
చక్రవర్తి, అక్షర
చక్రవర్తి, బంగార్రాజు, అక్షర, సంతోషిణి ముఖ్య తారలుగా వెల్లంకి దుర్గాప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రూపం యస్ 20 ప్లస్’. సాయి తులసి సమర్పణలో సి.రామాంజనేయ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 28న విడుదలవుతోంది. వెల్లంకి దుర్గాప్రసాద్ మాట్లాడుతూ– ‘‘ఓ మధ్యతరగతి అమ్మాయి లైంగిక దాడి నుంచి ఎలా తప్పించుకుంది? మంచి మనిషికి దగ్గరై అతని ప్రేమను ఎలా పొందింది? అన్నది ఒక జంట కథ. మాఫియా వలలో చిక్కుకున్న తన భార్యను ఒక పోలీసాఫీసర్ ఎలా కాపాడుకున్నాడన్నది రెండో జంట కథ’’ అన్నారు. ‘‘అన్నివర్గాలకు నచ్చేలా మా సినిమా ఉంటుంది’’ అన్నారు సి. రామాంజ నేయ. ఈ చిత్రానికి కెమెరా: సాగర్, ఆనంద్, సంగీతం: మెలోడీ శ్రీనివాస్, ఆర్ ఆర్ అర్మాన్.
∙చక్రవర్తి, అక్ష్రర
Comments
Please login to add a commentAdd a comment