మరో రికార్డుకోసం 3డీలో వస్తోంది | 'Terminator 2: Judgment Day' to release in 3D next year | Sakshi
Sakshi News home page

మరో రికార్డుకోసం 3డీలో వస్తోంది

Published Thu, Sep 1 2016 10:24 AM | Last Updated on Mon, Sep 4 2017 11:52 AM

మరో రికార్డుకోసం 3డీలో వస్తోంది

మరో రికార్డుకోసం 3డీలో వస్తోంది

లాస్ ఎంజెల్స్: గతంలో రికార్డులు సృష్టించిన ప్రముఖ హాలీవుడ్ హీరో ఆర్నాల్డ్ నటించిన టెర్మినేటర్ 2:ది జడ్జిమెంట్ డే మరోసారి విడుదల కానుంది. ఈసారి పూర్తిగా 3డీ ఫార్మాట్లో వచ్చే ఏడాది థియేటర్లలో ప్రపంచ వ్యాప్తంగా సందడి చేయనుంది. దీనికి సంబంధించి కొత్తగా డిజైన్ చేసిన ఓ పోస్టర్ను ఆ చిత్ర ప్రచార ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేశారు.

జేమ్స్ కామెరూన్ రూపొందించిన ఈ చిత్రాన్ని గత కొన్నేళ్లుగా త్రీడీ ఫార్మాట్లోకి మార్చాలని చేసిన ఆలోచనలో భాగంగా ఆ పని పూర్తి చేస్తున్నారట. 2017లో మరోసారి ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. 1984లో తొలిసారి టెర్మినేటర్ చిత్రం విడుదలై హాలీవుడ్లో సంచలనం సృష్టించింది. అనంతరం 1991లో ఆగస్టు 24న విడుదలైన టెర్మినేటర్ 2: ది జడ్జిమెంట్ డే సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు దక్కించుకోవడమే కాకుండా భారీ వసూళ్లు రాబట్టింది. అప్పట్లోనే 100 మిలియన్ డాలర్లతో నిర్మించిన ఈ చిత్రం బాక్సాపీస్ వద్ద 519.8మిలియన్ డాలర్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది.

  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement