమౌళి ఎలాంటి రికార్డులు లేకుండా రూ.8.8 లక్షల పాతనోట్లకు కొత్తనోట్లను మార్చి ఇచ్చినట్టు గణేశ్ కుమార్ ఆరోపించారు. ఈ ఫిర్యాదుపై ప్రాథమిక విచారణ జరిపిన సీబీఐ అధికారులు రికార్డులో నగదు మార్పిడికి సంబంధించి ఆధారాలు లేనట్లు గుర్తించింది. దీంతో వీరిద్దరిపై పీసీయాక్ట్ 1988 కింద 13(2) రెడ్‌విత్ 13 (1)(డి), ఐపీసీ 120 బిరెడ్ విత్, 409, 420, 477 (ఏ)కింద కేసులు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment