chakravarti
-
కాంబినేషన్ సెట్?
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ జోరు పెంచారు. ఓ సినిమా చేస్తుండగానే తర్వాతి చిత్రాన్ని కూడా లైన్లో పెట్టేస్తున్నారాయన. ప్రస్తుతం నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో ‘జైలర్’ సినిమాతో బిజీగా ఉన్నారు రజనీకాంత్. ఈ మూవీ షూటింగ్ ఇటీవలే చెన్నైలో ప్రారంభమైంది. వచ్చే ఏడాది వేసవిలో ఈ చిత్రం రిలీజ్ కానుందట. అయితే ‘జైలర్’ తర్వాత రజనీ నటించనున్న చిత్రానికి సిబి చక్రవర్తి దర్శకత్వం వహించనున్నారనే ప్రచారం కోలీవుడ్‌లో సాగుతోంది. కామెడీతో కూడిన ఓ కమర్షియల్ లైన్‌ను రజనీకాంత్‌కు చక్రవర్తి చెప్పారంటూ గతంలోనే వార్తలు వచ్చాయి. రీసెంట్గా మరోసారి రజనీని కలిసిన ఆయన కథ చెప్పారట. ఈ కథ పట్ల రజనీ పాజిటివ్‌గా ఉండటంతో ఫైనల్ స్క్రిప్ట్‌ను రెడీ చేసే పనిలో ఉన్నారట చక్రవర్తి. ఈ కొత్త కాంబినేషన్ గురించి త్వరలోనే ప్రకటన రానున్నదని భోగట్టా. కాగా శివకార్తికేయన్ హీరోగా సిబి చక్రవర్తి దర్శకత్వం వహించిన ‘డాన్’(తమిళ్) చిత్రం మంచి హిట్ అయింది. -
రైతుల ఆందోళనకు అనుమతి లేదు
సాక్షి, గుంటూరు: రాజధాని గ్రామాల్లో రైతులు చేస్తున్న ఆందోళనకు ఎలాంటి అనుమతులు లేవని గుంటూరు జిల్లా అడిషనల్ ఎస్పీ చక్రవర్తి తెలిపారు. రాజధాని గ్రామాల్లో సెక్షన్30, యాక్ట్ 144 అమల్లో ఉందన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కుంది కానీ ఎదుటివారికి ఇబ్బంది కల్పించే హక్కు లేదని పేర్కొన్నారు. రైతులు ప్రశాంతంగా నిరసన తెలిపినంత వరకు తాము వారిని అడ్డుకోమని స్పష్టం చేశారు. ప్రజల హక్కులకు ఇబ్బంది కల్పించి చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ఉద్దండ రాయునిపాలెంలో మీడియా ప్రతినిధులపై దాడి ఘటనకు సంబంధించిన పూర్తి ఆధారాలు తమ వద్ద ఉన్నాయని ఎస్పీ చక్రవర్తి తెలిపారు. ఆ సమయంలో పోలీసులు లేకుంటే ప్రాణ నష్టం జరిగేదన్నారు. మీడియాపై దాడి చేసిన వారిపై మాత్రమే కేసులు నమోదు చేశామని తెలిపారు. మందడంలో జరిగిన ఘటనలో ఆందోళన చేస్తున్న వారిపై పోలీసులు దాడి చేయలేదని స్పష్టం చేశారు. ఆందోళనకారులే పోలీసులపైకి దాడికి దిగగా ముగ్గురు కానిస్టేబుల్స్ గాయపడ్డారని పేర్కొన్నారు. వెంబడించి మరీ దాడి చేశారు: జర్నలిస్టులు -
రెండు జంటల కథ
చక్రవర్తి, బంగార్రాజు, అక్షర, సంతోషిణి ముఖ్య తారలుగా వెల్లంకి దుర్గాప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రూపం యస్ 20 ప్లస్’. సాయి తులసి సమర్పణలో సి.రామాంజనేయ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 28న విడుదలవుతోంది. వెల్లంకి దుర్గాప్రసాద్ మాట్లాడుతూ– ‘‘ఓ మధ్యతరగతి అమ్మాయి లైంగిక దాడి నుంచి ఎలా తప్పించుకుంది? మంచి మనిషికి దగ్గరై అతని ప్రేమను ఎలా పొందింది? అన్నది ఒక జంట కథ. మాఫియా వలలో చిక్కుకున్న తన భార్యను ఒక పోలీసాఫీసర్ ఎలా కాపాడుకున్నాడన్నది రెండో జంట కథ’’ అన్నారు. ‘‘అన్నివర్గాలకు నచ్చేలా మా సినిమా ఉంటుంది’’ అన్నారు సి. రామాంజ నేయ. ఈ చిత్రానికి కెమెరా: సాగర్, ఆనంద్, సంగీతం: మెలోడీ శ్రీనివాస్, ఆర్ ఆర్ అర్మాన్. ∙చక్రవర్తి, అక్ష్రర -
లియోనియా రిసార్ట్స్ ఎండీ అరెస్టు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ శివార్లలోని శామీర్‌పేట్‌లో ఉన్న లియోనియా రిసార్ట్స్ ఎండీ చక్రవర్తి రాజును సీబీఐ అధికారులు బుధవారం అరెస్టు చేశారు. లియోనియా రిసార్ట్స్ నిర్మించడం కోసం చక్రవర్తి రాజు 11 బ్యాంకుల నుంచి రూ.650 కోట్ల మేర రుణం తీసుకున్నారు. ఆ సమయంలో అనేక మంది రైతుల భూములకు సంబంధించిన బోగస్ పత్రాలను బ్యాంకుల్లో దాఖలు చేశారనే ఆరోపణలపై బెంగళూరు సీబీఐ టీమ్ కేసు నమోదు చేసుకుంది. ఈ రిసార్ట్‌కు కేవలం 30 ఎకరాల స్థలం మాత్రమే ఉండగా... బ్యాంకులకు 100 ఎకరాలకు పైగా చూపించారని, బోగస్ డాక్యుమెంట్ల ద్వారానే ఇది సాధ్యమైందని సీబీఐ గుర్తించింది. దీనికి సంబంధించి ప్రాథమిక ఆధారాలు సేకరించిన అధికారులు నిందితుడిగా ఉన్న చక్రవర్తి రాజును అరెస్టు చేశారు. -
చక్రవర్తికి టైటిల్
జింఖానా, న్యూస్‌లైన్: బ్రిలియంట్ ట్రోఫీ చెస్ టోర్నీ ఓపెన్ కేటగిరీలో చక్రవర్తి రెడ్డి టైటిల్‌ని గెలుచుకున్నాడు. బ్రిలియంట్ గ్రామర్ హైస్కూల్లో ఆదివారం జరిగిన ఫైనల్లో చక్రవర్తి రెడ్డి(6)... ప్రభాత్ (5)పై గెలుపొందాడు. రమణ కుమార్ (5)... రాజు (4)పై నెగ్గి రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. జూనియర్స్ కేటగిరీలో వర్షిత, అభినవ్, మేఘరనాశ్రమ్ 6 రౌండ్లకు గాను 5.5 పాయింట్లు సాధించడంతో టై బ్రేక్‌కు దారితీసింది. టై బ్రేక్‌లో వర్షిత్ మొదటి స్థానంలో నిలవగా... అభినవ్, మేఘనాశ్రమ్ వరుసగా రెండు, మూడు స్థానాలను కైవసం చేసుకున్నారు. మిగతా ఫలితాలు: అండర్-14 బాలురు: 1. చేతన్ రాథోడ్, 2.ప్రణీత్; బాలికలు: 1. హరిలాస్య, 2. సాయిశృతి. అండర్-12 బాలురు: 1. మేఘనాశ్రమ్, 2. శ్రీకర్; బాలికలు: 1. మోహిని అశోక్, 2. సాధన. అండర్-10 బాలురు: 1. అభినవ్, 2. ప్రధమ్; బాలికలు: 1. సాహిత్య, 2. అంజలి. అండర్-8 బాలురు: 1. రుత్విక్ రోహన్, 2. ప్రశాంత్; బాలికలు: 1. రచిత, 2. అనూషా రెడ్డి. అండర్-6 బాలురు: 1. ప్రణయ్ వెంకేటేశ్, 2. శ్రీకర్; బాలికలు: 1. సేవిత విజు, 2. నిత్య రాజు.