judgment day
-
సోహ్రబుద్దీన్ ఎన్కౌంటర్ కేసు తీర్పు నేడే!
ముంబై: సోహ్రబుద్దీన్ నకిలీ ఎన్కౌంటర్ కేసులో 14 మంది పోలీస్ అధికారులను నిర్దోషులుగా విడుదల చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై బాంబే హైకోర్టు సోమవారం తీర్పును వెలువరించే అవకాశముంది. గ్యాంగ్‌స్టర్ సోహ్రబుద్దీన్, అతని భార్య కౌసర్బీ, అనుచరుడు తులసీ ప్రజాపతిని గుజరాత్, రాజస్తాన్ పోలీసులు 2005–06 మధ్యకాలంలో ఎన్కౌంటర్ల పేరుతో కాల్చిచంపినట్లు సీబీఐ గతంలో కేసు నమోదుచేసింది. ఈ కేసును విచారించే ప్రత్యేక కోర్టును 2013లో సుప్రీంకోర్టు ముంబైకి మార్చింది. నిందితుల్లో 15 మందిని కోర్టు నిర్దోషులుగా విడుదల చేసింది. దిగువ కోర్టు నిర్ణయాన్ని సవాలుచేస్తూ సోహ్రబుద్దీన్ సోదరుడు, సీబీఐ బాంబే హైకోర్టులో పిటిషన్లను దాఖలు చేశాయి. వాటిపై నేడు తీర్పు వెలువడే అవకాశముంది. -
నాగవైష్ణవి హత్య కేసు నిందితులకు జీవిత ఖైదు
-
నాగవైష్ణవి హత్య కేసులో వెలువడిన తీర్పు
సాక్షి, విజయవాడ : ఎనిమిదేళ్ల క్రితం 2010లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన నాగవైష్ణవి హత్య కేసులో గురువారం తీర్పు వెలువడింది. ఎనిమిదేళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం విజయవాడ మహిళా సెషన్స్ జడ్జి ఈ కేసులో తుది తీర్పు ప్రకటించారు. గురువారం నిందితులకు శిక్ష ఖరారు చేసే ముందు ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి, ముగ్గురు నిందితులకు జీవిత ఖైదు శిక్షను ఖరారు చేస్తూ తీర్పునిచ్చారు. 79 మందిని విచారించిన న్యాయస్థానం, వెంటకరావు గౌడ్‌ను ప్రధాన దోషిగా నిర్ధారిస్తూ తుది తీర్పును వెలువరించింది. భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు పాల్పడే వారికి కఠిన చర్యలు తప్పవు అనిపించేలా ఈ తీర్పు ఉందని ప్రజలు భావిస్తున్నారు. వైష్ణవి హత్య నేపథ్యం : విజయవాడకు చెందిన బీసీ నాయకుడు పలగాని ప్రభాకర్ కుమార్తె నాగవైష్ణవి 2010 జనవరి 30న కారులో పాఠశాలకు వెళుతుండగా దుండగులు అడ్డగించి డ్రైవరును హతమార్చి వైష్ణవిని కిడ్నాప్ చేశారు. రెండు రోజుల పాటు తీవ్ర గాలింపుల అనంతరం, గుంటూరు శివార్లలోని ఆటోనగర్‌లోని ప్లాట్ నెంబరు 445లో చిన్నారి శవం లభ్యమైంది. అభం శుభం తెలియని చిన్నారిని వేధింపులకు గురిచేసి, అనంతరం బాయిలర్‌లో వేసి బాలికను కాల్చి చంపినట్లులో పోలీసులు గుర్తించారు. ప్రభాకర్‌పై కోపంతో ఆయన మొదటి భార్య వెంకటేశ్వర్వమ్మ తమ్ముడు పంది వెంకట్రావు ఈ హత్యకు కట్ర పన్నిట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ కేసులో ఏ1 నిందితుడిగా మెర్ల శ్రీనివాసరావు, ఏ2గా వెంపరాల జగదీష్, ఏ3గా పంది వెంకట్రావు అలియాస్ కృష్ణ ఏడేళ్లుగా జైలులో రిమాండ్‌లోనే ఉన్నారు. నిందితులకు బెయిల్ మంజూరు చేయకుండానే కేసు విచారణ పూర్తి చేశారు. వారిపై ఐపీసీ 302, 367, 420, 201, 120బి సెక్షన్ల కింద కేసు నమోదు చేసి చార్జిషీట్ దాఖలు చేశారు. వైష్ణవి హత్య వార్త తెలియడంతో బాలిక కుటుంబం షాక్‌కు గురైంది. తన గారాలపట్టి హత్యకు గురైందన్న విషయం తెలసుకొని ప్రభాకర్ పుత్రికా శోకంతో కన్నుమూశారు. దాంతో ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. ఆస్తి కోసం సొంతవారే చిన్నారిని దారుణంగా హతమార్చడంపై ప్రజాసంఘాలు నిరసనకు దిగాయి. నిందితలను కఠింగా శిక్షించాలంటూ ఆందోళనలు చేశారు. -
మరో రికార్డుకోసం 3డీలో వస్తోంది
లాస్ ఎంజెల్స్: గతంలో రికార్డులు సృష్టించిన ప్రముఖ హాలీవుడ్ హీరో ఆర్నాల్డ్ నటించిన టెర్మినేటర్ 2:ది జడ్జిమెంట్ డే మరోసారి విడుదల కానుంది. ఈసారి పూర్తిగా 3డీ ఫార్మాట్లో వచ్చే ఏడాది థియేటర్లలో ప్రపంచ వ్యాప్తంగా సందడి చేయనుంది. దీనికి సంబంధించి కొత్తగా డిజైన్ చేసిన ఓ పోస్టర్‌ను ఆ చిత్ర ప్రచార ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేశారు. జేమ్స్ కామెరూన్ రూపొందించిన ఈ చిత్రాన్ని గత కొన్నేళ్లుగా త్రీడీ ఫార్మాట్లోకి మార్చాలని చేసిన ఆలోచనలో భాగంగా ఆ పని పూర్తి చేస్తున్నారట. 2017లో మరోసారి ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. 1984లో తొలిసారి టెర్మినేటర్ చిత్రం విడుదలై హాలీవుడ్లో సంచలనం సృష్టించింది. అనంతరం 1991లో ఆగస్టు 24న విడుదలైన టెర్మినేటర్ 2: ది జడ్జిమెంట్ డే సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు దక్కించుకోవడమే కాకుండా భారీ వసూళ్లు రాబట్టింది. అప్పట్లోనే 100 మిలియన్ డాలర్లతో నిర్మించిన ఈ చిత్రం బాక్సాపీస్ వద్ద 519.8మిలియన్ డాలర్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. -
మరికొన్ని గంటల్లో తీర్పు
-
మరికొన్ని గంటల్లో తీర్పు
నేడే జయ కేసు తీర్పు మంత్రులకు ఆంక్షలు నిఘా నీడలో బెంగళూరు రాష్ట్రంలోనూ అలర్ట్ మరికొన్ని గంటల్లో ఎలాంటి తీర్పు వెలువడుతుందోనన్న ఉత్కంఠ రాష్ట్ర వ్యాప్తంగా నెలకొంది. తమ అమ్మ జయలలితకు అనుకూలంగా తీర్పు ఉండాలని దేవుళ్లను మొక్కే పనిలో అన్నాడీఎంకే వర్గాలు నిమగ్నం అయ్యారు.జయలలిత అండ్ బృందం తరపు న్యాయవాదులతో పాటుగా పార్టీ వర్గాలు బెంగళూరుకు పయనం అవుతుంటే, మంత్రులకు మాత్రం ఆంక్షలు జారీ అయ్యాయి. సాక్షి, చెన్నై : అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత అండ్ బృందానికి ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైలు శిక్ష పడ్డ విషయం తెలిసిందే. ఈ శిక్షను సవాల్ చేస్తూ చేసుకున్న అప్పీలుపై మరికొన్ని గంటల్లో తీర్పు వెలువడనున్నది. దీంతో తీవ్ర ఉత్కంఠ రాష్ట్రంలో నెలకొంది. తమ అమ్మ జయలలితకు అనుకూలంగా తీర్పు ఉండాలని, ఆమె నిర్ధోషిత్వం ఈ తీర్పుతో నిరూపితం అవుతుందన్న ఆకాంక్షలతో అన్నాడీఎంకే వర్గాలు మునిగాయి. ఆలయాల్లో ఆదివారం మధ్యాహ్నం నుంచే పూజలు ఆరంభం అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆలయాల్లో అన్నాడీఎంకే వర్గాల నేతృత్వంలో అభిషేకాలు, హోమాది పూజలు, పాలబిందెలతో ఊరేగింపులు జరుగుతున్నాయి. తీర్పు ఎటో: ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పుతో జయలలిత రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంలో పడి ఉన్నది. అయితే, ఆ తీర్పును తిరగరాసే రీతిలో మరో తీర్పు వెలువడేనా అన్న ఉత్కంఠ భరిత వాతావరణం రాష్ట్రంలో నెలకొని ఉంది. జయలలిత నిర్ధోషిగా బయటకు వస్తారని కొన్ని చోట్ల , శిక్ష తగ్గే అవకాశాలు ఉన్నాయని మరి కొన్ని చోట్ల చర్చలు అప్పుడే ఆరంభం అయ్యాయి. మరో ఆరేడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికల కసరత్తులు ఆరంభం అవుతోన్న వేళ, మరికొన్ని గంటల్లో వెలువడే తీర్పు ఎలాంటి రాజకీయ మార్పులకు వేదికగా అవుతుందోనన్న చర్చ సైతం బయలు దేరి ఉండడం గమనార్హం. తమ అమ్మకు అనుకూలంగా తీర్పు వ స్తుందన్న ఆశాభావంతో బెంగళూరుకు పయనం అయ్యే నాయకులు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. జయలలిత అండ్ బృందం తరపున న్యాయవాదులు ఇప్పటికే బెంగళూరుకు చేరుకుని ఉన్నారు. ఇక, పార్టీ వర్గాలు ఆ దిశగా పరుగులు తీస్తున్నాయి. మంత్రులకు ఆంక్ష: పార్టీ వర్గాలు బెంగళూరుకు ఉరకలు తీస్తుంటే, రాష్ట్ర మంత్రులకు మాత్రం ఆంక్షలు వెలువడి ఉన్నాయి. తీర్పు ఎలా ఉంటుందో అంతు చిక్కని దృష్ట్యా, ఏలాంటి పరిణామాలు ఎదురైనా ఎదుర్కొనే రీతిలో అన్నాడీఎంకే వర్గాలు సిద్ధం అవుతున్నాయి. తీర్పు అనుకూలంగా ఉంటే సంబరాలకు, ప్రతి కూలంగా ఉంటే గతంలో వలే ఏదేని విధ్వంసాలకు దిగే అవకాశాలు కన్పిస్తుండడంతో ముందు జాగ్రత్తగా రాష్ట్ర పోలీసు యంత్రాంగం సైతం అప్రమత్తమైంది. ఇక, రాష్ట్ర మంత్రులెవ్వర్నీ బెంగళూరుకు వెళ్ల వద్దని జయలలిత ఆదేశించినట్టు సమాచారం. దీంతో ఓ వైపు మంత్రుల నేతృత్వంలో పూజలు ఆరంభం అయ్యాయి. ఏదేని ప్రతికూల పరిస్థితులు ఎదురైన పక్షంలో పార్టీ వర్గాల్ని గాడిలో పెట్టె విధంగా మంత్రులందర్నీ వారి వారి జిల్లాల్లోనే ఉండే రీతిలో ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. దీంతో మంత్రులు తమ తమ ప్రాంతాల్లో తిష్ట వేసి, పరిస్థితిని సమీక్షించడంతో పాటుగా తీర్పు వెలువడే వరకు దేవుళ్లను వేడుకునే పనిలో నిమగ్నం అవుతున్నారు. సరిగ్గా 11 గంటలకు న్యాయమూర్తి కోర్టుకు హాజరైనా తీర్పు వెలువడేందుకు కొన్ని గంటలు పట్టే అవకాశాలు ఉన్నాయి. దీంతో అంత వరకు అన్నాడీఎంకే వర్గాలకే కాదు, రాష్ట్రంలో ప్రతి పక్షాలకు సైతం ఉత్కంఠ తప్పదేమో. ఇక, అన్నాడీఎంకే వర్గాలు పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశాలు కన్పిస్తుండడంతో బెంగళూరులోని కోర్టు పరిసరాల్లో గట్టి భద్రతా ఏర్పాట్లు చేసి ఉన్నారు. బాణ సంచాలు పేల్చేందుకు నిషేధం విధించడంతో పాటుగా కర్ణాటక సరిహద్దుల్లో చెక్ పోస్టుల్ని ఏర్పాటు చేసి వాహనాల్ని తనిఖీలు చేస్తున్నారు. -
జడ్జిమెంట్ డే
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఓటర్లు ఎవరికి పట్టం కట్టారు? తమ ఎమ్మెల్యే, ఎంపీలుగా ఎవరిని ఎన్నుకున్నారు? పోటీపడ్డ అభ్యర్థుల్లో విజయం ఎవరిని వరించింది? అదృష్టవంతులెవరు, పరాజితులెవరు? జిల్లాలో ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుంది? ఈ రోజే తేలిపోతుంది. పదిహేను రోజులు ఉత్కంఠ రేపిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు కొద్ది గంటల్లోనే వెలువడనున్నాయి? ఓటర్ల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉండటంతో శరవేగంగా మధ్యాహ్నం రెండు గంటలకల్లా పూర్తి ఫలితాలు వెలువడే అవకాశముంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సమయంలో జరిగిన ఎన్నికలు కావటంతో ఈ ఫలితాలు ప్రత్యేకతను సంతరించుకున్నాయి. వీటికి తోడుగా కొత్త రాష్ట్రంలో, కేంద్రంలో పరిపాలనా పగ్గాలు చేపట్టేదెవరనే తీర్పును చాటిచెప్పనుండటంతో దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాలు, 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో హోరాహోరీగా ఎన్నికల పోరు సాగింది. మొత్తం 202 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. రెండు లోక్‌సభ స్థానాలకు 34 మంది, 13 అసెంబ్లీ నియోజకవర్గాలకు 168 మంది పోటీ పడ్డారు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, టీఆర్ఎస్ అన్ని స్థానాల్లో పోటీ పడ్డాయి. మిత్రపక్షాలుగా పొత్తు కూడిన బీజేపీ, టీడీపీ చెరో ఆరు స్థానాల్లో బరిలో నిలిచాయి. తొలిసారిగా వైఎస్సార్సీపీ పదకొండు అసెంబ్లీ స్థానాల్లో తలపడింది. స్వతంత్య్ర అభ్యర్థులు సైతం కొన్నిచోట్ల హడలెత్తించారు. జిల్లాలోనే అత్యధికంగా రామగుండం నియోజకవర్గంలో 27 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. అత్యల్పంగా మంథని, హుజూరాబాద్‌లో తొమ్మిది మంది చొప్పున బరిలో ఉన్నారు. ఎంపీలు పొన్నం ప్రభాకర్, వివేక్, మాజీ మంత్రి శ్రీధర్‌బాబుతో పాటు జిల్లాలోని సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆరెపల్లి మోహన్, ప్రవీణ్‌రెడ్డి, గంగుల కమలాకర్, ఈటెల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, కేటీఆర్, కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, చెన్నమనేని రమేశ్‌బాబు, సోమారపు సత్యనారాయణ, ఎల్.రమణ, సిహెచ్.విజయరమణరావు, సుద్దాల దేవయ్య ఈ ఎన్నికల్లో తమ భవితవ్యాన్ని పరీక్షించుకుంటున్నారు. వీరిలో మరోసారి చట్టసభల్లో అడుగు పెట్టే అవకాశం ఎవరెవరికి దక్కుతుందనేది ఉత్కంఠ రేపుతోంది. వీరితో పాటు మాజీ ఎంపీ బి.వినోద్‌కుమార్, కేంద్ర మాజీ మంత్రి సీహెచ్.విద్యాసాగర్‌రావు, మాజీ మంత్రి టి.జీవన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కొమ్‌రెడ్డి రామ్‌లు, బొమ్మ వెంకటేశ్వర్లు, కేడీసీసీబీ అధ్యక్షుడు కొండూరి రవీందర్రావు, మాజీ మంత్రులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, జువ్వాడి రత్నాకర్‌రావు, చెల్మెడ ఆనందరావు, ముద్దసాని దామోదర్‌రెడ్డి తనయులు సతీష్‌బాబు, నర్సింగరావు, లక్ష్మీకాంతరావు, కశ్యప్‌రెడ్డి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. గత ఎన్నికల్లో త్రుటిలో విజయం చేజార్చుకున్న ఆది శ్రీనివాస్, పుట్ట మధు, కోరుకంటి చందర్, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ఈసారైనా జెండా ఎగరేస్తారా? అనేది ఆసక్తి రేపుతోంది. వీరితో పాటు ప్రధాన పార్టీల తరఫున తొలిసారి పోటీకి దిగిన అభ్యర్థుల్లో అసెంబ్లీ, పార్లమెంటులో అడుగుపెట్టేదెవరనే ఉత్కంఠకు కాసేపట్లో తెరపడనుంది. -
నిర్భయ కేసులో నేడు తుది తీర్పు
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ సామూహిక అత్యాచార ఘటన 'నిర్భయ' కేసుకు సంబంధించిన తీర్పు మంగళవారం ఢిల్లీ కోర్టు వెల్లడించనుంది. 2012 లో డిసెంబర్ 16 తేదిన జరిగిన గ్యాంగ్ రేప్ పార్లమెంట్ ను కుదిపేసిన సంగతి తెలిసిందే. సుమారు తొమ్మిది నెలల క్రితం 23 ఏళ్ల ఫిజియోథెరపిస్ట్ కదులుతున్న బస్ లో గ్యాంగ్ రేప్ కు గురైన సంఘటన దేశ ప్రజలను కలిచివేసింది. దక్షిణ ఢిల్లిలో మునిర్కా ప్రాంతోలో తన స్నేహితుడితో కలిసి బస్ లో ప్రయాణిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితురాలి పరిస్థితి విషమించడంతో ఆమెను సింగపూర్ లోని మౌంట్ ఎలిజబెత్ ఆస్పత్రికి తరలించారు. అయితే నిర్భయ డిసెంబర్ 29 తేదిన తుది శ్వాస విడిచింది. దాంతో దేశ ప్రజలందరూ విషాదం మునిగారు. ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితులకు మరణ శిక్ష విధించాలని దేశంలోని అత్యధిక ప్రజల నుంచి డిమాండ్ వచ్చింది. నిర్భయ కేసులో 2013 జనవరి 3 తేదిన చార్జిషీట్ దాఖలు కాగా, విచారణ ఫిబ్రవరి 5 తేదిన ప్రారంభించారు. ఈ కేసులో ప్రాసిక్యూషన్ 85 మంది సాక్షులను, డిఫెన్స్ 17 మందిని విచారించారు. ఈ కేసులో మరో ముద్దాయి రాంసింగ్ తీహార్ జైల్లో ఉరి వేసుకుని మరణించడంతో కేసు నుంచి తప్పించారు. అయితే మిగిలిన ముద్దాయిలు ముకేశ్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, అక్షయ్ ఠాకూర్ ల భవితవ్యాన్ని ఢిల్లీ కోర్టు ఆడిషినల్ సెషన్ జడ్జి యోగేశ్ ఖన్నా మంగళవారం తేల్చనున్నారు. ఈ కేసులో నిందితులపై గ్యాంగ్ రేప్, హత్య, హత్యాప్రయత్నం, సాక్షాలను మాయం చేయడం, దోపిడితోపాటు ఇతర నేరాలను నలుగురు నిందితులపై మోపారు. ఈ కేసులో సాక్ష్యాలు రుజువైతే వీరికి మరణ శిక్ష పడే అవకాశం ఉంది. ఈ కేసులో మైనర్ గా ఉన్న నిందితుడిని ఆగస్గు 31 తేదిన జువెనైల్ జస్టిస్ బోర్డు కు పంపారు. అయితే మైనర్ బాలుడికి విధించిన శిక్షపై బాధిత కుటుంబం ఆందోళన, నిరసనను వ్యక్తం చేశారు. మైనర్ నిందితుడిని కూడా కఠినంగా శిక్షించాలని నిర్భయ కుటుంబం డిమాండ్ చేసింది.