సాక్షి, న్యూఢిల్లీ : సీబీఐ వివాదంలో ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ విమర్శలతో విరుచుకుపడ్డారు. రాఫెల్ డీల్‌కు సంబంధించిన పత్రాలను సేకరిస్తున్నందుకే సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మను తప్పించారని ఆరోపించారు. రాఫెల్ పత్రాలను సేకరిస్తున్నందుకే సీబీఐ చీఫ్ అలో్క్ వర్మను బలవంతంగా సెలవుపై పంపారని విమర్శించారు. రాఫెల్ స్కాంను నిగ్గుతేల్చేవారెవరైనా తొలగించడం లేదా వారిని నాశనం చేయడం జరుగుతుందని ప్రధాని విస్పష్ట సంకేతాలు పంపారన్నారు.
మోదీ హయాంలో రాజ్యాంగం, దేశం పెనుప్రమాదంలో పడ్డాయని రాహుల్ ట్వీట్ చేశారు. రాజస్ధాన్‌లో బుధవారం జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలోనూ రాహుల్ ఈ అంశం ప్రస్తావించారు. గత రాత్రి కాపలాదారు (ప్రధాని మోదీ) రాఫెల్ డీల్‌పై ప్రశ్నిస్తున్న సీబీఐ డైరెక్టర్‌ను తొలగించారని వ్యాఖ్యానించారు. మరోవైపు దర్యాప్తు ఏజెన్సీ ప్రతిష్ట, విశ్వసనీయతను కాపాడేందుకే కేంద్ర విజిలెన్స్ కమిషన్ సూచన మేరకు సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ, ప్రత్యేక డైరెక్టర్ రాకేష్ ఆస్ధానాలను తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వివరణ ఇచ్చారు. రాఫెల్ డీల్‌పై విచారణకు ఆయన ఆసక్తి చూపుతుండటం వల్లే అలోక్ వర్మను తొలగించారనే విపక్షాల ఆరోపణలను మంత్రి తోసిపుచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment