CBI case filed
-
Delhi liquor scam: కేజ్రీవాల్ విడుదల
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు భారీ ఊరట లభించింది. ఢిల్లీ మద్యం విధానం కుంభకోణానికి సంబంధించిన సీబీఐ కేసులో సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌తో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ మేరకు తీర్పు వెలువరించింది. విచారణ పేరిట నిందితులను సుదీర్ఘ కాలం పాటు జైల్లో ఉంచడం వారి వ్యక్తిగత స్వేచ్ఛను కాలరాయడమేనని ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. కేసుపై ఎలాంటి వ్యాఖ్యలూ చేయొద్దని కేజ్రీవాల్‌కు షరతు విధించింది. సీబీఐ తీరును ఈ సందర్భంగా తప్పుబట్టింది. ఈ ఉదంతానికి సంబంధించి ఈడీ కేసులో బెయిల్ లభించగానే కేజ్రీవాల్‌ను అరెస్టు చేయడాన్ని ప్రశ్నించింది. పంజరంలో చిలుకలా ప్రవర్తించొద్దంటూ చీవాట్లు పెట్టింది. కోర్టు తీర్పుతో ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు సంబరాలు చేసుకున్నాయి. దాదాపు ఆరు నెలల కారాగారవాసం అనంతరం కేజ్రీవాల్ తిహార్ జైలు నుంచి విడుదలయ్యారు. మద్యం విధానం కుంభకోణం కేసులో గత మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేయడం తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల్లో ప్రచార నిమిత్తం సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో మే 10న విడుదలైన ఆయన జూన్ 2 తిరిగి జైలుకు వెళ్లారు. అనంతరం ఈడీ కేసులో బెయిల్ మంజూరైనా సీబీఐ తిరిగి అరెస్టు చేయడాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేశారు. బెయిల్ కోసం ముందుగా ట్రయల్ కోర్టుకు వెళ్లాలన్న సీబీఐ వాదనను తోసిపుచి్చంది. అన్ని కేసులకూ ఒకే నియమాన్ని వర్తింపజేయలేమని స్పష్టం చేసింది.కేజ్రీవాల్‌కు షరతులివే...మద్యం కుంభకోణం ఉదంతంలో సీబీఐ కేసుపై బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్యలూ చేయరాదు. లెఫ్టినెంట్ గవర్నర్ సంతకం అవసరమైన ఫైళ్లు మినహా మిగతా వాటిపై సంతకాలు చేయరాదు. సీఎం కార్యాలయానికి, సచివాలయానికి వెళ్లడానికి వీల్లేదు (ఈ షరతులను తాజా తీర్పులో ధర్మాసనం సడలించింది. కానీ మే 10, జూలై 12 నాటి తీర్పుల్లో సుప్రీంధర్మాసనం ఈ రెండు షరతులనూ విధించింది. వాటిని విస్తృత ధర్మాసనం మాత్రమే రద్దు చేయగలదని ఆ సందర్భంగా పేర్కొంది. దాంతో అవి అమల్లోనే ఉండనున్నాయి) ట్రయల్ కోర్టు విచారణ అన్నింటికీ హాజరు కావాలి. విచారణ త్వరగా పూర్తయేందుకు సహకరించాలి.పంజరంలో చిలుక కావొద్దు సీబీఐకి జస్టిస్ భూయాన్ హితవు ఈడీ కేసులో బెయిల్ షరతులను తప్పుబట్టిన న్యాయమూర్తి విడిగా 33 పేజీల తీర్పు కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరుపై న్యాయమూర్తులిద్దరూ ఏకాభిప్రాయం వెలిబుచి్చనా పలు ఇతర అంశాలపై జస్టిస్ భూయాన్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ముఖ్యంగా కేజ్రీవాల్‌ను సీబీఐ అరెస్టు చేయడంలో తనకెలాంటి అసంబద్ధతా కన్పించడం లేదని జస్టిస్ సూర్యకాంత్ పేర్కొనగా జస్టిస్ భూయాన్ మాత్రం ఆ అభిప్రాయంతో తీవ్రంగా విభేదిస్తూ విడిగా 33 పేజీల తీర్పు రాశారు. కేజ్రీవాల్‌ను సీబీఐ అరెస్టు చేసిన సమయాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఇంకా ఏమన్నారంటే... → ఈ కేసులో 22 నెలలుగా ఊరికే ఉన్న సీబీఐకి, ఈడీ కేసులో బెయిల్ వచి్చన వెంటనే కేజ్రీవాల్‌ను అరెస్టు చేయాల్సిన అవసరం ఏమొచి్చంది? → బెయిల్‌ను అడ్డుకోవడమే దీని వెనక ఉద్దేశంగా కని్పస్తోంది. → ప్రశ్నలకు సమాధానం దాటవేస్తున్నారు గనుక నిర్బంధంలో ఉంచాల్సిందేనన్న వాదన సరికాదు. → సహాయనిరాకరణ చేసినంత మాత్రాన నిర్బంధం కూడదు. నిందితునికి మౌనంగా ఉండే హక్కుంటుంది. → బలవంతంగా నేరాంగీకారం రాబట్టే ప్రయత్నాలు కచ్చితంగా చట్టవిరుద్ధమే.→ ఇవే అభియోగాలపై ఈడీ కేసులో బెయిల్ మంజూరయ్యాక కూడా జైల్లోనే ఉంచజూడటం అక్రమం. → సీజర్ భార్య నిందలకు అతీతంగా ఉండాలన్న సామెత సీబీఐకి పూర్తిగా వర్తిస్తుంది. అత్యున్నత దర్యాప్తు సంస్థగా నిజాయితీగా వ్యవహరించడమే కాదు, అలా కని్పంచడం కూడా చాలా ముఖ్యం. ఏకపక్ష పోకడలు పోతోందన్న అభిప్రాయం కలగకుండా జాగ్రత్త పడాలి. → సీబీఐని పంజరంలో చిలుకగా ఇదే న్యాయస్థానం ఇటీవలే ఆక్షేపించింది. అది తప్పని, తాను స్వేచ్ఛాయుత చిలుకనని రుజువు చేసుకోవాల్సిన బాధ్యత దర్యాప్తు సంస్థదే → సీఎం కార్యాలయంలోకి వెళ్లొద్దని, ఫైళ్లపై సంతకాలు చేయొద్దని ఈడీ కేసులో బెయిల్ సందర్భంగా కేజ్రీవాల్‌కు కోర్టు విధించిన షరతులపై నాకు తీవ్ర అభ్యంతరాలున్నాయి. కాకపోతే న్యాయపరమైన క్రమశిక్షణను గౌరవిస్తూ వాటిపై నేను ఎలాంటి వ్యాఖ్యలూ చేయదలచుకోలేదు!నా పోరు ఆగదు జైలు నా స్థైర్యాన్ని పెంచింది: కేజ్రీవాల్ ‘‘జైల్లో పెట్టి నన్ను కుంగదీయాలని, నైతిక స్థైర్యాన్ని దెబ్బ తీయాలని చూశారు. కానీ జైలు గోడలు, ఊచలు నన్నేమీ చేయలేకపోగా నా మనోబలాన్ని వెయ్యి రెట్లు పెంచాయి. నా జీవితంలో ప్రతి క్షణం, ఒంట్లోని ప్రతి రక్తపు చుక్కా దేశసేవకే అంకితం. జాతి వ్యతిరేక శక్తులపై నా పోరు ఆగబోదు’’ అని కేజ్రీవాల్ అన్నారు. శుక్రవారం సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన అనంతరం ఆయన తిహార్ జైలు నుంచి విడుదలయ్యారు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్, ఆప్ సీనియర్ నేత మనీశ్ సిసోడియా తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో గుమిగూడిన ఆప్ కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. అనంతరం భారీ వర్షంలోనే చండ్గీరాం అఖాడా నుంచి తన అధికారిక నివాసం దాకా కేజ్రీవాల్ రోడ్ షో నిర్వహించారు. ‘జైలు తాళాలు విరిగి పడ్డా యి. కేజ్రీవాల్ విడుదలయ్యారు’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. వారికి ఆయన అభివాదం చేశారు. వర్షంలో తడుస్తూనే వాహనం పై నుంచి వారినుద్దేశించి మాట్లాడారు. ‘‘జాతి వ్యతిరేక శక్తులతో తలపడ్డందుకే నన్ను జైల్లో పెట్టారు తప్ప తప్పు చేశానని కాదు. దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. దేశాన్ని బలహీనపరిచేందుకు, విడదీసేందుకు జాతి వ్యతిరేక శక్తులు కుట్రలు చేస్తున్నాయి. ఈసీని బలహీనపరిచేందుకు, ఈడీ, సీబీఐలను పూర్తిగా చెప్పుచేతల్లోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. వీటిని పూర్తిస్థాయిలో ఎదుర్కొందాం. జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నా. అయినా ప్రతి దశలోనూ దైవం నాకు దన్నుగా నిలిచింది. నేను సత్యమార్గంలో నడవడమే అందుకు కారణం’’ అన్నారు. అంతకుముందు కేజ్రీవాల్‌కు బెయిల్ లభించగానే ఆప్ ప్రధాన కార్యాలయం వద్ద, ఆయన నివాసం వద్ద పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నాయి. కేజ్రీ భార్య సునీత తదితరులు వాటిలో పాల్గొన్నారు. -
హెచ్‌డీఐఎల్ ప్రమోటర్లపై మరో సీబీఐ కేసు
న్యూఢిల్లీ: హెచ్‌డీఐఎల్ ప్రమోటర్లు రాకేష్ వాధ్వాన్, సారంగ్ వాధ్వాన్‌లపై మరో బ్యాంక్ మోసం కేసును సీబీఐ నమోదుచేసింది. వారి అనుబంధ సంస్థ గురుఆశిష్ కన్స్ట్రక్షన్కు సంబంధించిన రూ.140 కోట్ల మోసం విషయంలో కొత్త కేసును నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ (పీఎంసీ) బ్యాంకుకు సంబంధించి రూ.4,300 కోట్ల కుంభకోణం కేసులో ఇప్పటికే ఇరుక్కున్న ఈ వ్యాపారవేత్తలపై తాజాగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) నుండి వచ్చిన ఫిర్యాదుపై తాజా చర్య ప్రా రంభించినట్లు వారు తెలిపారు. యస్ బ్యాంక్‌కు సంబంధించి రూ.200 కోట్ల కుంభకోణంలో కూడా వాధ్వాన్‌లపై కేసు దాఖలైంది. -
లాలూ ప్రసాద్ యాదవ్‌పై సీబీఐ కేసు
న్యూఢిల్లీ: బిహార్ మాజీ ముఖ్యమంత్రి, రైల్వే శాఖ మాజీ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుటుంబ సభ్యులపై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. 2004–09లో రైల్వే శాఖలో గ్రూప్–డి ఉద్యోగాలు ఇప్పించినందుకు ప్రతిఫలంగా అభ్యర్థుల నుంచి బిహార్ రాజధాని పాట్నాలో లక్షకుపైగా చదరపు అడుగుల భూమిని లాలూ, కుటుంబ సభ్యులు తక్కువ ధరకే సొంతం చేసుకున్నట్లు సీబీఐ ఆరోపిస్తోంది. లాలూ 2004–09లో యూపీఏ ప్రభుత్వ హయాంలో రైల్వే శాఖ మంత్రిగా పనిచేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 18న సీబీఐ ఆర్థిక నేరాల విభాగం ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు అధికారులు శుక్రవారం వెల్లడించారు. తాజా కేసు నేపథ్యంలో సీబీఐ అధికారులు ఢిల్లీ, పాట్నా, గోపాల్‌గంజ్‌లో లాలూ, కుటుంబ సభ్యులకు సంబంధించిన 16 చోట్ల సోదాలు ప్రారంభించారు. లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన భార్య రబ్రీదేవి, కుమార్తెలు మీసా భారతి, హేమా యాదవ్‌తోపాటు అక్రమంగా ఉద్యోగాలు దక్కించుకున్న మరో 12 మందిని నిందితులుగా చేర్చారు. భూమికి బదులు రైల్వే ఉద్యోగాల కుంభకోణంపై సీబీఐ 2021 సెప్టెంబర్ 23న దర్యాప్తు ప్రారంభించింది. ఉద్యోగాలు పొందిన అభ్యర్థులు మూడు సేల్ డీడ్ల ద్వారా భూమిని రబ్రీదేవికి, ఒక సేల్ డీడ్ ద్వారా మీసా భారతికి, రెండు గిఫ్ట్ డీడీల ద్వారా హేమా యాదవ్‌కు బదిలీ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ భూములను సొంతం చేసుకోవడానికి లాలూ కుటుంబం సదరు అభ్యర్థులకు కేవలం రూ.3.75 లక్షల నుంచి రూ.13 లక్షల దాకా చెల్లించినట్లు సీబీఐ చెబుతోంది. నిజానికి ఆ భూముల విలువ రూ.కోట్లల్లో పలుకుతోంది. సంచలనం సృష్టించిన దాణా కుంభకోణంలో లాలూ ప్రసాద్ యాదవ్‌కు న్యాయస్థానం ఇటీవలే బెయిల్ మంజూరు చేసిన విషయం విదితమే. భూమికి బదులు రైల్వే ఉద్యోగాల వ్యవహారంలో సీబీఐ కేసు నమోదు చేయడంపై రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) స్పందించింది. కేంద్రంలోని అధికార బీజేపీ సీబీఐని అడ్డం పెట్టుకొని బెదిరింపులకు దిగుతోందని, తాము భయపడే ప్రసక్తే లేదని ఆర్జేడీ అధికార ప్రతినిధి మనోజ్ కుమార్ ఝా తేల్చిచెప్పారు. రబ్రీదేవి పట్ల అధికారుల అనుచిత ప్రవర్తన బిహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి పట్ల సీబీఐ అధికారులు అనుచితంగా ప్రవర్తించారని, అసభ్యకర పదజాలంతో దూషించారని ప్రతిపక్ష రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) ఆరోపించింది. భూమికి బదులు రైల్వే ఉద్యోగాల కేసులో సీబీఐ అధికారులు శుక్రవారం పాట్నాలో రబ్రీ దేవి నివాసంలో సోదాలు నిర్వహించారు. ఆమెను 12 గంటలపాటు సుదీర్ఘంగా విచారించారు. -
బ్యాంకును మోసగించారని సీబీఐ కేసు నమోదు
సాక్షి, అమరావతి: హైదరాబాద్‌లోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖను రూ.61.71 కోట్ల మేర మోసంచేసిన కేసులో శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన కండ్ర ప్రసన్నకుమార్‌రెడ్డి, ఆయన కుటుంబసభ్యులు ఇద్దరు, కొందరు ప్రభుత్వ ఉద్యోగులపై సీబీఐ గురువారం ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. నెల్లూరులో ఆయన నివాసంతోపాటు మరో రెండుచోట్ల సీబీఐ అధికారులు గురువారం సోదాలు నిర్వహించారు. కండ్ర ప్రసన్నకుమార్‌రెడ్డి శ్రీరాజరాజేశ్వరి రా అండ్ బాయిల్డ్ రైస్ మిల్ పేరిట తప్పుడు పత్రాలు సమర్పించి హైదరాబాద్‌లోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖ నుంచి 2017, 2018ల్లో రూ.65.50 కోట్ల రుణం తీసుకున్నారు. 2018లో బ్యాంకు ఆ ఖాతాను నిరర్ధక ఆస్తి (ఎన్పీఏ)గా ప్రకటించింది. దీంతో ప్రసన్నకుమార్‌రెడ్డి రూ.80 లక్షల రుణం చెల్లించారు. అప్పటికే ఆయన తన ఖాతాలోని నగదును నిబంధనలకు విరుద్ధంగా ఇతర ఖాతాలకు తరలించినట్టు బ్యాంకు గుర్తించింది. వ్యాపార అవసరాల కోసం తీసుకున్న రుణాన్ని ఇతర అవసరాలకు మళ్లించారు. ప్రసన్నకుమార్‌రెడ్డి తప్పుడు టర్నోవర్ పత్రాలు చూపించి రుణం తీసుకున్నారని కూడా నిర్ధారణ అయింది. దీనిపై బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు సీబీఐ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. -
Birbhum Violence: బీర్భూమ్ హత్యాకాండ.. 21 మందిపై ఎఫ్ఐఆర్
రామ్పుర్హత్: బీర్భూమ్ హత్యాకాండపై విచారణకు 30 మంది సభ్యుల సీబీఐ బృందం ఘటనాస్థలికి చేరుకుంది. సజీవదహనాలపై విచారణ ఆరంభించింది. విచారణ అనంతరం ఎఫ్ఐఆర్లో 21 మంది నిందితుల పేర్లను సీబీఐ నమోదు చేసింది. స్థానిక నేత హత్యకు ప్రతీకారంగా సజీవదహన ఘటన జరిగిఉండవచ్చని అంచనా వేసిది. మరో 70– 80 మంది గుంపునకు ఈ సంఘటనతో సంబంధం ఉందని భావిస్తున్నట్లు తెలిపింది. డెడ్‌లైన్ లోపు విచారణ పూర్తి చేసి కోర్టుకు నివేదిక అందించాల్సిఉన్నందున సమయం వృథా చేయమని సీబీఐ అధికారులు చెప్పారు. డీఐజీ అఖిలేశ్ సింగ్ ఆధ్వర్యంలో వచ్చిన సీబీఐ అధికారులు మూడు బృందాలుగా విడిపోయి విచారణ జరుపుతున్నారు. బోగ్తాయ్ గ్రామంలో అధికారులు దాదాపు ఐదుగంటలు గడిపారు. ఘటనా స్థలాన్ని నిశితంగా పరిశీలించి ఆధారాల కోసం అన్వేషించారు. తాము జరిపే విచారణను వీడియో తీయడంతో పాటు తమతో ఒక ఫోరెన్సిక్ నిపుణుడిని కూడా సీబీఐ అధికారులు వెంటపెట్టుకుతిరుగుతున్నారు. మరికొందరు అధికారులు పోలీసుస్టేషన్లో కేసు డైరీని అధ్యయనం చేశారు. బోగ్తాయ్‌లో శ్మశాన నిశబ్దం బోగ్తాయ్: సజీవదహనం జరిగిన బెంగాల్‌లోని బోగ్తాయ్ గ్రామంలో శ్మశాన నిశబ్దం తాండవిస్తోంది. గ్రామస్తులు చాలామంది ఊరువిడిచి పొరుగు గ్రామాలకు పారిపోయారు. స్థానిక టీఎంసీ నేత భాదు షేక్ హత్య, అనంతర హింసాకాండతో గ్రామస్తులు భీతిల్లిపోతున్నారు. ఈ ఘటనలు కొనసాగవచ్చని భయపడుతున్నారు. దీంతో చాలామంది పెళ్లాంబిడ్డలతో కలిసి బంధువుల ఊర్లకు పారిపోయారు. గ్రామాన్ని సందర్శించిన జర్నలిస్టులకు తాళం వేసిన గృహాలు స్వాగతమిచ్చాయి. కొందరు వృద్ధ మహిళలు, పెద్దవారు మాత్రమే ఊర్లో కనిపించారు. యువకులంతా భయంతో గ్రామం విడిచిపోయారన్నారు. సీబీఐ విచారణ పూర్తయితే నిజానిజాలు బయటపడతాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. -
ఎస్బీఐకి మీనా జ్యువెలర్స్ కుచ్చుటోపీ
సాక్షి, హైదరాబాద్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను రూ.364 కోట్లు మోసగించిన వ్యవహారంలో హైదరాబాద్‌కు చెందిన మీనా జ్యువెలర్స్ సంస్థతో పాటు డైరెక్టర్లపై బెంగళూరు సీబీఐ మూడు కేసులు నమోదు చేసింది. మీనా జ్యువెలర్స్ ప్రమోటర్లు ఉమేష్ జెత్వాని, అతడి భార్య హేమ, కుమారుడు కరణ్‌పై కేసు నమోదు చేసినట్లు తెలిసింది. ఎస్బీఐ డీజీఎం ఫిర్యాదు మేరకు సీబీఐ ఈ చర్యలు చేపట్టినట్లు తెలియగా, 2015–19 మధ్య కాలంలో మీనా జ్యువెలర్స్ ప్రమోటర్లు నకిలీ పత్రాలతో బ్యాంకు నుంచి క్రెడిట్ పొంది, ఆ రుణాలను ఇతర సంస్థలు, ఉపయోగాలకు మళ్లించినష్టాలుగా చూపించినట్టు ఎస్బీఐ డీజీఎం ఫిర్యాదులో వెల్లడించారు. మీనా జ్యువెలర్స్ హైదరాబాద్ కేంద్రంగా మూడు ఔట్లెట్లు నిర్వహిస్తోంది. బంగారం, వజ్రాలు, వెండి, ప్రీమియం గడియారాలు, అత్యాధునిక మొబైల్ ఫోన్ల వ్యాపారం చేస్తోంది. 2001లో ఫర్మ్ సంస్థగా మొదలై, 2007లో లిమిటెడ్ కంపెనీగా మారింది. ఫోరెన్సిక్ ఆడిట్‌తో వెలుగులోకి... బ్యాంకులను మోసం చేసేందుకు ఖాతా బుక్కులను తారుమారు చేసినట్లు ఎస్బీఐ థర్డ్ పార్టీ ఫోరెన్సిక్ రిపోర్ట్‌లో బయటపడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఔట్లెట్లలో క్లోజింగ్ స్టాక్ ఎక్కువగా చూపించి, బ్యాంకుకు అందించిన స్టాక్‌లో వ్యత్యాసాలు వచ్చాయని, వ్యాట్ లెక్కల్లో కూడా అవకతవకలకు పాల్పడ్డారని తేలిందని పేర్కొన్నారు. ఇద్దరు గ్యారెంటీర్లు మనోజ్ గన్వానీ, భావనా గన్వానీ సంతకాలను ప్రమోటర్లు ఫోర్జరీ చేసినట్లు ఫిర్యాదులో స్పష్టంచేశారు. ఈ విచారణలో మీనా జ్యువెలర్స్‌కు చెందిన మరో రెండు కంపెనీలు మీనా జ్యువెలర్స్ ఎక్స్‌క్లూజివ్ ప్రైవేట్ లిమిటెడ్, మీనా జ్యువెలర్స్–డైమండ్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రమేయం కూడా ఉన్నట్లు బయటపడినట్లు వెల్లడించారు. ఈ రెండు కంపెనీలపైనా ఎస్బీఐ ఫిర్యాదు చేయడంతో వాటిపై కూడా సీబీఐ కేసులు నమోదు చేసినట్టు తెలిసింది. 2016 నుంచి 2020 మధ్య కాలంలో మీనా జ్యువెలర్స్ రూ.906 కోట్లు వ్యాపారం చేసిందని, అయితే క్యాష్ క్రెడిట్ ఖాతాలో రూ.110 కోట్ల రసీదులనే చూపించినట్లు వెల్లడైంది. మొత్తంగా మూడు కంపెనీల పేరిట రూ.364 కోట్లు రుణాలు తిరిగి చెల్లించాల్సి ఉందని, అనేకసార్లు నోటీసులిచ్చినా కంపెనీ ప్రమోటర్లు స్పందించలేదని ఎస్బీఐ పేర్కొంది. ఈ మేరకు ఫిర్యాదు రావడంతో సీబీఐ కేసులు నమోదుచేసింది. -
మీనా జ్యువెలర్స్ గ్రూప్‌పై సీబీఐ కేసు నమోదు
-
రుణాల పేరిట మోసం.. సీబీఐ కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: స్టార్ హోటల్ నిర్మాణానికి రుణాల పేరిట మోసంపై సీబీఐ కేసు నమోదు చేసింది. పీఎన్బీ కన్సార్టియాన్ని రూ.159 కోట్ల మేర మోసం చేశారనే అభియోగం ఉంది. డబుల్ ట్రీ హోటల్ పేరిట రుణాలు పొంది మళ్లించినట్లు అభియోగాలు ఉన్నాయి. సప్తరుషి హోటల్స్, మహా హోటల్స్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది. డైరెక్టర్లు ఎల్ఎన్ శర్మ, యశ్దీప్ శర్మ, సునీత శర్మపై సీబీఐ కేసు నమోదు చేసింది. అగస్త్య ట్రేడ్ లింక్స్, ఖందాల్ ట్రేడింగ్, రజినీగంధ డిస్ట్రిబ్యూటర్స్, సింబియాసిస్ ఎయిర్ వర్క్స్ పై సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. ఇవీ చదవండి: సముద్రంలో అల్లకల్లోలం: ముందుకొచ్చి.. వెనక్కి మళ్లి.. Bullet Bandi: వాళ్లిద్దరికి సన్మానం -
సెంట్రల్ బ్యాంకుకు టోకరా.. మరో భారీ ‘రుణ’ కుంభకోణం
న్యూఢిల్లీ: బ్యాంకుల నుంచి రూ.వేల కోట్ల రుణాలు తీసుకొని, తిరిగి చెల్లించకుండా ఎగవేస్తున్న బాగోతాలు క్రమంగా వెలుగులోకి వస్తున్నాయి. బడా బాబుల బండారం బట్టబయలవుతోంది. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన శ్రీలక్ష్మి కాట్‌సిన్‌తోపాటు ఆ సంస్థ చైర్మన్ కమ్ ఎండీ మాతా ప్రసాద్ అగర్వాల్, ఇతరులపై సీబీఐ కేసు నమోదు చేసింది. సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియా నేతృత్వంలోని 10 బ్యాంకుల కన్సార్టియం నుంచి వీరు భారీగా రుణం తీసుకున్నారు. తిరిగి చెల్లించకుండా చేతులెత్తేశారు. ఫలితంగా బ్యాంకుల కన్సార్టియంకు రూ.6,833 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు అధికారులు శనివారం తెలిపారు. ఈ ఏడాది సీబీఐ దర్యాప్తు చేస్తున్న బ్యాంకు ఫ్రాడ్ కేసుల్లో ఇదే అతి పెద్దదని పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు తాజాగా నోయిడా, రూర్కీ, కాన్పూర్, ఫతేపూర్ తదితర ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. సెంట్రల్ బ్యాంకు అఫ్ ఇండియా ఫిర్యాదు మేరకు బ్యాంక్ ఫ్రాడ్ కేసులో సీబీఐ అధికారులు ‘శ్రీలక్ష్మి కాట్సిన్’ చైర్మన్ మాతా ప్రసాద్ అగర్వాల్‌తోపాటు జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ పవన్‌కుమార్ అగర్వాల్, డైరెక్టర్ శారదా అగర్వాల్, డిప్యూటీ ఎండీ దేవస్ నారాయణ్ గుప్తాను నిందితులుగా ఎఫ్ఐఆర్లో చేర్చారు. నిందితులు ఉద్దేశపూర్వకంగానే తమ బ్యాంకును మోసగించినట్లు సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఆరోపించింది. తీసుకున్న రుణాన్ని దారి మళ్లించారని, ఇలా చేయడం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే అవుతుందని తేల్చిచెప్పింది. రుణం కోసం తప్పుడు పత్రాలు సమర్పించారని, అబద్ధాలు చెప్పారని పేర్కొంది. వస్త్ర వ్యాపారం చేసే శ్రీలక్ష్మి కాట్సిన్ సంస్థ తమ వద్ద అధికంగా నిల్వలు ఉన్నట్లు బ్యాంకులకు ఫోర్జరీ రికార్డులు సమర్పించింది. రూ.7,926 కోట్లకు పైగా రుణం తీసుకొని, తిరిగి చెల్లించకుండా బ్యాంకులను దగా చేసిన హైదరాబాద్‌కు చెందిన ట్రాన్స్ట్రాయ్(ఇండియా) లిమిటెడ్‌పై గత ఏడాది సీబీఐ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. -
బొల్లినేని శ్రీనివాస గాంధీ అరెస్ట్
-
రఘురామకృష్ణరాజుపై సీబీఐ మరో కేసు
-
డీహెచ్ఎఫ్ఎల్ ఉత్తుత్తి గృహ రుణాలు..
న్యూఢిల్లీ: లబ్ధిదారులతో సంబంధం లేకుండా ఉత్తుత్తి (కల్పిత) గృహ రుణ ఖాతాలను సృష్టించి వాటిపై ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం (పీఎంఏవై) సబ్సిడీలను డీహెచ్ఎఫ్ఎల్ కంపెనీ మింగేసినట్టు బయటపడింది. ఇందుకు సంబంధించి డీహెచ్ఎఫ్ఎల్ కంపెనీ, డీహెచ్ఎఫ్ఎల్ ప్రమోటర్లు అయిన కపిల్ వాధ్వాన్, ధీరజ్ వాధ్వాన్, డైరెక్టర్లపై కేసు నమోదు చేసింది. డీహెచ్ఎఫ్ఎల్ ఖాతాలను ఫోరెన్సిక్ ఆడిట్ చేసిన గ్రాంట్ థార్న్టన్ సంస్థ ఈ మోసాలను వెలుగులోకి తీసుకొచ్చింది. డీహెచ్ఎఫ్ఎల్ ముంబైలోని బాంద్రాలో కల్పిత శాఖను ఏర్పాటు చేయడమే కాకుండా.. అప్పటికే గృహ రుణాలు తీసుకుని చెల్లించేసిన రుణ ఖాతాలను ఉత్తుత్తి శాఖలోని డేటాబేస్‌లో చేర్చింది. 2007–19 మధ్య ఇందుకు సంబంధించి 2.60 లక్షల నకిలీ ఖాతాలను సృష్టించి రూ.14,046 కోట్ల రుణాలను మంజూరు చేసినట్టు చూపింది. రూ.11,756 కోట్లను ఇలా దారిమళ్లించినట్టు బయటపడింది. -
శివకుమార్‌పై సీబీఐ కేసు
న్యూఢిల్లీ/సాక్షి, బెంగళూరు: ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారంటూ కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ ట్రబుల్ షూటర్ మాజీ మంత్రి డీకే శివకుమార్‌పై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) సోమవారం కేసు నమోదు చేసింది. కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీలో శివకుమార్‌కు చెందిన 14 నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో రూ.57 లక్షల నగదు, కీలక డాక్యుమెంట్లు, కంప్యూటర్ హార్డ్ డిస్క్‌ను స్వాధీనం చేసుకున్నట్లు సీబీఐ వర్గాలు తెలిపాయి. శివకుమార్ సోదరుడు డీకే సురేశ్‌కు చెందిన రెండు నివాసాల్లోనూ(బెంగళూరు, ఢిల్లీ) సోదాలు నిర్వహించారు. డీకే శివకుమార్ గతంలో రాష్ట్ర మంత్రిగా పనిచేసినప్పుడు రూ.74.93 కోట్ల విలువైన ఆస్తులు అక్రమంగా సంపాదించారని సీబీఐ ఆరోపిస్తోంది. ఇవన్నీ ఆయన పేరిట, కుటుంబ సభ్యుల పేరిట ఉన్నాయని చెబుతోంది. ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారంలో సీబీఐ ఏడు నెలల క్రితం ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించింది. తాజాగా కేసు నమోదు చేసింది. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతుందని సీబీఐ ప్రతినిధి ఆర్కే గౌర్ చెప్పారు. మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) గతంలోనే డీకే శివకుమార్‌ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. డీకే శివకుమార్‌పై సీబీఐ కేసు పెట్టడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం రాజకీయ ప్రత్యర్థులపై ఉద్దేశపూర్వకంగా వేధింపులకు పాల్పడుతోందని ఆరోపించింది. కర్ణాటకలో నవంబర్ 3వ తేదీన రెండు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో తమ పార్టీని దెబ్బతీయడానికే డీకే శివకుమార్‌పై కేసు పెట్టారని విమర్శించింది. మోదీ, యడ్యూరప్ప ద్వయం చేతుల్లో సీబీఐ కీలుబొమ్మగా మారిపోయిందని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా మండిపడ్డారు. డీకే శివకుమార్ సీబీఐకి సహకరించి, తన నిజాయితీని నిరూపించుకోవాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి హితవు పలికారు. రూ.వందల కోట్ల ఆస్తులను అతి తక్కువ కాలంలో ఎలా ఆర్జించారో చెప్పాలన్నారు. -
డాక్టర్ సుధాకర్‌పై కేసు..
-
ప్రియాంక గాంధీ సన్నిహితురాలికి సీబీఐ షాక్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ భరత నాట్యం కళాకారిణి, సంగీత నాటక అకాడమీ మాజీ చైర్పర్సన్ లీలా శాంసన్‌పై సీబీఐ కేసులు నమోదు చేసింది. అవినీతి ఆరోపణలతో ఆమెతోపాటు అప్పటి అధికారులపై సీబీఐ అవినీతి, క్రిమినల్, కుట్ర కేసులు నమోదు చేసింది. ఈ మేరకు సీబీఐ అధికారులు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. చెన్నై కళాక్షేత్ర ఫౌండేషన్ కూతంబలం ఆడిటోరియం పునరుద్ధరణ సమయంలో అవినీతి జరిగిందనేది ప్రధాన అభియోగం. లీలా శాంసన్ హయాంలో రూ.7.02 కోట్ల మేర ఆర్థిక అవకతవకలు చోటు చేసుకున్నాయన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఓపెన్ టెండర్ విధానాన్ని అనుసరించకుండా కాంట్రాక్టర్లకు నామినేషన్ ప్రాతిపదికన ఎక్కువ రేటుకు కాంట్రాక్టు పనులు అప్పగించారని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ తేల్చింది. ఆర్థిక కమిటీ అధికారిక అనుమతి లేకుండా పునరుద్ధరణ పనులు జరిగాయని తెలిపింది. ఇది పెద్ద వివాదానికి దారితీసింది. దీంతో 2017 లో సంబంధిత మంత్రిత్వ శాఖ సీబీఐకి ఫిర్యాదు చేసింది. దీంతో పద్మశ్రీ అవార్డు గ్రహీత, సెన్సార్ బోర్డు చైర్‌పర్సన్‌గా కూడా పనిచేసిన లీలా శాంసన్‌తో పాటు అప్పటి చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ టీఎస్ మూర్తి, అకౌంట్స్ ఆఫీసర్ రామచంద్రన్, ఇంజనీరింగ్ ఆఫీసర్ వీ శ్రీనివాసన్, కన్సల్టెంట్ సెంటర్ ఫర్ ఆర్కిటెక్చరల్ రీసెర్చ్ అండ్ డిజైన్ (కార్డ్) సంస్థ యజమాని, చెన్నై ఇంజనీర్లపై కేసు నమోదైంది. పునర్నిర్మాణ పనుల కాంట్రాక్టును జనరల్ ఫైనాన్స్ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఫౌండేషన్ అధికారులు కన్సల్టెంట్ ఆర్కిటెక్ట్ కార్డ్‌కు ప్రదానం చేశారని సాంస్కృతిక మంత్రిత్వ శాఖ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ ఫిర్యాదులో పేర్కొన్నారు. అనవసర ఖర్చులతో పాటు, అధికారాన్ని దుర్వినియోగం చేశారని, ఈ విషయాన్ని చాలా ఏళ్లుగా దాచి పెట్టారని ఆరోపించారని సీబీఐ అధికారులు వెల్లడించారు. కాగా 2005 లో కాంగ్రెస్ ప్రభుత్వం ఆమెను కళాక్షేత్ర డైరెక్టర్‌గా నియమించింది. తరువాత ఆగస్టు 2010లో సంగీత నాటక అకాడమీ ఛైర్‌పర్సన్‌గా ఎంపికయ్యారు. ఆ తరువాత ఏప్రిల్ 2011లో బాలీవుడ్ సహా దేశీయ సినిమాలను సెన్సార్ చేసే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్‌కు ఛైర్మన్‌గా లీలా శాంసన్ నియమితులయ్యారు. మరోవైపు లీలా శాంసన్ గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితురాలుగా భావిస్తారు. ప్రియాంకగాంధీకి కొన్నేళ్లపాటు భరతనాట్యం నేర్పించినట్టుగా చెబుతారు. ఈ నేపథ్యంలోనే యూపీఏ పాలనలో పదేళ్లపాటు ఆరు కీలక పదవులను కట్టబెట్టారన్న విమర్శలున్నాయి. దీంతో లీలా శాంసనపై బీజేపీ ప్రభుత్వం సీబీఐ విచారణకు జరిపించాలని గత కొంతకాలంగా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజా పరిణామం చోటు చేసుకుంది. -
ఎన్డీటీవీ ప్రమోటర్లపై సీబీఐ కేసు
న్యూఢిల్లీ: ప్రముఖ ఆంగ్ల టీవీ ఛానల్ ‘ఎన్డీ టీవీ’పై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) బుధవారం కొరడా ఝుళిపించింది. ఎన్డీ టీవీ ప్రమోటర్లు ప్రణయ్ రాయ్, రాధికారాయ్‌తో పాటు సీఈవో సీఈఓ విక్రమాదిత్య చంద్ర, గుర్తుతెలియని ప్రభుత్వాధికారులపై నేరపూరిత కుట్ర, మోసం, అవినీతి తదిరత సెక్షన్ల కింద కేసు నమోదుచేసింది. 2007–09 మధ్యకాలంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) సేకరణ సందర్భంగా ఈ కంపెనీ ఎఫ్ఐడీ నిబంధనల్ని ఉల్లంఘించిందని సీబీఐ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది. రూ.కోట్ల పన్నులను ఎగ్గొట్టి నగదును భారత్‌లోకి అక్రమంగా తీసుకొచ్చేందుకు సంక్లిష్టమైన ఆర్థిక వ్యవహారాలు నడిపారు’ సీబీఐ తెలిపింది. కాగా, ఈ ఆరోపణలను ఎన్డీ టీవీ యాజమాన్యం ఖండించింది. భారత న్యాయవ్యవస్థపై తమకు పూర్తి నమ్మకముందనీ, జర్నలిజం విలువలకు తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది. -
రాయ్‌బరేలీ ప్రమాదంలో 25 మందిపై కేసు
ఉన్నావ్ రేప్ బాధితురాలు ప్రయాణీస్తున్న వాహనం ప్రమాదానికి గురై ఇద్దరు చనిపోగా, బాధితురాలు, ఆమె లాయరు తీవ్ర గాయాల పాలయిన సంగతి తెలిసిందే. ఆ ఘటనపై వివిధ వర్గాల నుంచి వచ్చిన ఒత్తిడితో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం సిబిఐ విచారణకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో సిబిఐ దాదాపు 25 మందిని నిందితులుగా పేర్కొంటూ కేసును దర్యాప్తు చేస్తోంది. ఇందులో గతంలో అత్యాచారానికి పాల్పడిన ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్,అతని సోదరునితో పాటు అతని లాయరు, అతనికి సన్నిహితంగా ఉన్న జర్నలిస్టులతో పాటు అరుణ్ సింగ్ అనే వ్యక్తిని చేర్చింది. ఈ అరుణ్ కుమార్ అనే వ్యక్తి ఆ రాష్ట్ర క్యాబినెట్ మినిస్టర్ అయిన రణ్వేంద్ర సింగ్‌కు అల్లుడు కావడం గమనార్హం. రణ్వేంద్ర సింగ్ ఫతేపూర్ అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికయ్యారు. అలాగే ప్రమాదానికి కారణమైన వాహనం ఫతేపూర్‌లోనే రిజిస్టర్ అవ్వడం, వాహన డ్రయివరు కూడా ఫతేపూర్‌కు చెందిన వాడు కావడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ విషయంపై మినిస్టర్ రణ్వేంద్ర సింగ్‌ను ప్రశ్నించగా.. అరుణ్ సింగ్ నా బంధువన్నది నిజమే. ఈ విషయం అందరికీ తెలుసు. అయినా ఈ ప్రమాదం కావాలని చేసినట్టు కనపడటం లేదు. ఏదేమైనా సిబిఐ విచారణలో అన్ని విషయాలు తెలుస్తాయని వ్యాఖ్యానించారు. కాగా, బుధవారం సిబిఐకి చెందిన 12 మంది అధికారుల బృందం ఘటన జరిగిన ప్రదేశాన్ని పరిశీలించింది. -
చందా కొచర్‌పై సీబీఐ కేసు
న్యూఢిల్లీ: వీడియోకాన్ గ్రూప్‌నకు మంజూరు చేసిన రుణాల వివాదంలో ప్రైవేట్ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచర్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది. క్రిమినల్ కుట్ర, మోసం, అవినీతి ఆరోపణలతో చందా కొచర్‌తో పాటు ఆమె భర్త దీపక్ కొచర్, వీడియోకాన్ గ్రూప్ ఎండీ వేణుగోపాల్ ధూత్‌లపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సీబీఐ వర్గాలు తెలిపాయి. కొచర్ తన పదవీకాలంలో వీడియోకాన్ గ్రూప్‌నకు రూ. 1,875 కోట్ల మేర ఆరు రుణ ప్రతిపాదనలను క్లియర్ చేశారని ఎఫ్ఐఆర్లో అభియోగాలు ఉన్నాయి. ఈ లావాదేవీల కారణంగా బ్యాంక్‌కు రూ. 1,730 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు సీబీఐ వర్గాలు తెలిపాయి. వీడియోకాన్ గ్రూప్, దాని అనుబంధ కంపెనీలకు ఇచ్చిన రూ. 1,875 కోట్ల విలువ చేసే ఆరు రుణాలను క్లియర్ చేసిన కమిటీలో సభ్యులైన ప్రస్తుత ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో సందీప్ బక్షితో పాటు ఇతర అధికారులు సంజయ్ చటర్జీ, జరీన్ దారువాలా, రాజీవ్ సబర్వాల్, కేవీ కామత్, హోమీ ఖుస్రోఖాన్ల పాత్రపై కూడా దృష్టి సారించనున్నట్లు సీబీఐ వర్గాలు వివరించాయి. ఎఫ్ఐఆర్ దరిమిలా గురువారం వీడియోకాన్ గ్రూప్, దీపక్ కొచర్‌కు చెందిన న్యూపవర్ రెన్యూవబుల్స్, ధూత్ ఒకప్పుడు ప్రమోట్ చేసిన సుప్రీమ్ ఎనర్జీ సంస్థ ముంబై, ఔరంగాబాద్ కార్యాలయాల్లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. క్విడ్ ప్రో కో వివాదం.. వీడియోకాన్ గ్రూప్‌నకు రుణాల మంజూరుకు చందా కొచర్ తోడ్పడినందుకు గాను ప్రతిగా ఆమె భర్త దీపక్ కొచర్‌కు చెందిన న్యూపవర్‌లో తన సుప్రీం ఎనర్జీ సంస్థ ద్వారా ధూత్ రూ.64 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు ఆరోపణలున్నాయి. 2017 డిసెంబర్లో సీబీఐ ఈ వివాదంపై ప్రాథమిక విచారణ ప్రారంభించింది. బ్యాంకు నియమ, నిబంధనలకు విరుద్ధంగా ఈ రుణాలు మంజూరైనట్లు ఆరోపణలు ఉన్నాయని సీబీఐ వర్గాలు పేర్కొన్నాయి. ఇలా వీడియోకాన్ గ్రూప్‌నకు ఇచ్చిన రుణాల్లో అధిక భాగం లోన్లు మొండిబాకీలుగా మారడంతో బ్యాంక్‌కు దాదాపు రూ. 1,730 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు సీబీఐ వర్గాలు వివరించాయి. ఎఫ్ఐఆర్లో చందా, దీపక్, ధూత్‌లతో పాటు న్యూపవర్ రెన్యూవబుల్స్, సుప్రీం ఎనర్జీ, వీడియోకాన్ ఇంటర్నేషనల్ ఎలక్ట్రానిక్స్, వీడియోకాన్ ఇండస్ట్రీస్‌పై అభియోగాలు ఉన్నాయి. షేర్లు 3 శాతం దాకా డౌన్.. కొచర్, ధూత్‌లపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో గురువారం ఐసీఐసీఐ బ్యాంక్, వీడియోకాన్ ఇండస్ట్రీస్ షేర్లు ఒకదశలో సుమారు మూడు శాతం దాకా పడ్డాయి. బీఎస్ఈలో వీడియోకాన్ ఇండస్ట్రీస్ షేరు 2.73% క్షీణించి రూ.2.85 వద్ద, ఐసీఐసీఐ షేరు 0.72% పడి రూ.365 వద్ద క్లోజయ్యాయి. ఇంత జాప్యం ఎందుకు.. ఐసీఐసీఐ కేసులో రిజర్వ్ బ్యాంక్ వ్యవహరించిన తీరును ప్రభుత్వ రంగ(పీఎస్బీ) బ్యాంకర్లు ఆక్షేపించారు. చందా కొచర్‌పై చర్యలకు జాప్యం జరగడాన్ని తప్పుపట్టారు. ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల విషయంలో ఆర్బీఐ వేర్వేరుగా వ్యవహరిస్తోందన్నారు. ప్రభుత్వ బ్యాంకులను నియంత్రించేందుకు తగినన్ని అధికారాల్లేవన్న ఆర్బీఐ.. మరి ప్రైవేట్ బ్యాంకులపై పూర్తి అధికారాలున్నా చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. విధానపరమైన చిన్న చిన్న లోపాలకు కూడా పీఎస్బీల్లో టాప్ అధికారులపై తక్షణం చర్యలు తీసుకుంటున్న ఆర్బీఐ.. స్పష్టమైన ఆధారాలున్నా కొచర్ విషయంలో మాత్రం ఆ పని చేయలేదని బ్యాంకర్లు వ్యాఖ్యానించారు. ప్రక్రియాపరమైన వైఫల్యాల కారణంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎండీ, ఇద్దరు ఈడీలపై సత్వరం వేటేసిన ఆర్బీఐ.. కొచర్ విషయంలో మీనమేషాలు లెక్కపెట్టుకుం టూ కూర్చుందని ఆలిండియా బ్యాంక్ ఆఫీసర్స్ సమాఖ్య ఏఐబీవోసీ ప్రతినిధి వ్యాఖ్యానించారు. విచారణ క్రమం ఇదీ.... ► ఈ వివాదంలో వేణుగోపాల్ ధూత్‌తో పాటు వీడియోకాన్ గ్రూప్ సంస్థలు, ఐసీఐసీఐ మాజీ సీఈవో చందా కొచర్, ఆమె భర్త దీపక్ కొచర్, ఆయనకు చెందిన న్యూపవర్ రెన్యూవబుల్స్ కేంద్ర బిందువులు. ► మొత్తం రూ. 3,250 కోట్ల రుణాల వివాదంపై 2017 డిసెంబర్లో సీబీఐ ప్రాథమిక విచారణ చేపట్టింది. ఈ క్రమంలో వీడియోకాన్ ఇండస్ట్రీస్ (వీఐఎల్), వీడియోకాన్ ఇంటర్నేషనల్ ఎలక్ట్రానిక్స్‌తో (వీఐఈఎల్) పాటు ఆ గ్రూప్‌లోని మరో నాలుగు కంపెనీలకు 2009 జూన్ – 2011 అక్టోబర్ మధ్యకాలంలో రూ. 1,875 కోట్ల మేర ఇచ్చిన ఆరు రుణాల్లో అవకతవకలు చోటు చేసుకున్నాయని సీబీఐ తేల్చింది. ► వీడియోకాన్ ఇంటర్నేషనల్ ఎలక్ట్రానిక్స్‌కి 2009 ఆగస్టు 26న రూ. 300 కోట్ల రుణం, వీడియోకాన్ ఇండస్ట్రీస్‌కు 2011 అక్టోబర్ 31న రూ. 750 కోట్లు మంజూరు చేసిన కమిటీలో చందా కొచర్ కూడా ఉన్నారని తేలినట్లు సీబీఐ వర్గాలు తెలిపాయి. ► 2009 ఆగస్టులో బ్యాంక్ కమిటీ ఆమోదం పొందిన రూ. 300 కోట్ల రుణం అదే ఏడాది సెప్టెంబర్ 7న వీడియోకాన్ ఇంటర్నేషనల్ ఎలక్ట్రానిక్స్‌కు మంజూరైంది. తన సొంత సంస్థ సుప్రీం ఎనర్జీ ద్వారా ధూత్ ఆ మర్నాడే .. న్యూపవర్ రెన్యూవబుల్స్కి దొడ్డిదారిన రూ. 64 కోట్లు బదలాయించారని అభియోగాలున్నాయి. ‘తొలి విద్యుత్ ప్లాంట్ కొనుగోలు కోసం దీపక్ కొచర్ సంస్థ న్యూపవర్‌కి లభించిన అత్యధిక మొత్తం పెట్టుబడి ఇది. వీడియోకాన్ గ్రూప్‌నకు రుణాలు మంజూరు చేసిందుకు ఈ రూపంలో చందా కొచర్ లబ్ధి పొందినట్లయింది‘ అని సీబీఐ వర్గాలు తెలిపాయి. ► వీఐఎల్, వీఐఈఎల్తో పాటు మిలీనియం అప్లయెన్సెస్, స్కై అప్లయెన్సెస్, టెక్నో ఎలక్ట్రానిక్స్, అప్లికాంప్ ఇండియాకు కూడా ఐసీఐసీఐ బ్యాంక్ రుణాలిచ్చింది. వీఐఎల్ నుంచి పొందిన అన్సెక్యూర్డ్ లోన్లను తీర్చేసేందుకు ఈ నాలుగు సంస్థలు.. ఆ రుణాలను ఉపయోగించుకున్నాయని ఎఫ్ఐఆర్లో సీబీఐ పేర్కొంది. ఈ రుణాలు మొండిబాకీలుగా మారడంతో ఐసీఐసీఐ బ్యాంక్‌కు భారీ నష్టం వాటిల్లగా రుణాలు పొందిన నిందితులు మాత్రం ప్రయోజనాలు పొందారని తెలిపింది. ఈ నేపథ్యంలో రుణాలు మంజూరు చేసిన కమిటీలోని సీనియర్ అధికారుల పాత్రపై కూడా విచారణ జరపాల్సి ఉంటుందని సీబీఐ పేర్కొంది. -
సోహ్రబుద్దీన్ ఎన్కౌంటర్ కేసు తీర్పు నేడే!
ముంబై: సోహ్రబుద్దీన్ నకిలీ ఎన్కౌంటర్ కేసులో 14 మంది పోలీస్ అధికారులను నిర్దోషులుగా విడుదల చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై బాంబే హైకోర్టు సోమవారం తీర్పును వెలువరించే అవకాశముంది. గ్యాంగ్‌స్టర్ సోహ్రబుద్దీన్, అతని భార్య కౌసర్బీ, అనుచరుడు తులసీ ప్రజాపతిని గుజరాత్, రాజస్తాన్ పోలీసులు 2005–06 మధ్యకాలంలో ఎన్కౌంటర్ల పేరుతో కాల్చిచంపినట్లు సీబీఐ గతంలో కేసు నమోదుచేసింది. ఈ కేసును విచారించే ప్రత్యేక కోర్టును 2013లో సుప్రీంకోర్టు ముంబైకి మార్చింది. నిందితుల్లో 15 మందిని కోర్టు నిర్దోషులుగా విడుదల చేసింది. దిగువ కోర్టు నిర్ణయాన్ని సవాలుచేస్తూ సోహ్రబుద్దీన్ సోదరుడు, సీబీఐ బాంబే హైకోర్టులో పిటిషన్లను దాఖలు చేశాయి. వాటిపై నేడు తీర్పు వెలువడే అవకాశముంది. -
ఎన్డీఏలో ఐదుగురు సిబ్బందిపై సీబీఐ కేసు
న్యూఢిల్లీ: మహారాష్ట్రలోని ఖడక్వాస్లాలో ఉన్న నేషనల్ డిఫెన్స్ అకాడమీ(ఎన్డీఏ) ప్రిన్సిపాల్‌తో పాటు నలుగురు బోధనా సిబ్బందిపై సీబీఐ బుధవారం కేసు నమోదుచేసింది. బోధనారంగంలో అనుభవం, పనీతీరుపై నకిలీ సర్టిఫికెట్లతో ఈ ఐదుగురు నిందితులు ఎన్డీఏలో ఉద్యోగాలు పొందారని అరోపించింది. కేసు నమోదుచేసిన అనంతరం సీబీఐ అధికారులు ఖడక్వాస్లాలోని ఎన్డీఏ ప్రాంగణంతో పాటు నిందితుల ఇళ్లపై దాడిచేసి కీలకపత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయమై సీబీఐ అధికార ప్రతినిధి ఆర్కే గౌర్ స్పందిస్తూ.. పుణేలో ఉన్న ఎన్డీఏ–ఖడక్వాస్లా ప్రిన్సిపాల్ ఓంప్రకాశ్ శుక్లా, ప్రొఫెసర్ జగ్మోహన్ మెహెర్(పొలిటికల్ సైన్స్) అసోసియేట్ ప్రొఫెసర్లు వనీతా పూరి (కెమిస్ట్రీ), రాజీవ్ బన్సల్(గణితం), కెమిస్ట్రీ విభాగం హెచ్‌వోడీ మహేశ్వర్ రాయ్‌పై కేసు నమోదుచేశామని తెలిపారు. అలాగే యూపీఎస్సీ, ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ ప్రధాన కార్యాలయానికి(హెచ్‌క్యూ–ఐడీఎస్) చెందిన గుర్తుతెలియని అధికా రిపైన కూడా కేసు నమోదుచేశామన్నారు. ఖడక్వాస్లాలోని ఎన్డీఏలో 13 మంది అర్హతలేని బోధనా సిబ్బంది అక్రమంగా ఉద్యోగాలు పొందారన్న ఆరోపణలపై గతేడాది ప్రాథమిక విచారణ ప్రారంభించినట్లు గౌర్ తెలిపారు. సాధారణంగా ఎన్డీఏలో బోధనా సిబ్బందిని యూపీఎస్సీ ఎంపిక చేస్తుందనీ, యూపీఎస్సీ సిఫార్సు ఆధారంగా రక్షణశాఖ నియామకాలు చేపడుతుందని పేర్కొన్నారు. యూపీఎస్సీతో పాటు హెచ్‌క్యూ–ఐడీఎస్‌లోని కొందరు అధికారుల సాయంతో ఈ ఐదుగురు నిందితులు 2007–08, 2012–13 మధ్యకాలంలో నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాల్లో చేరినట్లు విచారణలో తేలిందన్నారు. దీంతో కేసు నమోదుచేశామని వెల్లడించారు. -
‘ఉనావో’ కేసు: శశి కొడుకు అరెస్ట్
లక్నో: ఉనావో అత్యాచార ఘటనకు సంబంధించి సీబీఐ మంగళవారం మరో వ్యక్తిపై కేసు నమోదు చేసింది. తన ఎఫ్ఐఆర్లో శశి సింగ్ కుమారుడు శుభం సింగ్‌ను నిందితునిగా చేర్చింది. శశి సింగ్ బాధిత యువతిని ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగర్ నివాసానికి తీసుకెళ్లిందనే ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. తాజాగా ఆమె కుమారుడు శుభం సింగ్‌కు ఈ ఘటనతో సంబంధం ఉందని సీబీఐ అభియోగాలు మోపింది. అత్యాచార బాధితురాలిని ఘటనా స్థలానికి చేర్చడంలో శుభం సింగ్ ప్రమేయం కూడా ఉందని ఎఫ్ఐఆర్లో పేర్కొంది. విచారణ నిమిత్తం మంగళవారం శుభం సింగ్‌ను అరెస్టు చేసింది. ‘ప్రలోభాలకు గురిచేసి ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగర్ ఇంటికి శశి సింగ్ నా కూతురుని తీసుకెళ్లింది. ఎమ్మెల్యే అఘాయిత్యం చేస్తున్న సమయంలో శశి గేటు కాపలాగా ఉంద’ని అత్యాచార బాధిత యువతి తల్లి సీబీఐకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. కాగా, సీబీఐ ఆదివారం శశి సింగ్‌కు 4 రోజుల కస్టడీ విధించిన సంగతి తెలిసిందే. బాధిత యువతి మైనర్ కాదనే గందరగోళం తలెత్తడంతో మరోసారి ఆమె వయసు నిర్ధారణకు యువతిని శనివారం లక్నోలోని రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించారు. ఘటన చోటుచేసుకునే నాటికి ఆమె మైనర్ కాదని తేలితే.. పోక్సో చట్టం (ప్రొటెక్షన్ ఆఫ్ చిల్ర్డన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్) కింద ఎమ్మెల్యేపై మోపిన కేసుల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. -
లియోనియా రిసార్ట్స్ ఎండీ అరెస్టు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ శివార్లలోని శామీర్‌పేట్‌లో ఉన్న లియోనియా రిసార్ట్స్ ఎండీ చక్రవర్తి రాజును సీబీఐ అధికారులు బుధవారం అరెస్టు చేశారు. లియోనియా రిసార్ట్స్ నిర్మించడం కోసం చక్రవర్తి రాజు 11 బ్యాంకుల నుంచి రూ.650 కోట్ల మేర రుణం తీసుకున్నారు. ఆ సమయంలో అనేక మంది రైతుల భూములకు సంబంధించిన బోగస్ పత్రాలను బ్యాంకుల్లో దాఖలు చేశారనే ఆరోపణలపై బెంగళూరు సీబీఐ టీమ్ కేసు నమోదు చేసుకుంది. ఈ రిసార్ట్‌కు కేవలం 30 ఎకరాల స్థలం మాత్రమే ఉండగా... బ్యాంకులకు 100 ఎకరాలకు పైగా చూపించారని, బోగస్ డాక్యుమెంట్ల ద్వారానే ఇది సాధ్యమైందని సీబీఐ గుర్తించింది. దీనికి సంబంధించి ప్రాథమిక ఆధారాలు సేకరించిన అధికారులు నిందితుడిగా ఉన్న చక్రవర్తి రాజును అరెస్టు చేశారు. -
తిరుమలగిరి పోస్టాఫీస్ ఉద్యోగులపై కేసు
సాక్షి, హైదరాబాద్: తిరుమలగిరి పోస్టాఫీసు ఉద్యోగులపై సీబీఐ కేసు నమోదు చేసింది. నోట్ల రద్దు సమయంలో ఈ పోస్టాఫీస్ సిబ్బంది, అధికారులు కొత్తనోట్లను అక్రమంగా ప్రైవేట్ వ్యక్తులకు మార్చారని ఆరోపిస్తూ సికింద్రాబాద్ రీజియన్ పోస్టాఫీస్ సీనియర్ సూపరింటెండెంట్ వీబీ గణేశ్ కుమార్ రెండు రోజులక్రితం సీబీఐకి ఫిర్యాదు చేశారు. తిరుమలగిరి పోస్ట్‌మాస్టర్ శ్రీనివాసులు, ట్రెజరర్ ఎస్ చంద్రమౌళి ఎలాంటి రికార్డులు లేకుండా రూ.8.8 లక్షల పాతనోట్లకు కొత్తనోట్లను మార్చి ఇచ్చినట్టు గణేశ్ కుమార్ ఆరోపించారు. ఈ ఫిర్యాదుపై ప్రాథమిక విచారణ జరిపిన సీబీఐ అధికారులు రికార్డులో నగదు మార్పిడికి సంబంధించి ఆధారాలు లేనట్లు గుర్తించింది. దీంతో వీరిద్దరిపై పీసీయాక్ట్ 1988 కింద 13(2) రెడ్‌విత్ 13 (1)(డి), ఐపీసీ 120 బిరెడ్ విత్, 409, 420, 477 (ఏ)కింద కేసులు నమోదు చేశారు. -
వ్యాపారులతో ఎస్బీఐ అధికారుల కుమ్మక్కు
► ఒకేరోజు రూ. 2.49 కోట్లు.. ► నిబంధనలకు విరుద్ధంగా బ్యాంక్ నుంచి విత్‌డ్రా ► వ్యాపారులతో ఎస్బీఐ అధికారుల కుమ్మక్కు ► ప.గో. జిల్లా తణుకులో బయటపడిన నిర్వాకం ► ఏజీఎంసహా ఐదుగురు ఉద్యోగులు, మరో 9 మందిపై సీబీఐ కేసు ► నిందితుల ఇళ్లల్లో సోదాలు.. ► రూ.2.11 లక్షలు స్వాధీనం సాక్షి, విశాఖపట్నం: పెద్ద నోట్ల రద్దు తర్వాత బ్యాంకుల్లో ఉన్న నగదును విత్‌డ్రా చేసుకోవాలంటే సవాలక్ష నిబంధనలు, పరిమితులతో దేశవ్యాప్తంగా జనం అల్లాడారు. కానీ ఆ వ్యాపారులకు అలాంటి నిబంధనలు, పరిమితులు అడ్డురాలేదు. బ్యాంకు అధికారుల సహకారంతో ఒకేరోజు ఏకంగా రూ. 2.49 కోట్లు విత్‌డ్రా చేసుకున్నారు. ఈ ఉదంతం పశ్చిమగోదావరి జిల్లా తణుకు స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) శాఖలో చోటు చేసుకుంది. కొందరు వ్యాపారులతో బ్యాంకు అధికారులు కుమ్మకై నిబంధనలకు విరుద్ధంగా విత్ర్‌డాకు సహకరించారు. ఈ వ్యవహారాన్ని సీబీఐ పసిగట్టింది. తప్పుచేసిన ఐదుగురు బ్యాంకు అధికారులతోపాటు 8 మంది వ్యాపారులపై కేసు నమోదు చేసింది. వివరాల్ని సీబీఐ ఎస్పీ ఆర్.గోపాలకృష్ణ బుధవారం వెల్లడించారు. కేంద్రం రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేశాక నగదు ఉపసంహరణపై కొన్ని పరిమితులు విధించడం తెలిసిందే. అయితే తణుకు ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ ఏజీఎం కె.వి.కృష్ణారావు, అసిస్టెంట్ మేనేజర్ ఎస్.బాలాజీ, డిప్యూటీ మేనేజర్లు జి.ఇజ్రాయిల్‌రాజు, ఎల్.వి.నవీన్, రామచంద్రరాజులు ఈ నిబంధనలను తుంగలో తొక్కారు. డబ్బు ఆశతో అడ్డదారి తొక్కారు. శ్రీ రామకృష్ణ రా అండ్ పార్బాయిల్డ్ రైస్‌మిల్, పట్టాభి ఆగ్రో ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, విజయశ్రీ ఫుడ్స్, గౌతమ్ కన్స్ట్రక్షన్స్, మహేశ్వరి కోకోనట్ కంపెనీ, రవళి స్పెన్సర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇండియన్ హెయిర్ లిమిటెడ్, హేమాద్రి రైస్‌మిల్, నిషి ఎగ్ పౌల్ట్రీ ప్రొడక్ట్ ప్రైవేట్ లిమిటెడ్‌లకు చెందిన రూ.2.49 కోట్ల ధనాన్ని ఒక్కరోజులో విత్‌డ్రా చేయించారు. విషయం సీబీఐకి చేరడంతో ప్రాథమిక విచారణ జరిపి నిర్ధారించుకున్నారు. అనంతరం మొత్తం 14 మందిపై కేసు నమోదు చేశారు. నిందితుల నివాసాల్లో సోదాలు నిర్వహించి పలు డాక్యుమెంట్లు, రూ.2.11 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. వీరేగాక మరికొందరు ప్రభుత్వాధికారులూ నిబంధనలకు విరుద్ధంగా ఇదే బ్రాంచ్‌లో నగదు ఉపసంహరణ చేసుకున్నట్లు సీబీఐ గుర్తించింది. ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ లోతుగా విచారణ జరుపుతోంది.