
అమిత్‌షా
ముంబై: సోహ్రాబుద్దీన్ షేక్ నకిలీ ఎన్‌కౌంటర్ కేసులో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా కోర్టు విచారణకు హాజరు కాకుండా మినహాయింపు లభించింది. ముంబైలోని సీబీఐ కోర్టు సోమవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో శాశ్వత మినహాయింపు కోసం అమిత్‌షా అభ్యర్థించగా, కోర్టు మాత్రం అభియోగాలు నమోదయ్యే వరకు మాత్రమే మినహాయింపు ఇచ్చింది. 2005లో జరిగిన గ్యాంగ్‌స్టర్ సోహ్రాబుద్దీన్ షేక్, ఆయన భార్య కౌసర్ బీ నకిలీ ఎన్‌కౌంటర్ కేసులో అమిత్ షా కిడ్నాప్, హత్య ఆరోపణలను ఎదుర్కొంటున్నారు.
ఇదే కేసులో పోలీసులు దాఖలు చేసిన చార్జ్‌షీటు ఇంగ్లిష్ కాపీ ఇప్పించాలని కోరుతూ సోహ్రాబుద్దీన్ సోదరుడు రుబాబుద్దీన్ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు స్వీకరించింది. ఇంగ్లిష్ కాపీ ఇవ్వాలని సీబీఐని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది.
**