మాజీ ఐపీఎస్ ఆరోపణలు
వడొదర: ఆర్మీ లెఫ్టనెంట్ కల్నల్ ప్రసాద్ శ్రీకాంత్ పురోహిత్, సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్, ఆశారాం బాపులను తప్పుడు కేసుల్లో ఇరికించారని గుజరాత్ కు చెందిన మాజీ ఐపీఎస్ అధికారి డీజీ వంజారా ఆరోపించారు. తనను ఇరికించిన రాజకీయ పార్టీలే వీరిపై కేసులు బనాయించాయని పేర్కొన్నారు. వీహెచ్ పీ సంయుక్త కార్యదర్శి నీరజ్ జైన్ నేతృత్వంలోని గుజరాత్ అస్మిత మంచ్ సంస్థ ఆదివారం వంజారాకు సన్మానం చేసింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'ఆశారాంపై కేసులు గురించి చదివాను. ఇవి తప్పుడు కేసులని మాజీ పోలీసు అధికారిగా నాకు తెలుసు. పురోహిత్, సాధ్విలను కూడా కేసుల్లో ఇరికించారు. వీరిపై పెట్టిన కేసులను జాతీయ దర్యాప్తు సంస్థ ఇటీవల ఉపసంహరించుకుంది. సనాతన ధర్మ పరిరక్షకులుగా ఉన్నందువల్లే సాధ్వి, ఆశారాంలను టార్గెట్ చేశార'ని వంజారా అన్నారు. సోహ్రాబుద్దీన్ నకిలీ ఎన్ కౌంటర్ కేసులో అరెస్టైన ఆయన బెయిల్ పై విడుదలయ్యారు.