న్యూఢిల్లీ: ప్రముఖ ఆంగ్ల టీవీ ఛానల్ ‘ఎన్‌డీ టీవీ’పై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) బుధవారం కొరడా ఝుళిపించింది. ఎన్‌డీ టీవీ ప్రమోటర్లు ప్రణయ్ రాయ్, రాధికారాయ్‌తో పాటు సీఈవో సీఈఓ విక్రమాదిత్య చంద్ర, గుర్తుతెలియని ప్రభుత్వాధికారులపై నేరపూరిత కుట్ర, మోసం, అవినీతి తదిరత సెక్షన్ల కింద కేసు నమోదుచేసింది. 2007–09 మధ్యకాలంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) సేకరణ సందర్భంగా ఈ కంపెనీ ఎఫ్‌ఐడీ నిబంధనల్ని ఉల్లంఘించిందని సీబీఐ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది. రూ.కోట్ల పన్నులను ఎగ్గొట్టి నగదును భారత్‌లోకి అక్రమంగా తీసుకొచ్చేందుకు సంక్లిష్టమైన ఆర్థిక వ్యవహారాలు నడిపారు’ సీబీఐ తెలిపింది. కాగా, ఈ ఆరోపణలను ఎన్‌డీ టీవీ యాజమాన్యం ఖండించింది. భారత న్యాయవ్యవస్థపై తమకు పూర్తి నమ్మకముందనీ, జర్నలిజం విలువలకు తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment