భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది: రాహుల్ గాంధీ ట్వీట్ | Think Understand and Then Take Right Decision Rahul Gandhi Tweet Viral | Sakshi
Sakshi News home page

భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది: రాహుల్ గాంధీ ట్వీట్

Published Thu, Apr 4 2024 5:50 PM | Last Updated on Thu, Apr 4 2024 6:10 PM

Think Understand and Then Take Right Decision Rahul Gandhi Tweet Viral - Sakshi

ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అగ్రనేతలు ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నారు. ఓ వైపు బీజేపీ నుంచి ప్రధాని మోదీ ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తుంటే.. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి రాహుల్ గాంధీ ప్రచారం చేస్తున్నారు.

రాహుల్ గాంధీ ప్రచారంలో భాగంగా.. తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేశారు. ఇందులో ప్రస్తుతం దేశం కీలక దశలో ఉంది. దేశాన్ని నిర్మించే వారికి.. దేశాన్ని నాశనం చేసేవారికి మధ్య ఉన్న వ్యత్యాసం ప్రతి వర్గం గుర్తించాలి అని అన్నారు. 

కాంగ్రెస్ & ఇండియా అంటే.. యువతకు ఉద్యోగావకాశాలు, రైతులకు MSP (మినిమమ్ సపోర్ట్ ప్రైస్) హామీ, ప్రతి పేద మహిళ లక్షాధికారి కావడం, కార్మికులకు రోజుకు కనీసం రూ. 400, కులగణన & ఆర్థిక సర్వే మాత్రమే కాకుండా సురక్షితమైన రాజ్యాంగం & పౌరుల హక్కులు అని వివరించారు.

బీజేపీ అంటే.. నిరుద్యోగం, రైతులకు అప్పుల భారం, మహిళలకు రక్షణ లేకుండా పోవడం, నిస్సహాయ కార్మికులు, వెనుకబడిన వర్గాల పట్ల వివక్ష & దోపిడీ మాత్రమే కాకుండా నియంతృత్వం, మోసపూరిత ప్రజాస్వామ్యం అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది, ఆలోచించండి, అర్థం చేసుకోండి, సరైన నిర్ణయం తీసుకోండి అని రాహుల్ గాంధీ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement