Sohrabuddin Encounter
-
అవి ఎన్కౌంటర్ ఆదేశాలే!
సాక్షి, న్యూఢిల్లీ : ‘వారిని నిర్దాక్షిణ్యంగా కాల్చేయండి, ఏం ఫర్వాలేదు!’ అని కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్డీ కుమార స్వామి మంగళవారం నాడు ఓ సీనియర్ పోలీసు ఆఫీసర్‌ను ఫోన్లో ఆదేశించడం వైరల్ అవడంతో తాను ఓ ముఖ్యమంత్రిగా కాకుండా ఓ సామాన్య పౌరుడిగా ఉద్వేగంతో చేసిన వ్యాఖ్యలంటూ సమర్థించుకునేందుకు ప్రయత్నించారు. జేడీఎస్ నాయకుడు ప్రకాష్‌ను ప్రత్యర్థులు చంపడం పట్ల కుమార స్వామి స్పందించిన తీరిది. నోరు జరాననో, ఉద్వేగంతో మాట్లాడానంటూ సర్దు కోవడానికి ప్రయత్నిస్తే సమసిపోయే విషయం కాదది. అధికారంలో ఉన్న వ్యక్తులు రాజకీయ ప్రతీకారాలకు బూటకపు ఎన్కౌంటర్లకు అలవాటైన రోజులివి. హతుడు ప్రకాష్ పార్టీకి విదేయుడని కుమార స్వామి చెబుతున్నారుగానీ, ఆయన పార్టీకంటే ఎక్కువగా కుమార స్వామి విధేయుడు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కుమార స్వామి విజయం కోసమే ఎక్కువగా పార్టీలో ప్రచారం చేశారు. అంతటి వ్యక్తి చనిపోతే అంతగా ఆవేశం రావడం నిజమేగానీ, ‘వారిని నిర్దాక్షిణ్యంగా కాల్చేయండి, ఏం ఫర్వాలేదు’ అంటూ ప్రత్యేక అధికారాలిచ్చే అవకాశం కూడా పూర్తిగా ఉంది. కుమారస్వామి ఆదేశించిందీ లేదా వ్యాఖ్యానించిందీ పార్టీ నాయకులనో, కార్యకర్తలనుద్దేశించో కాదు, సాక్షాత్తు సీనియర్ పోలీసు అధికారిని ఉద్దేశించింది. దేశంలో 2005లో గుజరాత్లో జరిగిన ‘సొహ్రాబుద్దీన్ ఎన్కౌంటర్’ కేసు నుంచి బూటకపు ఎన్కౌంటర్లకు అధికారిక ఆమోద ముద్ర లభించినట్లు ఉంది. భోపాల్ కారాగారం నుంచి పారిపోయారన్న కారణంగా 2016, అక్టోబర్ నెలలో ఎనిమిది మంది సిమీ కార్యకర్తలను పోలీసులు కాల్చి చంపారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోరాదంటూ పౌరులకు నీతులు చెప్పే ప్రభుత్వాలకే చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం అలవాటయింది. చట్టం అంటే అరెస్ట్ చేయడం, ఆ తర్వాత విచారించడం, అందుకు సరైన ఆధారాలు చూపించడమే కాకుండా నిందితులకు తమను తాము సమర్థించుకునే హక్కు కూడా ఉండడం. ఈ ప్రక్రియ సుదీర్ఘకాలం పడుతుంది కనుక ప్రభుత్వాలు కూడా దొడ్డిదారి ఎన్కౌంటర్లకు పాల్పడుతున్నాయి. -
‘ఎవరూ చంపలేదు.. వాళ్లే చనిపోయారు’
సాక్షి, న్యూఢిల్లీ: పదమూడేళ్లనాటి సొహ్రాబుద్దీన్ ఎన్కౌంటర్ కేసు నిందితులందరూ నిర్దోషులేనని స్పెషల్ సీబీఐ కోర్టు తీర్పు వెలువరించడంపై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యంగ్యంగా స్పందించారు. సొహ్రాబుద్దీన్, అతడి ఎన్కౌంటర్ కేసుతో సంబంధమున్న వారిని ఎవరూ చంపలేదని వారే చనిపోయారని ట్విటర్లో వ్యాఖ్యానించారు. ‘ఎవరూ చంపబడలేదు. హరేన్ పాండ్యా, తులసీరామ్ ప్రజాపతి, జస్టిస్ లోయా, ప్రకాశ్ తొంబ్రే, శ్రీకాంత్ ఖండాల్కర్, కౌసర్ బీ, సోహ్రాబుద్దీన్ షేక్.. వారికి వారే చనిపోయార’ని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. (నిందితులంతా నిర్దోషులే) సొహ్రాబుద్దీన్ ఎన్కౌంటర్ కేసులో 21మంది పోలీసు అధికారులు సహా మొత్తం 22 మందీ నిర్దోషులేనని ప్రత్యేక సీబీఐ న్యాయస్థానం శుక్రవారం సంచలన తీర్పు వెలువరించింది. ఎన్నో మలుపులు తిరిగిన ఈ కేసులో మొత్తం 210 మంది సాక్షులను విచారించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను 2010లో అరెస్ట్ చేశారు. 2014 డిసెంబర్లో ఈ కేసు నుంచి ఆయన బయటపడ్డారు. ఈ కేసును విచారించిన సీబీఐ కోర్టు జడ్జి బీహెచ్ లోయా మూడేళ్ల క్రితం అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడం పలు అనుమానాలకు తావిచ్చింది. NO ONE KILLED... Haren Pandya. Tulsiram Prajapati. Justice Loya. Prakash Thombre. Shrikant Khandalkar. Kauser Bi. Sohrabuddin Shiekh. THEY JUST DIED. — Rahul Gandhi (@RahulGandhi) 22 December 2018 -
నిందితులంతా నిర్దోషులే
ముంబై: పదమూడేళ్లనాటి సొహ్రాబుద్దీన్ ఎన్కౌంటర్ కేసు మరో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో 21మంది పోలీసు అధికారులు సహా మొత్తం 22 మందీ నిర్దోషులేనని స్పెషల్ సీబీఐ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. సొహ్రాబుద్దీన్, అతని భార్య కౌసర్ బీ, అనుచరుడు తులసీ ప్రజాపతిల మృతిలో కుట్ర కోణం, ఆ ముగ్గురి మృతితో నిందితులకు ప్రమేయం ఉందన్న ఆరోపణలపై ప్రాసిక్యూషన్ సరైన సాక్ష్యాధారాలను చూపలేకపోయిందంటూ స్పెషల్ సీబీఐ కోర్టు జడ్జి ఎస్జే శర్మ తీర్పుచెప్పారు. ‘22 మంది నిందితులపై కుట్ర ఆరోపణలను సమర్ధనగా సీబీఐ ఎలాంటి ఆధారాలను చూపలేకపోయింది. దీంతో నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటిస్తున్నాం’ అని తీర్పుచెప్పారు. సొహ్రాబుద్దీన్ షేక్‌కు లష్కరే తోయిబా వంటి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయని, అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రధాని మోదీని హత్య చేసేందుకు కుట్ర పన్నాడనేది పోలీసుల ఆరోపణ. అప్పటి డీజీపీ వంజారా ఆదేశాల మేరకే మరో అధికారి పీసీ పాండే ఎన్కౌంటర్లో ప్రజాపతిని చంపారని సీబీఐ ఆరోపించింది. అయితే, ఇందుకు ఫోన్‌కాల్స్ వంటి ఎలాంటి ఆధారాలను చూపకపోవడంతో న్యాయస్థానం ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. సీబీఐ కోర్టు తీర్పుపై సొహ్రాబుద్దీన్ సోదరుడు రుబాబుద్దీన్ స్పందించారు. ఈ తీర్పు విచారకరమనీ, దీనిని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. గ్యాంగ్‌స్టర్ సొహ్రాబుద్దీన్, అతని భార్య కౌసర్ బీ, అనుచరుడు తులసీ ప్రజాపతితో కలిసి హైదరాబాద్ నుంచి మహారాష్ట్రలోని సాంగ్లీకి బస్సులో వస్తుండగా 2005 నవంబర్ 22వ తేదీ రాత్రి పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అదే ఏడాది నవంబర్ 26వ తేదీన సొహ్రాబుద్దీన్, మరో మూడు రోజుల తర్వాత కౌసర్ బీ హత్యకు గురయ్యారు. వీరిని గుజరాత్, రాజస్తాన్ పోలీసు బృందమే హత్య చేసిందని సీబీఐ ఆరోపించింది. ప్రజాపతిని ఉదయ్‌పూర్ సెంట్రల్ జైలులో ఉంచిన పోలీసులు 2006 డిసెంబర్ 27వ తేదీన గుజరాత్–రాజస్తాన్ సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్లో చంపేశారని సీబీఐ పేర్కొంది. ఈ కేసులోని 22 మంది నిందితుల్లో 21 మంది గుజరాత్, రాజస్తాన్ రాష్ట్రాలకు చెందిన దిగువ స్థాయి పోలీసు అధికారులు కాగా 22వ వ్యక్తి గుజరాత్లో సొహ్రాబుద్దీన్ దంపతులు హత్యకు ముందు బస చేసిన ఫాంహౌస్ యజమాని. గుజరాత్ సీఐడీ నుంచి కేసు దర్యాప్తు బాధ్యతలను చేపట్టిన సీబీఐ.. అప్పటి గుజరాత్ హోం మంత్రి, ప్రస్తుతం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, అప్పటి రాజస్తాన్ హోం మంత్రి గులాబ్‌చంద్ కటారియా, ఐపీసీ అధికారులు వంజారా, పీసీ పాండే సహా 38మందిపై ఆరోపణలు మోపింది. మొత్తం 210 మంది సాక్షులను విచారించగా అందులో 92 మంది వ్యతిరేకంగా మాట్లాడారు. విచారణ నిష్పాక్షికంగా సాగేందుకు ఈ కేసును గుజరాత్ నుంచి మహారాష్ట్రకు బదిలీ చేయాలన్న సీబీఐ పిటిషన్‌కు అనుకూలంగా 2013లో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసును విచారిస్తున్న సీబీఐ కోర్టు జడ్జి బీహెచ్ లోయా మూడేళ్ల క్రితం మృతి చెందడం కూడా వివాదాస్పదమైన విషయం తెలిసిందే. కేసు విచారణ సాగిందిలా.. నవంబర్ 22, 2005: గ్యాంగ్‌స్టర్ సొహ్రాబుద్దీన్ షేక్, ఆయన భార్య కౌసర్ బీ, అనుచరుడు తులసి ప్రజాపతి హైదరాబాద్ నుంచి సాంగ్లికి బస్సులో వస్తుండగా పోలీసులు అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. షేక్ దంపతులను ఒక వాహనంలో, ప్రజాపతిని మరో వాహనంలో తీసుకెళ్లారు. నవంబర్ 22 నుంచి 25 2005: అహ్మదాబాద్ సమీపంలోని ఒక ఫాం హౌస్‌లో సొహ్రాబుద్దీన్, కౌసర్ బీలను ఉంచారు. ప్రజాపతిని ఉదయ్‌పూర్ సెంట్రల్ జైలుకు తరలించారు నవంబర్ 26, 2005: గుజరాత్, రాజస్థాన్ పోలీసులు కలిసి జరిపిన ఎన్కౌంటర్లో సొహ్రాబుద్దీన్ మరణించాడు. అది నకిలీ ఎన్కౌంటర్ అన్న ఆరోపణలు వెల్లువెత్తాయి నవంబర్ 29, 2005: కౌసర్ శరీరమంతా కాలిన గాయాలతో శవమై కనిపించింది. డిసెంబర్ 27, 2006: రాజస్థాన్, గుజరాత్ పోలీసు బృందం ఉదయ్‌పూర్ సెంట్రల్ జైలు నుంచి ప్రజాపతిని తీసుకువెళుతూ రెండు రాష్ట్రాల సరిహద్దుల్లోని సర్హాద్ చప్రిలో జరిగిన ఎన్కౌంటర్లో చంపేశారు. మే 22, 2006: ఈ ఎన్కౌంటర్ కేసును విచారించాలని, కౌసర్ ఆచూకీ తెలపాలంటూ సొహ్రాబుద్దీన్ కుటుంబసభ్యులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా గుజరాత్ రాష్ట్ర సీఐడీని ఈ కేసును విచారించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. జనవరి 2010: సుప్రీంకోర్టు ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించింది. జులై 23, 2010: అప్పటి గుజరాత్ హోంమంత్రి అమిత్ షా, అప్పటి రాజస్థాన్ హోంమంత్రి గులాబ్‌చంద్ కటారియా, ఇతర ఐపీఎస్ అధికారులతో పాటు 38 మందిపై సీబీఐ అభియోగాలు నమోదు చేసింది. జులై 25: అమిత్ షాను సీబీఐ అరెస్ట్ చేసింది. డిసెంబర్ 30, 2014: ముంబైలోని ప్రత్యేక సీబీఐ కోర్టు అమిత్‌ను కేసు నుంచి విముక్తుడ్ని చేసింది. ఇతర ఐపీఎస్ అధికారులు బయటపడ్డారు. నవంబర్ 2017: సీబీఐ ప్రత్యేక జడ్జి ఎస్జే శర్మ కేసు విచారణను ప్రారంభించారు డిసెంబర్ 21, 2018: సరైన సాక్ష్యాలు లేవంటూ 22 మందికి విముక్తి కల్పిస్తూ తీర్పు నిర్దోషులుగా బయటపడిన పోలీసులు -
సోహ్రబుద్దిన్ హత్య కేసులో నిందితులందరూ నిర్దోషులే
-
సోహ్రబుద్దీన్ కేసు: నిందితులకు విముక్తి
సాక్షి, ముంబై : 2005లో సోహ్రబుద్దీన్ షేక్, తులసీరాం ప్రజాపతి ఎన్కౌంటర్ కేసులో మొత్తం 22 మంది నిందితులకు విముక్తి కల్పిస్తూ శుక్రవారం ముంబై కోర్టు తీర్పు వెలువరించింది. నిందితులపై నేరాన్ని రుజువు చేసేందుకు తగిన ఆధారాలు లేనందున వారిని కేసు నుంచి తప్పిస్తున్నట్టు సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి స్పష్టం చేశారు. గుజరాత్, రాజస్ధాన్‌లకు చెందిన పోలీస్ అధికారులే నిందితుల్లో అధికంగా ఉన్నారు. రాజకీయ, ఆర్థిక లబ్ధి కోసమే ఈ హత్యలకు కుట్ర జరిగిందని కేసు దర్యాప్తు చేపట్టిన సీబీఐ ఆరోపించింది. ఇదే కేసులో సీబీఐ నిందితుడిగా చేర్చిన బీజేపీ చీఫ్ అమిత్ షాకు గతంలో కేసు నుంచి ఊరట లభించింది. ఆయన పాత్రపై ఆధారాలు లేనందున అమిత్ షాతో గుజరాత్ మాజీ డీజీపీ వంజరాలకు కేసు నుంచి కోర్టు విముక్తి కల్పించింది. ఈ కేసులో మొత్తం 210 మంది సాక్షులను కోర్టు విచారించగా వీరిలో 92 మంది అప్రూవర్లుగా మారారు. సోహ్రబుద్దీన్ అపహరణ, ఎన్కౌంటర్ బూటకమని నిరూపించేందుకు ప్రాసిక్యూషన్ గట్టిగా కృషి చేసినా సాక్షులు అప్రూవర్లుగా మారడంతో వారు నోరుమెదపలేదని, ఇందులో ప్రాసిక్యూషన్ తప్పేమీ లేదని కోర్టు పేర్కొంది. సోహ్రబుద్దీన్, తులసీరామ్ ప్రజాపతి కుటుంబాలకు న్యాయస్ధానం విచారం వెలిబుచ్చుతోందని, కోర్టులు కేవలం సాక్ష్యాల ఆధారంగానే పనిచేయాలని వ్యవస్థ, చట్టం నిర్దేశిస్తాయని తీర్పును చదువుతూ న్యాయమూర్తి జస్టిస్ ఎస్జే శర్మ వ్యాఖ్యానించారు. కాగా, ఈ కేసును తొలుత గుజరాత్ సీఐడీ విచారించగా తదుపరి 2010లో దర్యాప్తును సీబీఐకి బదలాయించారు. సోహ్రబుద్దీన్ ఎన్కౌంటర్ సహా ఈ ఘటనలు జరిగిన సమయంలో గుజరాత్ హోంమంత్రిగా వ్యవహరించిన అమిత్ షాను నిందితుల్లో ఒకరిగా చేర్చగా ఆయనకు వ్యతిరేకంగా ఆధారాలు లేవంటూ 2014లో కేసు నుంచి విముక్తి కల్పించారు. అసలేం జరిగింది.. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ అప్పటి గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో ఆయన హత్యకు కుట్రపన్నిన సోహ్రబుద్దీన్ షేక్ 2005 నవంబర్‌లో జరిగిన ఎన్కౌంటర్లో మరణించాడని గుజరాత్ పోలీసులు వెల్లడించారు. అదే ఏడాది నవంబర్ 22న సోహ్రబుద్దీన్, ఆయన భార్య కౌసర్ బి, సహచరుడు తులసీరాం ప్రజాపతిలు హైదరాబాద్ నుంచి మహారాష్ట్రలోని సంగ్లీకి బస్సులో వెళుతుండగా గుజరాత్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సీబీఐ తెలిపింది. నాలుగు రోజుల తర్వాత సోహ్రబుద్దీన్‌ను అహ్మదాబాద్ వద్ద హతమార్చారని, అదృశ్యమైన కౌసర్ బీని నవంబర్ 29న బనస్కంత జిల్లాలోని ఓ గ్రామానికి తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడి అనంతరం హతమార్చారని సీబీఐ ఆరోపించింది. ఇక 2006 డిసెంబర్ 27న గుజరాత్-రాజస్ధాన్ సరిహద్దుల్లో ఇరు రాష్ట్రాల పోలీసులు చాప్రి ప్రాంతం వద్ద కాల్చిచంపారని పేర్కొంది. అయితే ప్రజాపతిని ఓ కేసు విచారణ నిమిత్తం అహ్మదాబాద్ నుంచి రాజస్ధాన్‌కు తీసుకువెళుతుండగా పారిపోయేందుకు ప్రయత్నించగా అతడిని ఆపే క్రమంలో జరిపిన కాల్పుల్లో మరణించాడని పోలీసులు చెబుతున్నారు. నిర్ధోషులుగా బయటపడిన ప్రముఖులు సోహ్రబుద్దీన్ కేసులో బీజేపీ చీఫ్ అమిత్ షాతో పాటు గుజరాత్ పోలీసు అధికారి అభయ్ చుడాసమ, రాజస్ధాన్ మాజీ హోంమంత్రి గులాబ్‌చంద్ కటారియా, మాజీ గుజరాత్ డీజీపీ పీసీ పాండే, సీనియర్ పోలీస్ అధికారి గీతా జోహ్రి తదితరులున్నారు. ఇక తాజా తీర్పులో కేసు నుంచి విముక్తి పొందిన వారిలో అత్యధికులు గుజరాత్, రాజస్ధాన్‌లకు చెందిన దిగువస్ధాయి పోలీసు అధికారులే ఉండటం గమనార్హం. -
అమిత్ షాకు క్లీన్చిట్ సబబే!
ముంబై: సొహ్రాబుద్దీన్ నకిలీ ఎన్కౌంటర్ కేసులో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాకు క్లీన్చిట్ ఇవ్వడాన్ని సవాలుచేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. ఈ కేసులో విచారణ కోర్టు 2014లో అమిత్ షాను నిర్దోషిగా ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని సీబీఐ సవాలుచేయకపోవడాన్ని వ్యతిరేకిస్తూ బాంబే లాయర్ల బృందం ఈ పిల్ వేసింది. ఫిర్యాదుదారుడు, బాధితుడు కాని వ్యక్తి లేదా సంస్థ ఈ కేసులో జోక్యం చేసుకోవద్దని జస్టిస్ రంజిత్ మోరె, జస్టిస్ భారతి డాంగ్రెల ధర్మాసనం మందలించింది. ఇందులో తలదూర్చే హక్కు పిటిషన్‌దారులకు లేదని తేల్చిచెప్పింది. -
సోహ్రబుద్దీన్ ఎన్కౌంటర్: మాజీ డీఐజీకి ఊరట
సాక్షి, ముంబై : గ్యాంగ్‌స్టర్ సోహ్రబుద్దీన్ షేక్ ఎన్కౌంటర్ కేసులో గుజరాత్ మాజీ డీఐజీ డీజీ వంజర, ఐఏఎస్ అధికారులు దినేష్, రాజ్‌కుమార్ పాండియన్‌లకు విముక్తి లభించింది. కేసు విచారణ సందర్భంగా వీరిపై అభియోగాలు కొట్టివేయడానికి తాను వ్యతిరేకం కాదని సీబీఐ స్పష్టం చేయడంతో వీరిపై అభియోగాలను బాంబే హైకోర్టు సోమవారం కొట్టివేసింది. 2005-2006లో సోహ్రబుద్దీన్ షేక్, ఆయన భార్య కౌసర్ బీ, వారి సహచరులు తులసీరాం ప్రజాపతి ఎన్కౌంటర్ కేసు నుంచి తనను తప్పించాలని గుజరాత్ ఐపీఎస్ అధికారి విపుల్ అగర్వాల్ దరఖాస్తును కోర్టు అనుమతించింది. కాగా ఈ కేసు నుంచి గుజరాత్ మాజీ డీఐజీ వంజర, ఐపీఎస్ అధికారులు ఎంఎన్ దినేష్, పాండియన్‌లను తప్పించడాన్ని సవాల్ చేస్తూ సోహ్రబుద్దీన్ సోదరుడు రుబాబుద్దీన్ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. విచారణ సందర్భంగా ప్రత్యేక కోర్టు ప్రధాన నిందితులపై అభియోగాలను కొట్టివేయడాన్ని సోహ్రబుద్దీన్ సోదరుడు రుబాబుద్దీన్ న్యాయవాది గౌతం తివారి తప్పుపట్టారు. -
సోహ్రబుద్దీన్ ఎన్కౌంటర్ కేసు తీర్పు నేడే!
ముంబై: సోహ్రబుద్దీన్ నకిలీ ఎన్కౌంటర్ కేసులో 14 మంది పోలీస్ అధికారులను నిర్దోషులుగా విడుదల చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై బాంబే హైకోర్టు సోమవారం తీర్పును వెలువరించే అవకాశముంది. గ్యాంగ్‌స్టర్ సోహ్రబుద్దీన్, అతని భార్య కౌసర్బీ, అనుచరుడు తులసీ ప్రజాపతిని గుజరాత్, రాజస్తాన్ పోలీసులు 2005–06 మధ్యకాలంలో ఎన్కౌంటర్ల పేరుతో కాల్చిచంపినట్లు సీబీఐ గతంలో కేసు నమోదుచేసింది. ఈ కేసును విచారించే ప్రత్యేక కోర్టును 2013లో సుప్రీంకోర్టు ముంబైకి మార్చింది. నిందితుల్లో 15 మందిని కోర్టు నిర్దోషులుగా విడుదల చేసింది. దిగువ కోర్టు నిర్ణయాన్ని సవాలుచేస్తూ సోహ్రబుద్దీన్ సోదరుడు, సీబీఐ బాంబే హైకోర్టులో పిటిషన్లను దాఖలు చేశాయి. వాటిపై నేడు తీర్పు వెలువడే అవకాశముంది. -
లోయా మృతిపై దురుద్దేశంతోనే పిటీషన్లు : సుప్రీం
న్యూఢిల్లీ : జడ్జి బీహెచ్ లోయా మరణంపై ప్రత్యేక విచారణ కమిటీ(సిట్)ను ఏర్పాటు చేసి స్వతంత్ర విచారణ జరిపించాలంటూ దాఖలైన పిటిషన్లను దేశ అత్యున్నత న్యాయస్థానం కొట్టేసింది. ఈ సందర్భంగా ’రిట్ పిటిషన్లలో లోయా మరణంపై సిట్ విచారణ ఎందుకు జరిపించాలో సరైన వివరణ లేదని, లోయా సహజంగానే మరణించారు’ అని ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది. సొంత లాభం కోసం దురుద్దేశంతోనే ఈ పిటిషన్లను దాఖలు చేశారని దీపక్ మిశ్రా, డీవై చంద్రచూడ్, ఖన్విల్కర్‌ల ధర్మాసనం మండిపడింది. లోయా మరణానికి ముందు జరిగిన సంఘటనలు నిజమైనవి కావని నమ్మడానికి ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొంది. కాగా, ఈ మధ్యకాలంలో కాంట్రావర్సీలో చిక్కుకున్న కేసు ఇదే. రాజకీయాల పరంగానే కాకుండా, ఉన్నతమైన న్యాయవ్యవస్థలో సైతం చీలికలు తీసుకొచ్చింది ఈ కేసే. 2014 డిసెంబర్లో జస్టిస్ లోయా మరణించారు. అప్పటికి ఆయన కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) న్యాయస్థానంలో సొహ్రబుద్దీన్ కేసును విచారిస్తున్నారు. ఈ కేసులో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) అధ్యక్షుడు అమిత్ షా ప్రధాన నిందితుడిగా ఉన్నారు. తుది తీర్పు మరికొద్ది రోజుల్లో వెలువడుతుందనగా లోయా గుండెపోటుతో అకస్మాత్తుగా చనిపోయారు. లోయా మృతిపై విచారణ జరిపిన బాంబే హైకోర్టు న్యాయమూర్తులు భూషణ్ గవాయ్, సునీల్ షుక్రేలు ఆయనది సహజమరణమేనని తీర్పు చెప్పారు. అయితే, 2017 నవంబర్‌లో లోయా కుటుంబసభ్యులు ఆయన మృతిపై అనుమానాలు ఉన్నాయని, విచారణ సమయంలో నిజానిజాలు బయటకు రాలేదని వ్యాఖ్యానించారు. లోయా మరణం తర్వాత కేవలం నెల రోజుల్లోనే సోహ్రబుద్దీన్ ఫేక్ ఎన్కౌంటర్ కేసులో అమిత్ షాను సీబీఐ కోర్టు నిర్దోషిగా విడుదల అయ్యారు. దీంతో లోయా హత్యపై ప్రతిపక్ష పార్టీలు గళమెత్తాయి. లోయా మృతిపై స్వతంత్ర విచారణ జరపాలంటూ డిమాండ్ చేశాయి. -
సీబీఐని తప్పుపట్టినందుకే ఆమెను తొలగించారు
న్యూఢిల్లీ: సొహ్రబుద్దీన్ ఎన్కౌంటర్ కేసు విచారణ జరుపుతున్న జడ్జీని బాధ్య తల నుంచి తప్పించటంపై ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందించారు. ఈ ఘటనలో మీడియా మౌనాన్ని, సీబీఐ దర్యాప్తు తీరును తప్పుపట్టినందుకే జస్టిస్ రేవతిని తొలగిం చారని ఆరోపించారు. సొహ్రబుద్దీన్ కేసుతో సంబంధమున్న బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాతోపాటు కొందరు సీనియర్ ఐపీఎస్ అధికారులను తప్పించ టంపై దాఖలైన పిటిషన్లను బాంబే హైకోర్టులో జస్టిస్ రేవతి మొహితే–డేరే ఆధ్వర్యంలోని ఏకసభ్య ధర్మాసనం రోజువారీగా గత మూడు వారాలుగా విచారిస్తోంది. అయితే, ఆమెను ఈ బాధ్యతల నుంచి తప్పించి, జస్టిస్ ఎన్‌డబ్ల్యూ సాంబ్రేకి అప్పగిస్తున్నట్లు మంగళవారం హైకోర్టు వెబ్సైట్లో అధికారిక ప్రకటన వెలువడింది. కాగా, ఈ కేసులో నిజా నిజాలను నిగ్గు తేల్చేందుకు యత్నించిన మరో జడ్జి బీజీ లోయా చనిపోయిన సంగతి తెలిసిందే. -
మరో జడ్జి బలయ్యారు..
సాక్షి, న్యూఢిల్లీ : మోదీ సర్కార్‌పై కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ విమర్శల దాడి కొనసాగుతోంది. సోహ్రబుద్దీన్ షేక్ ఎన్కౌంటర్ కేసును రాహుల్ లేవనెత్తుతూ ఈ కేసు వ్యవహారం మరో న్యాయమూర్తిని బలిగొందని వ్యాఖ్యానించారు. ఈ అంశానికి సంబంధించిన పలు పిటిషన్లను బొంబాయి హైకోర్టు సింగిల్ జడ్జ్ బెంచ్‌కు కేటాయించిన నేపథ్యంలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. సోహ్రబుద్దీన్ కేసులో మరో న్యాయమూర్తిని బలిచేశారు...సీబీఐని సవాల్ చేసిన జస్టిస్ రేవతి దేరెను తొలగించారు..ఈ కేసులో అమిత్ షాను హాజరుకావాలని కోరిన జడ్జి జస్టిస్ జేటీ ఉత్పత్ను పక్కకు తప్పించారని ట్వీట్ చేశారు.ఈ కేసులో సంక్లిష్ట సందేహాలు లేవెన్తిన జస్టిస్ లోయా మరణించారని రాహుల్ పేర్కొన్నారు. ఈ కేసును విచారిస్తున్న న్యాయమూర్తినీ తప్పించారనే మీడియా కథనాలను కూడా రాహుల్ తన ట్వీట్లో పొందుపరిచారు. ఉగ్రవాదులతో సంబంధాలున్న గ్యాంగ్‌స్టర్ సోహ్రబుద్దీన్ షేక్‌ను 2005 నవంబర్‌లో గుజరాత్ పోలీసులు బూటకపు ఎన్కౌంటర్లో హతామార్చారనే ఆరోపణలున్నాయి. కాగా ఈ కేసు నుంచి అప్పటి గుజరాత్ హోంమంత్రి అమిత్ షా సహా మరో 15 మందికి 2016, 2017లో సీబీఐ కోర్టు విముక్తి కల్పించింది. -
జస్టిస్ లోయా మృతిపై ఎన్నో అనుమానాలు: రాహుల్
సాక్షి, న్యూఢిల్లీ: సీబీఐ దివంగత జడ్జి బ్రిజ్గోపాల్ హర్కిషన్ లోయా (బీహెచ్ లోయా) మృతికి సంబంధించి అంశాలపై ఫిర్యాదు చేసేందుకు విపక్ష నేతలు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిశారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నేతృత్వంలో విపక్షనేతలు శుక్రవారం సాయంత్రం రాష్ట్రపతిని కలుసుకుని జస్టిస్ బీహెచ్ లోయా మృతిపై తమకు చాలా అనుమానాలున్నాయని తెలిపారు. లోయా మృతిపై సిట్‌తో కేసు దర్యాప్తు జరిపించాలని రాహుల్ గాంధీ, రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశారు. లోయా మృతిపై ఇప్పటివరకూ ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని చెప్పారు. కేసును తప్పుదోవ పట్టించే యత్నాలు జరుగుతున్నాయని విపక్ష నేతలు రామ్‌నాథ్ కోవింద్‌కు వివరించారు. అనంతరం రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. జస్టిస్ లోయా మృతిపై 15 పార్టీలకు చెందిన 114 మంది ఎంపీలు సంతకాలు చేసిన పిటిషన్‌ను రాష్ట్రపతి కోవింద్‌కు అందజేశాం. 13 పార్టీలకు చెందిన నేతలు సిట్ విచారణకు ఆదేశించాలని రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశాం. జస్టిస్ లోయా మృతితో పాటు మరో కేసుల్లో అనుమానాలున్నాయని తెలిపాం. విచారణ కోసం తాము చేసిన విజ్ఞప్తిపై రాష్ట్రపతి కోవింద్ సానుకూలంగా స్పందించారని రాహుల్ వివరించారు. మరోవైపు బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా నిందితుడిగా ఉన్న సోహ్రబుద్దీన్ ఎన్కౌంటర్ కేసును విచారిస్తుండగానే 2014 డిసెంబర్ 1న లోయా అనుమానాస్పద స్థితిలో గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. జస్టిస్ లోయా కేసు విచారించనున్న ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనానికి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వం వహించనున్నారు. అంతకుముందు ఈ బెంచ్‌లో ఉన్న జస్టిస్ అరుణ్ మిశ్రాను పక్కకు తప్పించారు. -
‘ఛస్.. ఇది సుప్రీం కోర్టా? చేపల మార్కెటా?’
సాక్షి, న్యూఢిల్లీ : జస్టిస్ లోయా మృతి కేసులో వాదిస్తున్న న్యాయవాదులపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. వాదనలు కొనసాగుతున్న సమయంలో ఒక దశలో పరుష పదజాలంతో ఇద్దరు దూషించుకున్నారు. దీంతో అసహనం వ్యక్తం చేసిన న్యాయమూర్తి వీవై చంద్రచూడ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘కోర్టు మర్యాదను కాపాడండి. మీ వాగ్వాదంతో న్యాయస్థానాన్ని చేపల మార్కెట్‌గా మార్చకండి. మీరు వాదించేది చాలా సున్నితమైన అంశం. ఒక న్యాయమూర్తి మృతికి సంబంధించిన కేసు. ఇక్కడ మాజీ న్యాయమూర్తుల చిత్రపటాలు ఉన్నాయి. కనీసం వారికైనా గౌరవం ఇచ్చి కోర్టు హాలులో కాస్త పద్ధతిగా మెలగండి’’ అంటూ జస్టిస్ చంద్రచూడ్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీబీఐ న్యాయమూర్తి బ్రిజ్గోపాల్ హర్కిషన్ లోయా మృతిలో అనుమానాలు ఉన్నాయంటూ కార్వాన్ మాగ్జైన్(లోయా సోదరి అనురాధా బియానీ ఇచ్చిన ఇంటర్వ్యూ), ఇండియన్ ఎక్స్ ప్రెస్ కథనాల ఆధారంగా ‘బీహెచ్ లోనే’ అనే జర్నలిస్ట్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. లోనే తరపున అడ్వొకేట్ పల్లవ్ సిసోడియా.. ముంబై లాయర్స్ అసోషియన్ తరపున దుష్యంత్ దవే వాదిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం విచారణ సందర్భంగా ఇరు వర్గాల న్యాయమూర్తులు దూషించుకున్నారు. లోయా మృతిపై పలు అనుమానాలు ఉన్నాయని.. దర్యాప్తు పారదర్శకంగా జరగాలంటే స్వతంత్ర్య విభాగాన్ని ఏర్పాటు చేయాలని సిసోడియా వాదించారు. దీనికి స్పందిన దవే.. గతంలో ఇదే అంశంపై బాంబే హైకోర్టు పిటిషన్ కొట్టివేసిన విషయాన్ని గుర్తు చేశారు. దీంతో ఆగ్రహాం వ్యక్తం చేసిన సిసోడియా ‘నువ్వు ఎలా చచ్చినా నాకు పర్వాలేదు’’ అంటూ దవేను ఉద్దేశించి వ్యాఖ్యానించగా.. దవే కూడా మాటల యుద్ధానికి దిగారు. ఈ నేపథ్యంలోనే జస్టిస్ చంద్రచూడ్ జోక్యం చేసుకుని ఇరు వర్గాలను వారించాల్సి వచ్చింది. అయినప్పటికీ దవే వెనక్కి తగ్గకపోవటంతో సున్నితంగా వారించిన న్యాయమూర్తి కేసు విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు. -
‘లోయా మృతిపైనే మా విచారణ’
న్యూఢిల్లీ: సీబీఐ దివంగత జడ్జి బీహెచ్ లోయా మృతికి సంబంధించి మాత్రమే తమ విచారణ ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జస్టిస్ లోయా అనుమానాస్పద మృతిపై తదుపరి విచారణకు ఆదేశించాలా? వద్దా? అనేదే పరిశీలిస్తామంది. సోహ్రబుద్దీన్ బూటకపు ఎన్కౌంటర్ చేసిన కేసులో బీజేపీ ప్రస్తుత అధ్యక్షుడు, నాటి గుజరాత్ హోం మంత్రి అమిత్ షాను నిర్దోషిగా ప్రకటించడం సహా...మరే ఇతర అంశాల జోలికి తాము వెళ్లబోమని తేల్చిచెప్పింది. అమిత్ షా నిందితుడిగా ఉండిన సోహ్రబుద్దీన్ ఎన్కౌంటర్ కేసును విచారిస్తుండగానే 2014 డిసెంబర్ 1న లోయా అనుమానాస్పద స్థితిలో గుండెపోటుతో మరణించారు. -
జస్టిస్ లోయా మృతి తీవ్రమైన అంశం
న్యూఢిల్లీ: సోహ్రబుద్దీన్ ఎన్కౌంటర్ కేసును విచారిస్తున్న న్యాయమూర్తి జస్టిస్ బీహెచ్ లోయా అనుమానాస్పద మృతిని తీవ్రమైన అంశంగా పరిగణిస్తున్నామని సుప్రీంకోర్టు పేర్కొంది. సీబీఐ ప్రత్యేక జడ్జి లోయా 2014 డిసెంబరు 1న తన సహచరుడి కూతురి వివాహా వేడుకకు హాజరవ్వడానికి నాగ్‌పూర్ వెళ్లినప్పుడు మరణించారు. లోయా మృతిపై ఆయన సోదరి గతేడాది నవంబరులో అనుమానాలు వ్యక్తం చేయడంతో ఈ అంశం చర్చనీ యాంశమైంది. మృతి కేసులో సుప్రీంకోర్టు స్వతంత్ర విచారణ చేపట్టాలంటూ దాఖలైన రెండు పిటిషన్లను కోర్టు శుక్రవారం విచారించింది. లోయా పోస్టుమార్టమ్ నివేదికను సమర్పించాలనీ, కేసు విచారణపై తన స్పందనను ఈ నెల 15లోపు తెలియజేయాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసు ఇప్పటికే బాంబే హైకోర్టు వద్ద విచారణలో ఉందనీ, దీనిని సుప్రీంకోర్టు కూడా ఇప్పుడే విచారిస్తే హైకోర్టుకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్నందున పిటిషన్లను తిరస్కరించాల్సిందిగా బాంబే న్యాయవాదుల సంఘం తరఫున న్యాయవాది దుశ్యంత్ దవే కోరారు. అయితే విచారణ సమయంలో వారి అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటామని జడ్జీలు పేర్కొన్నారు. -
ఇది చాలా ప్రమాదకరమైన అంశం : సుప్రీంకోర్టు
సాక్షి, న్యూఢిల్లీ : సీబీఐ న్యాయమూర్తి బ్రిజ్గోపాల్ హర్కిషన్ లోయా మృతి కేసుపై సుప్రీం కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇది ఎంతో ప్రమాదకరమైన అంశమని ధర్మాసనం పేర్కొంది. నిజాయితీపరుడైన ఓ న్యాయమూర్తి చనిపోతే నిర్లక్ష్యం వహించటం సమాజానికి తప్పుడు సంకేతాలు అందిస్తుందని తెలిపింది. ‘‘లోయా మృతి చుట్టూ అల్లుకున్న అనుమానాలు నివృత్తి అయితేనే సాధారణ పౌరుడిలో న్యాయవ్యవస్ధ సామర్థ్యం, నిజాయితీల పట్ల విశ్వాసం పునరుద్ధరింపబడుతుంది’’ అని వ్యాఖ్యానించింది. ఈ కేసుకు సంబంధించి పూర్తి పత్రాలను, నివేదికలను సోమవారం తమకు సమర్పించాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని బెంచ్ ఆదేశించింది. వివాదాస్పద సోహ్రబుద్దీన్ ఎన్కౌంటర్ కేసులో వాదనలు వింటున్న లోయా.. సరిగ్గా తీర్పు వెలువరించటానికి కొద్దిరోజుల ముందు మృతి చెందారు. అయితే ఆయన మరణంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ మహారాష్ట్రకు చెందిన ‘బీఆర్ లోనే’ అనే పాత్రికేయుడు పిటిషన్ దాఖలు చేశారు. షోహ్రాబుద్దీన్ ఎన్ కౌంటర్ కేసులో బీజేపీ చీఫ్ అమిత్ షాతోపాటు పలువురు నేతలు, పోలీస్ అధికారుల పేర్లు కూడా వినిపించాయి. అసలేం జరిగింది... 2014 డిసెంబర్ 1న సహచర జడ్జి కుమార్తె వివాహం కోసం నాగ్‌పూర్‌కు ఆయన వెళ్లారు. ఆ సమయంలో ఆయన వెంట మరో ఇద్దరు జడ్జిలు కూడా ఉన్నారు. ప్రభుత్వ అతిథి గృహంలో ఆయన బస చేయగా.. ఆ రాత్రి గుండెపోటుతో ఆయన మృతి చెందారు. వైద్యులు ఆయనది సహజమరణమేనని దృవీకరించినప్పటికీ.. దుస్తులపై రక్తపు మరకలు ఉన్నాయని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. పైగా తమకు తెలీకుండానే అంత్యక్రియలు చేశారని.. మొబైల్ ఫోన్ కూడా వారం తర్వాత తమకు అందించారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. లోయా సోదరి డాక్టర్ అనురాథా బియాని ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... సోహ్రబుద్దీన్ ఎన్కౌంటర్ కేసులో కొందరు లోయాకు 100 కోట్ల రూపాయల లంచం ఇవ్వ చూపారని, కానీ, నిజాయితీపరుడైన లోయా తిరస్కరించారని ఆమె పేర్కొన్నారు. -
ఏడాదికి నాలుగు డైరీలు
► సోహ్రాబుద్దీన్ కేసు భయంతో పాత డైరీలు తగులబెట్టిన నయీమ్ ► 2010 నుంచి అందుబాటులో ఉన్న 25 డైరీలు ► సునిశితంగా దర్యాప్తు చేస్తున్నామన్న సిట్ అధికారులు సాక్షి, హైదరాబాద్: నయీమ్ కేసు విచారణలో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అతడి ఇంట్లో స్వాధీనం చేసుకున్న డైరీలపై సిట్ అధికారులు కొద్ది రోజులుగా దర్యా ప్తు వేగవంతం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచ లనం రేపిన డైరీలు, అకౌంట్ పుస్తకాలపై ఇప్పు డిప్పుడే స్పష్టత వస్తోందని సిట్ అధికా రులు తెలిపారు. ఏటా నాలుగు డైరీలు నయీమ్ రాసే వాడని, వాటితో నాలుగు అకౌంట్ పుస్త కాలు మెయింటెయిన్ చేసేవాడని అతడి భార్య, అను చరులు విచారణలో వెల్లడించినట్టు తెలిసింది. ఎవరెవరికి ఎంత ఇచ్చిందీ... నయీమ్ 2010 వరకు రాసిన డైరీలను తగులబెట్టినట్టు సిట్ వర్గాలు తెలిపాయి. 2005లో ఎన్కౌంటర్ అయిన సోహ్రాబుద్దీన్ వ్యవహారంలో తన పాత్రపై సీబీఐ దర్యాప్తు చేస్తుండటంతో భయాందోళనకు గురైన నయీమ్ 2010 వరకు రాసుకున్న డైరీలను తగులబెట్టినట్టు అతడి అనుచరులు విచారణలో వెల్లడించినట్టు సిట్ వర్గాలు తెలిపాయి. అయితే 2010 తర్వాత ఏటా నాలుగు డైరీలు మళ్లీ రాశాడని, ఇలా ఓ 25 డైరీలుంటాయని పేర్కొ న్నారు. సెటిల్మెంట్ల ద్వారా వచ్చిన డబ్బు, జీతభత్యాలుగా చెల్లించిన ఖర్చు, ఎక్కడెక్కడ ఎవరెవరికీ ఎంత ఇచ్చాడో అన్ని వివరాలను నాలుగు అకౌంట్ బుక్కుల్లో రాసుకునేవాడని చెబుతున్నారు. ఒక డైరీలో సెటిల్మెంట్లు చేసిన తీరు, ఎంత భూమి ఎంత ధరకు కొన్నాడో తదితర వివరాలను రాసుకున్నాడని సిట్ అధికారులు తెలిపారు. మరో డైరీలో సెటిల్మెంట్ల ద్వారా వచ్చిన డబ్బులను అధికారులకు, తన అనుచరులకు ఇచ్చిన తేదీలు, ప్రాంతాలను రాసుకున్నాడని, మూడో డైరీలో తనను ఎవరెవరు ఎప్పు డెప్పుడు కలిశారు... ఎందుకు కలిశారన్నది రాసుకున్నట్టు దర్యాప్తులో తేలింది. నాలుగో డైరీలో తాను చంపాలనుకున్న, చంపిన వారి జాబితా రాసుకున్నాడు. చిన్నన్నతో మరుపురాని అనుభూతి ఈ కేసులో ఆరోపణలెదుర్కొంటున్న ఓ డీఎస్పీతో నయీమ్ దిగిన ఫొటోలు 28 ఉన్నట్టు సిట్ అధికారులు గుర్తించారు. ఆ డీఎస్పీని చిన్నన్నగా నయీమ్ భావించేవాడు. చిన్నచిన్న ఫంక్షన్లకు ఫ్యామిలీ ఫ్రెండ్స్‌లా వీరు ఒకరిళ్లకు ఒకరు తరచూ వచ్చిపోతుండేవారు. ఇలా చిన్నన్న రావడం మరుపురాని అనుభూతి అని నయీమ్ తన డైరీలో తేదీలతో సహా రాసుకున్నట్టు సిట్ అధికారి ఒకరు తెలిపారు. ఇప్పటివరకు కేసులు, ఆధారాల సేకరణకు సమయం తీసుకున్న సిట్.. లభించిన ఆధారాలను అధ్యయనం చేసి, సంబంధిత అధికారుల దర్యాప్తు కోసం ప్రయత్నాలు ప్రారంభించినట్టు తెలిసింది. -
నయీం కీలక అనుచరుడి అరెస్ట్
హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీం కేసులో మరో కీలక అనుచరుడు బుధవారం లొంగిపోయాడు. రంగారెడ్డి జిల్లా కోర్టులో లొంగిపోయిన వ్యక్తిని శ్రీహరిగా గుర్తించారు. సొహ్రాబుద్దీన్ గుజరాత్ ఎన్కౌంటర్ కేసులో ఆయన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా ఉన్నాడు. నయీం ఎన్కౌంటర్ అనంతరం శ్రీహరి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. నాటకీయ పరిణామాల మధ్య బుధవారం కోర్టులో లొంగిపోవడంతో... ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. నయీం కేసులో ఇప్పటికే సుమారు 50 మంది నయీం అనుచరులను సిట్ బృందం అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. మరికొందరి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేసింది. తాజాగా శ్రీహరి లొంగుబాటుతో మరిన్ని కేసులు కొలిక్కి వచ్చే అవకాశముంది. -
అమిత్ షాకు ఊరట
న్యూఢిల్లీ: సొహ్రాబుద్దీన్ షేక్ నకిలీ ఎన్కౌంటర్ కేసులో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు సోమవారం తోసిపుచ్చింది. ఈ కేసు నుంచి అమిత్ షాకు విముక్తి కల్పిస్తూ బాంబే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సామాజిక కార్యకర్త, ప్రభుత్వ మాజీ అధికారి హర్ష్ మాందర్ వేసిన పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని జస్టిస్ ఎస్ఏ బొబ్డే, జస్టిస్ అశోక్ చౌహాన్ లతో కూడిన బెంచ్ తిరస్కరించింది. సొంత ప్రయోజనాల కోసమే మాందర్ పిటిషన్ దాఖలు చేసినట్టు కనబడుతోందని బెంచ్ అభిప్రాయపడింది. 2005లో జరిగిన గ్యాంగ్‌స్టర్ సొహ్రాబుద్దీన్ షేక్‌తో పాటు ఈ ఘటనకు ప్రత్యక్ష సాక్షిగా భావిస్తున్న తులసీరామ్ ప్రజాపతి హత్య కేసులో అప్పటి గుజరాత్ హోం శాఖ మంత్రిగా ఉన్న అమిత్ షాను సీబీఐ నిందితుడిగా పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే ఆయనను నిందితుడిగా గుర్తించడానికి ముంబైలోని సీబీఐ ప్రత్యేక కోర్టు నిరాకరించింది. సొహ్రాబుద్దీన్ కుటుంబ సభ్యులు బాంబే హైకోర్టుకు వెళ్లగా సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్ణయాన్ని సమర్థించింది. -
మాజీ ఐపీఎస్ ఆరోపణలు
వడొదర: ఆర్మీ లెఫ్టనెంట్ కల్నల్ ప్రసాద్ శ్రీకాంత్ పురోహిత్, సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్, ఆశారాం బాపులను తప్పుడు కేసుల్లో ఇరికించారని గుజరాత్ కు చెందిన మాజీ ఐపీఎస్ అధికారి డీజీ వంజారా ఆరోపించారు. తనను ఇరికించిన రాజకీయ పార్టీలే వీరిపై కేసులు బనాయించాయని పేర్కొన్నారు. వీహెచ్ పీ సంయుక్త కార్యదర్శి నీరజ్ జైన్ నేతృత్వంలోని గుజరాత్ అస్మిత మంచ్ సంస్థ ఆదివారం వంజారాకు సన్మానం చేసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'ఆశారాంపై కేసులు గురించి చదివాను. ఇవి తప్పుడు కేసులని మాజీ పోలీసు అధికారిగా నాకు తెలుసు. పురోహిత్, సాధ్విలను కూడా కేసుల్లో ఇరికించారు. వీరిపై పెట్టిన కేసులను జాతీయ దర్యాప్తు సంస్థ ఇటీవల ఉపసంహరించుకుంది. సనాతన ధర్మ పరిరక్షకులుగా ఉన్నందువల్లే సాధ్వి, ఆశారాంలను టార్గెట్ చేశార'ని వంజారా అన్నారు. సోహ్రాబుద్దీన్ నకిలీ ఎన్ కౌంటర్ కేసులో అరెస్టైన ఆయన బెయిల్ పై విడుదలయ్యారు. -
ఐపీఎస్ బాలసుబ్రమణ్యంకు క్లీన్చిట్
ముంబై: సొహ్రబుద్దీన్ బూటకపు ఎన్కౌంటర్ కేసులో ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి ఎన్. బాలసుబ్రమణ్యంకు ఇక్కడి సీబీఐ ప్రత్యేక కోర్టు క్లీన్చిట్ ఇచ్చింది. సొహ్రబుద్దీన్ను ఎన్కౌంటర్ పేరిట చంపేయడంలో బాలసుబ్రమణ్యం, ఆయన కింది అధికారి గుజరాత్ పోలీసులకు సహాయపడ్డారని సీబీఐ అభియోగాలు మోపింది. అయితే ఇందుకు తగిన ఆధారాలు లేవంటూ సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి ఎం.బి.గోసావి సోమవారం అభియోగాలను కొట్టివేశారు. గ్యాంగ్‌స్టర్ అయిన సోహ్రబుద్దీన్కు పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాతో సంబంధాలున్నాయనేది గుజరాత్ పోలీసుల అభియోగం. 2005లో సొహ్రబుద్దీన్, అతని భార్య కౌసర్బీ మహారాష్ట్రలోని సాంగ్లీకి వెళుతుండగా... హైదరాబాద్ సమీపంలో వీరిని గుజరాత్ ఏటీఎస్ పోలీసులు పట్టుకెళ్లారని ఆరోపణలున్నాయి. 2005లో గాంధీనగర్ దగ్గర్లో జరిగిన బూటకపు ఎన్కౌంటర్లో సొహ్రబుద్దీన్ను పోలీసులు కాల్చిచంపారు. -
అమిత్ షాకు ఊరట
సొహ్రాబుద్దీన్ నకిలీ ఎన్కౌంటర్ కేసు నుంచి విముక్తి తగిన ఆధారాలు లేవన్న సీబీఐ ప్రత్యేక కోర్టు నిందితుడిగా పేర్కొనలేమంటూ అభియోగాల కొట్టివేత ముంబై: బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాకు పెద్ద ఊరట లభించింది. సొహ్రాబుద్దీన్ నకిలీ ఎన్కౌంటర్ కేసు నుంచి సీబీఐ కోర్టు ఆయనకు విముక్తి ప్రసాదించింది. ఈ వ్యవహారంలో సీబీఐ మోపిన అభియోగాలు ఆమోదితం కాదని అభిప్రాయపడిన కోర్టు.. అమిత్ షాను నిందితుడిగా పేర్కొనలేమని స్పష్టం చేసింది. 2005లో జరిగిన గ్యాంగ్‌స్టర్ సొహ్రాబుద్దీన్ షేక్‌తో పాటు ఈ ఘటనకు ప్రత్యక్ష సాక్షిగా భావిస్తున్న తులసీరామ్ ప్రజాపతి హత్య కేసులో అప్పటి గుజరాత్ హోం శాఖ మంత్రిగా ఉన్న అమిత్ షాను సీబీఐ నిందితుడిగా పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇతర నిందితులకు అమిత్ షాకు మధ్య ఫోన్ సంభాషణలను ఆధారాలుగా సీబీఐ చూపింది. అయితే ఆయనను నిందితుడిగా గుర్తించడానికి ముంబైలోని సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి ఎంబీ గోసావి తాజాగా తోసిపుచ్చారు. ఆయనపై ఉన్న హత్య, కిడ్నాప్, క్రిమినల్ కుట్ర వంటి అభియోగాలను తొలగించారు. రాజకీయ దురుద్దేశంతోనే అమిత్‌ను ఈ కేసులో ఇరికించారన్న డిఫెన్స్ లాయర్ వాదనతో ఏకీభవించారు. కాగా, ఈ నిర్ణయాన్ని హైకోర్టులో సవాల్ చేయనున్నట్లు సొహ్రాబుద్దీన్ సోదరుడు రుబాబుద్దీన్ తెలిపారు. మరోవైపు కోర్టు తీర్పును అధ్యయనం చేసిన తర్వాత అప్పీల్‌పై నిర్ణయం తీసుకుంటామని సీబీఐ పేర్కొంది. తాజా పరిణామంపై రాజకీయ పార్టీలు కూడా స్పందించాయి. కోర్టు నిర్ణయంతో అమిత్ షా విషయంలో తమ పార్టీ వైఖరి సరైనదేనని తేలిందని బీజేపీ నేత, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ వ్యాఖ్యానించారు. తీర్పును అమిత్‌షాకు కొత్త ఏడాది కానుకగా భావిస్తున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ సీబీఐని దుర్వినియోగం చేసిందన్న తమ వాదన నిజమైందని, ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ దేశానికి క్షమాపణ చెప్పాలని బీజేపీ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ శర్మ డిమాండ్ చేశారు. తీర్పు అనంతరం అమిత్ షాను ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో కార్యకర్తలు, మద్దతుదారులు అభినందించారు. బాణ సంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. కాగా ప్రతిపక్ష కాంగ్రెస్ మాత్రం కోర్టు నిర్ణయంపై ఆందోళన వ్యక్తంచేసింది. ప్రభుత్వ ఒత్తిడికి సీబీఐ తలొగ్గిందని ఆరోపించింది. సీబీఐ న్యాయవాది సరిగా వాదించలేదని మండిపడింది. గతంలో చూపిన ఆధారాలతో అమిత్ జైలుకు కూడా వెళ్లారని, ఇప్పుడు అవే అధారాలు ఎలా పనికిరాకుండా పోయాయని ప్రశ్నించింది. -
ఎన్ కౌంటర్ కేసు నుంచి అమిత్ షాకు ఊరట
న్యూఢిల్లీ: షహాబుద్దీన్ షేక్ ఎన్ కౌంటర్ కేసులో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు ఊరట లభించింది. మంగళవారం ముంబై సీబీఐ కోర్టులో విచారణకు వచ్చిన ఈ కేసులో అమిత్ షా పై వచ్చిన ఆరోపణలకు సంబంధించి సరైన ఆధారాలు లేవని కోర్టుకు సీబీఐ తెలిపింది. దీంతో ఈ కేసు నుంచి అమిత్ షా కు విముక్తి కలగనుంది. అమిత్ షా గుజరాత్ హోం మంత్రిగా ఉన్న సమయంలో షహాబుద్దీన్ షేక్ ఎన్ కౌంటర్ కేసు సంచలనం రేపింది. ఆ ఘటన జరిగిన ఐదు సంవత్సరాల అనంతరం 2010 లో సీబీఐ దర్యాప్తు చేపట్టింది. ఇందులో నాటి గుజరాత్ డీజీపీ వంజర, హోం మంత్రి అమిత్ షా సహా పలువురిపై ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు వాటినుంచి బీజేపీ అధ్యక్షుడికి విముక్తి లభించింది. -
అమిత్‌షాకు మినహాయింపు
ముంబై: సోహ్రాబుద్దీన్ షేక్ నకిలీ ఎన్కౌంటర్ కేసులో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా కోర్టు విచారణకు హాజరు కాకుండా మినహాయింపు లభించింది. ముంబైలోని సీబీఐ కోర్టు సోమవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో శాశ్వత మినహాయింపు కోసం అమిత్‌షా అభ్యర్థించగా, కోర్టు మాత్రం అభియోగాలు నమోదయ్యే వరకు మాత్రమే మినహాయింపు ఇచ్చింది. 2005లో జరిగిన గ్యాంగ్‌స్టర్ సోహ్రాబుద్దీన్ షేక్, ఆయన భార్య కౌసర్ బీ నకిలీ ఎన్కౌంటర్ కేసులో అమిత్ షా కిడ్నాప్, హత్య ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ఇదే కేసులో పోలీసులు దాఖలు చేసిన చార్జ్‌షీటు ఇంగ్లిష్ కాపీ ఇప్పించాలని కోరుతూ సోహ్రాబుద్దీన్ సోదరుడు రుబాబుద్దీన్ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు స్వీకరించింది. ఇంగ్లిష్ కాపీ ఇవ్వాలని సీబీఐని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. ** -
సీబీఐ ప్రత్యేక కోర్టులో అమిత్ షా కు ఊరట!
ముంబై: సీబీఐ ప్రత్యేక కోర్టులో బీజేపీ నేత అమిత్ షాకు ఊరట లభించింది. సోహ్రాబుద్దీన్ షేక్, తులసిరాం ప్రజాపతి ఎన్ కౌంటర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అమిత్ షాకు కోర్టుకు వ్యకిగత హాజరు నుంచి మినహాయింపు లభించింది. దేశ రాజధాని న్యూఢిల్లీలో రాజకీయ వ్యవహారాల్లో అమిత్ షా బిజీగా ఉంటున్నారని.. సీబీఐ ప్రత్యేక కోర్టుకు వ్యక్తిగతంగా హాజరుకావడానికి ఇబ్బందులున్నందున మినహాయింపు ఇవ్వాలని అమిత్ షా తరపు లాయర్ సీబీఐ ప్రత్యేక కోర్టును అభ్యర్ధించారు. అమిత్ షా డిశ్చార్జ్ దరఖాస్తును కోర్టు జూలై 14 తేదిన విచారణ చేపట్టనుంది. Follow @sakshinews