సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ శివార్లలోని శామీర్‌పేట్‌లో ఉన్న లియోనియా రిసార్ట్స్ ఎండీ చక్రవర్తి రాజును సీబీఐ అధికారులు బుధవారం అరెస్టు చేశారు. లియోనియా రిసార్ట్స్ నిర్మించడం కోసం చక్రవర్తి రాజు 11 బ్యాంకుల నుంచి రూ.650 కోట్ల మేర రుణం తీసుకున్నారు. ఆ సమయంలో అనేక మంది రైతుల భూములకు సంబంధించిన బోగస్ పత్రాలను బ్యాంకుల్లో దాఖలు చేశారనే ఆరోపణలపై బెంగళూరు సీబీఐ టీమ్ కేసు నమోదు చేసుకుంది. ఈ రిసార్ట్‌కు కేవలం 30 ఎకరాల స్థలం మాత్రమే ఉండగా... బ్యాంకులకు 100 ఎకరాలకు పైగా చూపించారని, బోగస్ డాక్యుమెంట్ల ద్వారానే ఇది సాధ్యమైందని సీబీఐ గుర్తించింది. దీనికి సంబంధించి ప్రాథమిక ఆధారాలు సేకరించిన అధికారులు నిందితుడిగా ఉన్న చక్రవర్తి రాజును అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment