న్యూఢిల్లీ: సొహ్రబుద్దీన్ ఎన్‌కౌంటర్ కేసు విచారణ జరుపుతున్న జడ్జీని బాధ్య తల నుంచి తప్పించటంపై ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందించారు. ఈ ఘటనలో మీడియా మౌనాన్ని, సీబీఐ దర్యాప్తు తీరును తప్పుపట్టినందుకే జస్టిస్ రేవతిని తొలగిం చారని ఆరోపించారు.
సొహ్రబుద్దీన్ కేసుతో సంబంధమున్న బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాతోపాటు కొందరు సీనియర్ ఐపీఎస్ అధికారులను తప్పించ టంపై దాఖలైన పిటిషన్లను బాంబే హైకోర్టులో జస్టిస్ రేవతి మొహితే–డేరే ఆధ్వర్యంలోని ఏకసభ్య ధర్మాసనం రోజువారీగా గత మూడు వారాలుగా విచారిస్తోంది. అయితే, ఆమెను ఈ బాధ్యతల నుంచి తప్పించి, జస్టిస్ ఎన్‌డబ్ల్యూ సాంబ్రేకి అప్పగిస్తున్నట్లు మంగళవారం హైకోర్టు వెబ్‌సైట్‌లో అధికారిక ప్రకటన వెలువడింది. కాగా, ఈ కేసులో నిజా నిజాలను నిగ్గు తేల్చేందుకు యత్నించిన మరో జడ్జి బీజీ లోయా చనిపోయిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment