ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, న్యూఢిల్లీ : మోదీ సర్కార్‌పై కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ విమర్శల దాడి కొనసాగుతోంది. సోహ్రబుద్దీన్ షేక్ ఎన్‌కౌంటర్ కేసును రాహుల్ లేవనెత్తుతూ ఈ కేసు వ్యవహారం మరో న్యాయమూర్తిని బలిగొందని వ్యాఖ్యానించారు. ఈ అంశానికి సంబంధించిన పలు పిటిషన్లను బొంబాయి హైకోర్టు సింగిల్ జడ్జ్ బెంచ్‌కు కేటాయించిన నేపథ్యంలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. సోహ్రబుద్దీన్ కేసులో మరో న్యాయమూర్తిని బలిచేశారు...సీబీఐని సవాల్ చేసిన జస్టిస్ రేవతి దేరెను తొలగించారు..ఈ కేసులో అమిత్ షాను హాజరుకావాలని కోరిన జడ్జి జస్టిస్ జేటీ ఉత్పత్‌ను పక్కకు తప్పించారని ట్వీట్ చేశారు.ఈ కేసులో సంక్లిష్ట సందేహాలు లేవెన్తిన జస్టిస్ లోయా మరణించారని రాహుల్ పేర్కొన్నారు.
ఈ కేసును విచారిస్తున్న న్యాయమూర్తినీ తప్పించారనే మీడియా కథనాలను కూడా రాహుల్ తన ట్వీట్‌లో పొందుపరిచారు. ఉగ్రవాదులతో సంబంధాలున్న గ్యాంగ్‌స్టర్ సోహ్రబుద్దీన్ షేక్‌ను 2005 నవంబర్‌లో గుజరాత్ పోలీసులు బూటకపు ఎన్‌కౌంటర్‌లో హతామార్చారనే ఆరోపణలున్నాయి. కాగా ఈ కేసు నుంచి అప్పటి గుజరాత్ హోంమంత్రి అమిత్ షా సహా మరో 15 మందికి 2016, 2017లో సీబీఐ కోర్టు విముక్తి కల్పించింది.
Comments
Please login to add a commentAdd a comment