ట్వంటీ ప్లస్‌ | rupum s 20 plus poster release | Sakshi
Sakshi News home page

ట్వంటీ ప్లస్‌

Published Fri, May 10 2019 3:47 AM | Last Updated on Fri, May 10 2019 3:47 AM

rupum s 20 plus poster release - Sakshi

సంతోషిని

చక్రవర్తి, బంగార్రాజు, ఆంధ్ర అప్పాచీ, అక్షర, సంతోషిని, ఉమ ముఖ్య తారలుగా వెల్లంకి దుర్గాప్రసాద్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రూపం ఎస్, 20ప్లస్‌’. సాయిలోకేష్‌ ప్రొడక్షన్‌ పతాకంపై సి.రామాంజనేయ నిర్మించిన ఈ సినిమా పోస్టర్‌ని నిర్మాత సాయివెంకట్‌ రిలీజ్‌ చేసి, మాట్లాడుతూ– ‘‘పల్లెటూరి నేపథ్యంలో వినోదాత్మకంగా రూపొందిన చిత్రమిది. దుర్గాప్రసాద్‌ మంచి ప్రతిభ ఉన్న వ్యక్తి. తనకు ఈ సినిమాతో మంచి పేరొస్తుంది’’ అన్నారు. ‘‘దర్శకు డిగా అవకాశం ఇచ్చిన రామాంజనేయగారికి థ్యాంక్స్‌. వెల్లంకి విజయలక్ష్మి రాసిన పాటలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ’’ అని వెల్లంకి దుర్గాప్రసాద్‌ అన్నారు. ‘‘ప్రేక్షకులకు మంచి వినోదం అందించబోతున్నాం. ఆరవన్, మెలోడి శ్రీనివాస్‌ కలిసి ఈ చిత్రానికి మంచి సంగీతం అందించారు’’ అని రామంజనేయ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఆనంద్, సాగర్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement