సోహ్రబుద్దీన్
ముంబై: సోహ్రబుద్దీన్ నకిలీ ఎన్‌కౌంటర్ కేసులో 14 మంది పోలీస్ అధికారులను నిర్దోషులుగా విడుదల చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై బాంబే హైకోర్టు సోమవారం తీర్పును వెలువరించే అవకాశముంది. గ్యాంగ్‌స్టర్ సోహ్రబుద్దీన్, అతని భార్య కౌసర్‌బీ, అనుచరుడు తులసీ ప్రజాపతిని గుజరాత్, రాజస్తాన్ పోలీసులు 2005–06 మధ్యకాలంలో ఎన్‌కౌంటర్ల పేరుతో కాల్చిచంపినట్లు సీబీఐ గతంలో కేసు నమోదుచేసింది. ఈ కేసును విచారించే ప్రత్యేక కోర్టును 2013లో సుప్రీంకోర్టు ముంబైకి మార్చింది. నిందితుల్లో 15 మందిని కోర్టు నిర్దోషులుగా విడుదల చేసింది. దిగువ కోర్టు నిర్ణయాన్ని సవాలుచేస్తూ సోహ్రబుద్దీన్ సోదరుడు, సీబీఐ బాంబే హైకోర్టులో పిటిషన్లను దాఖలు చేశాయి. వాటిపై నేడు తీర్పు వెలువడే అవకాశముంది.
Comments
Please login to add a commentAdd a comment