chakravarthi
-
బాబు, పవన్ కు దేవభక్తుని చక్రవర్తి కౌంటర్
-
సొల్లు కబుర్లు ఆపరా పవన్: పేర్ని నాని
-
వైఎస్సార్సీపీ ఎంపీటీసీపై హత్యాయత్నం
తిరుపతి రూరల్: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం ఎ. రంగంపేట వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యుడు బోస్‌చంద్రారెడ్డిపై శనివారం రాత్రి కొందరు దుండగులు హత్యాయత్నానికి ప్రయత్నించారు. ఎంపీటీసీ సభ్యుడిని కత్తితో పొడిచేందుకు యత్నించడంతోపాటు అతని కారును కాల్చివేసేందుకు వేసిన పథకం విఫలమైంది. ఈ ఘటనలో కత్తితో సహా ఓ సినీహీరో వద్ద బౌన్సర్‌గా పనిచేసిన వ్యక్తి పట్టుబడ్డాడు. ఓ ప్రైవేటు యూనివర్సిటీ మాజీ పీఆర్వో సతీష్, ఓ సినీ హీరో అభిమాన సంఘం అధ్యక్షుడు సునీల్‌చక్రవర్తి సూచనల మేరకే ఈ ఘటనకు పాల్పడినట్లు పట్టుబడిన వ్యక్తి మీడియాతో చెప్పడం విశేషం. బాధితుడు బోస్‌చంద్రారెడ్డి తెలిపిన వివరాలు.. సతీష్, సునీల్‌చక్రవర్తి గతంలో బోస్‌చంద్రారెడ్డి, రంగంపేట ఉప సర్పంచ్ మౌనిష్రెడ్డితో గొడవపడ్డారు. ఓ భూమి, షాపు విషయంలోనూ ఎంపీటీసీ, ఉప సర్పంచ్‌తో సతీష్, సునీల్‌చక్రవర్తిలు ఘర్షణకు దిగారు. ఈ నేపథ్యంలో బోస్‌చంద్రారెడ్డిపై కక్ష పెంచుకున్న సతీష్, సునీల్‌చక్రవర్తిలు ఓ సినీహీరో వద్ద బౌన్సర్‌గా పనిచేసిన హేమంత్‌తో ఒప్పందం చేసుకున్నారు. దీంతో శనివారం రాత్రి హేమంత్ మరో ఐదుగురు కలిసి రాడ్లు, కత్తులు, పెట్రోల్ బాటిల్స్‌తో మారుతీనగర్‌లోని బోస్‌చంద్రారెడ్డి ఇంటికి వెళ్లారు. కత్తితో దాడి చేసేందుకు ప్రయత్నించి.. జన సంచారం ఉండటంతో ఆఖరి నిమిషంలో పరారయ్యారు. అనంతరం మళ్లీ రాత్రి 11 గంటలకు ఇలానే దాడి చేసేందుకు విఫలయత్నం చేశారు. ఆదివారం వేకువజామున 3 గంటలకు మళ్లీ కత్తులు, రాడ్లు, పెట్రోల్‌తో దాడికి రావడంతో వారిపై బోస్‌చంద్రారెడ్డి అనుచరులు తిరగబడ్డారు. హేమంత్ కత్తితో సహా పట్టుబడగా.. మిగిలినవారు పారిపోయారు. అతన్ని పట్టుకుని విచారించిన బోస్‌చంద్రారెడ్డి వర్గీయులు, రంగంపేటలోనూ మరో బ్యాచ్ ఉన్నారని చెప్పడంతో కారులో అతన్ని ఎక్కించుకుని రంగంపేటకు వచ్చారు. అప్పటికే వారు కూడా పారిపోయారు. ఈ హత్యాయత్నానికి సతీష్ కీలకసూత్రధారి అని, అతనే బోస్‌చంద్రారెడ్డి, మౌనిష్రెడ్డిలపై దాడి చేయమన్నారని, దీనిలో సునీల్‌చక్రవర్తి పాత్ర కూడా ఉందని హేమంత్ మీడియాకు తెలిపాడు. హత్యచేయడం లక్ష్యం కాదని, కారును కాలి్చవేసి భయపెట్టాలని యత్నించినట్టు చెప్పాడు. నిందితులకు సతీష్ ఫోన్‌పే ద్వారా నగదు పంపించడం, అర్ధరాత్రిళ్లు కూడా సునీల్‌చక్రవర్తి ఫోన్లో మాట్లాడుతుండటంతో బాధితులు నిజనిర్ధారణకు వచ్చారు. హేమంత్‌ను చంద్రగిరి పోలీసులకు అప్పగించారు. ఘటన జరిగిన ప్రదేశం తిరుపతి యూనివర్సిటీ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉండటంతో బోస్‌చంద్రారెడ్డి అక్కడే ఫిర్యాదు చేసినట్టు సమాచారం. కాగా, కొన్ని మీడియాల్లో సినీనటులు మోహన్‌బాబు, విష్ణువర్ధన్బాబుపై అసత్య ప్రచారం చేయడాన్ని బోస్‌చంద్రారెడ్డి, మౌనిష్రెడ్డిలు ఖండించారు. చంద్రగిరిలో విలేకరుల సమావేశం పెట్టి జరిగిన ఘటనలతో వారికి ఎలాంటి సంబంధం లేదని, అసత్యప్రచారాలు మానుకోవాలని స్పష్టం చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ బోస్‌చంద్రారెడ్డి, మౌనిష్రెడ్డితోపాటు గ్రామస్తులు ధర్నా చేశారు. -
తండ్రి ఆస్తిలో కుమార్తెలకూ సమాన హక్కు.. తేల్చి చెప్పిన హైకోర్టు
సాక్షి, అమరావతి : హిందూ వారసత్వ సవరణ చట్టం ప్రకారం కూతురు పుట్టుకతోనే తండ్రి ఆస్తిలో సమాన వారసత్వ హక్కుదారు అవుతుందని హైకోర్టు స్పష్టం చేసింది. సవరణ చట్టం అమల్లోకి వచ్చిన 2005 సెప్టెంబర్ 9వ తేదీ నాటికి తండ్రి మరణించారా? లేదా? అన్న దాంతో సంబంధం లేకుండా హిందూ అవిభాజ్య కుటుంబం (హెచ్‌యూఎఫ్) ఆస్తుల విషయంలో కుమార్తెలకు సైతం సమాన హక్కు ఉంటుందని తేల్చి చెప్పింది. ఇదే విషయాన్ని సుప్రీం కోర్టు వినీత శర్మ కేసులో స్పష్టంగా చెప్పిందని, సవరణ చట్టం అమల్లోకి వచ్చే నాటికి తండ్రి బతికి ఉండాల్సిన అవసరం లేదని తెలిపిందని వివరించింది. తండ్రి ఉమ్మడి ఆస్తిలో కుమార్తెలకు సమాన వాటా హక్కును సవరణ చట్టం అమల్లోకి వచ్చిన తరువాత నుంచి మాత్రమే పరిమితం చేయలేమని తేల్చి చెప్పింది. ఆ చట్టం నిబంధనలు పూర్వం (రెట్రోస్పెక్టివ్) నుంచే వర్తిస్తాయని చెప్పడంలో ఎలాంటి సంశయం లేదంది. హిందూ వారసత్వ సవరణ చట్టం ప్రకారం తుది తీర్పునివ్వాలని అభ్యర్థి స్తూ తెనాలి కోర్టును ఆశ్రయించాలని ఓ కేసులో పిటిషనర్లుగా ఉన్న ముగ్గురు మహిళలకు హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బీవీఎల్ఎన్ చక్రవర్తి ఈ నెల 13న తీర్పు వెలువరించారు. తండ్రి ఆస్తిలో వాటా కోసం కుమార్తెల పోరాటం తమ తండ్రి తురగా రామమూర్తికి చెందిన ఉమ్మడి ఆస్తిలో వాటా ఇచ్చేందుకు సోదరులు, సోదరీమణులు తిరస్కరిస్తున్నారంటూ ఆనందరావు అనే వ్యక్తి 1986లో తెనాలి అదనపు సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో దావా వేశారు. ఇదే సమయంలో హిందూ వారసత్వ సవరణ చట్టం ప్రకారం తమ తండ్రి ఆస్తిలో తమకు సమాన వాటా ఉందని, ఆ మేర తీర్పునివ్వాలని కోరుతూ రామమూర్తి కుమార్తెలు సీతారావమ్మ మరో ఇద్దరు ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన కోర్టు 2009లో వీరికి అనుకూలంగా తీర్పునిచ్చింది. ఈ ఉత్తర్వులను సమీక్షించాలంటూ రామమూర్తి కుమారుల్లో కొందరు, వారి వారసులు తెనాలి కోర్టులో అనుబంధ పిటిషన్ వేశారు. విచారణ జరిపిన కోర్టు 2010లో కుమారులకు అనుకూలంగా తీర్పునిచ్చింది. వారసత్వ సవరణ చట్టం ఆస్తి వాటాల విషయంలో కుమార్తెలకు వర్తించదని కోర్టు చెప్పింది. సవరణ చట్టాన్ని పూర్వం నుంచి వర్తింపజేయడానికి వీల్లేదని చెప్పింది. ఈ తీర్పును సవాలు చేస్తూ ముగ్గురు కుమార్తెలు అదే ఏడాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై ఇటీవల న్యాయమూర్తి జస్టిస్ బీవీఎల్ఎన్ చక్రవర్తి తుది విచారణ జరిపారు. పిటిషనర్ల తరపున చింతలపాటి పాణినీ సోమయాజి వాదనలు వినిపించారు. -
వద్దన్నందుకు చంపేశాడు.. బ్యూటీషియన్ దుర్గ మృతిలో వీడిన మిస్టరీ
చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలో సంచలనం సృష్టించిన బ్యూటీషియన్ దుర్గాప్రశాంతి మృతి కేసులో మిస్టరీ వీడింది. దుర్గాప్రశాంతిది హత్యగా పోలీసులు తేల్చారు. ప్రాణాపాయ స్థితిలో తిరుపతి రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నిందితుడు చక్రవర్తి నోరు విప్పడంతో అసలు విషయం బయటపడింది. కొద్దిరోజులుగా తనను పక్కకు పెట్టడం, పెళ్లి విషయాన్ని వాయిదా వేస్తూ రావడంతోనే దుర్గాప్రశాంతిని చంపేసినట్లు నిందితుడు అంగీకరించాడు. ఇక్కడ ఆస్పత్రిలో కోలుకున్న చక్రవర్తి ప్రస్తుతం పోలీసుల పహారా మధ్య తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మోచేతితో గొంతుబిగించి.. చిత్తూరుకు చెందిన పోలీసు హెడ్ కానిస్టేబుల్ కుమార్తె దుర్గాప్రశాంతికి, తెలంగాణలోని కొత్తగూడేనికి చెందిన చక్రవర్తికి ఫేస్బుక్ ద్వారా రెండేళ్లుగా పరిచయం ఉంది. దుర్గాప్రశాంతిని పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో చక్రవర్తి భద్రాచలంలో ఉన్న తన తల్లిని తీసుకుని చిత్తూరు వచ్చి దుకాణం తెరచి ఇక్కడే ఉంటున్నాడు. ఇటీవల పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడల్లా తనకు కాస్త సమయం కావాలని దుర్గాప్రశాంతి కోరేది. వారం రోజులుగా వారి మధ్య విభేదాలొచ్చా యి. తనకు ఫోన్ చేయవద్దని, పెళ్లి ఇప్పుడే వ ద్దని ఆమె స్పష్టం చేసింది. ఈ మాటలను పట్టించుకోని చక్రవర్తి నిత్యం ఫోన్లు చేస్తుండటంతో తన మొబైల్ చాట్స్ అన్నీ డిలీట్ చేయాలని చక్రవర్తికి చెప్పి అతడి మొబైల్ నంబర్‌ను బ్లాక్ చేసింది. తనను ఎందుకు పక్కకు పెట్టావని ప్రశ్నిస్తూ, పెళ్లి చేసుకోమని కోరుతూ చక్రవర్తి మంగళవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో తన మెయిల్ నుంచి దుర్గాప్రశాంతికి ఎని మిది పేజీల లేఖ రాశాడు. దీనికి ఆమె సమాధానం ఇవ్వలేదు. మధ్యాహ్నం ఆమె బ్యూటీపార్లర్‌లో ఉంటుందని తెలిసిన చక్రవర్తి 12.30 గంటల ప్రాంతంలో పార్లర్‌లోకి వెళ్లాడు. తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసినా దుర్గాప్రశాంతి అంగీకరించలేదు. దీంతో ఓ బ్లేడ్ తీసుకుని చేయి కోసుకున్నాడు. భయపడిన దుర్గ పార్లర్ నుంచి బయటకు పరుగెత్తేందుకు ప్రయత్నించింది. వెంటనే తన మోచేతితో దుర్గ గొంతును ఊపిరి ఆడకుండా గట్టిగా పట్టుకున్నాడు. ఆరడుగుల పొడవు, బలిష్టమైన శరీరంతో ఉన్న చక్రవర్తి పట్టు నుంచి దుర్గాప్రశాంతి తప్పించుకోలేక.. ఊపిరాడక క్షణాల్లో ప్రాణాలొదిలింది. దీంతో భయపడిన నిందితుడు తాను కూడా చనిపోవాలని బ్లేడుతో గొంతు, చేయి, శరీరంపై కోసుకుని తీవ్ర రక్తస్రావంతో పడిపోయాడు. దిశ పోలీసుల దర్యాప్తు ఈ కేసును చిత్తూరు దిశ పోలీసులకు అప్పగిస్తూ ఎస్పీ రిషాంత్‌రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. వన్‌టౌన్ పోలీసుల వద్ద ఉన్న సమాచా రాన్ని దిశ స్టేషన్ డీఎస్పీ బాబుప్రసాద్ తీసుకున్నారు. దిశ సీఐ బాలయ్యతో కలిసి వైద్యులచే దుర్గాప్రశాంతి మృతదేహానికి పోస్టుమార్టం చేయించి, కుటుంబసభ్యులకు అప్పగించారు. నిందితుడు చక్రవర్తిపై హత్య, అట్రాసిటీ, ఆత్మహత్యాయత్నం సెక్షన్ల కింద కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. -
డాక్టర్‌ను మోసం చేసిన కోడెల కుమార్తె
సాక్షి, గుంటూరు : టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుటుంబంపై ఫిర్యాదుల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే ఆయన కుమారుడు, కుమార్తెపై పలు కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే. తాజాగా కోడెల కుమార్తె విజయలక్ష్మిపై చీటింగ్ కేసు నమోదు చేశారు పోలీసులు. ఆరోగ్యశ్రీ పర్మిషన్ పేరుతో తనను మోసం చేశారంటూ డాక్టర్ చక్రవర్తి బుధవారం సత్తెనపల్లి పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశారు. డాక్టర్ చక్రవర్తికి చెందిన మేఘనా ఆస్పత్రికి ఆరోగ్యశ్రీ పథకాన్ని వర్తింప చేస్తామంటూ విజయలక్ష్మి నాలుగు లక్షలు వసూలు చేశారు. అయితే ఆరోగ్యశ్రీ వర్తింపచేయలేదు. తిరిగి డబ్బులు ఇవ్వాలని అడిగినా బెదిరింపులకు దిగారు. దీంతో విజయలక్ష్మితో పాటు బొమ్మిశెట్టి శ్రీను, పోట్ల ప్రసాదుపై పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. కాగా కోడెల శివప్రసాదరావు కుటుంబం అధికారం అండతో ఇన్నాళ్లూ సాగించిన దౌర్జన్యాలు, అరాచకాలు, అక్రమ వసూళ్లు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తన కుటుంబంపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారని, ఆధారాలు ఉంటే చూపించాలంటూ కోడెల సవాలు విసిరి రెండు రోజులు గడవకముందే రంజీ క్రికెట్ క్రీడాకారుడిపై దాడికి పాల్పడిన ఘటన చోటు చేసుకుంది. గుంటూరు రూరల్ ఎస్పీ జయలక్ష్మిని ఆదేశాలతో కోడెల శివప్రసాదరావుతోపాటు ఆయన కుమారుడు శివరాంపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల్లో తన కుమారుడు శివరాం, కుమార్తె విజయలక్ష్మి సాగించిన అరాచకాలు, అక్రమ వసూళ్లకు కోడెల శివప్రసాదరావు అండగా నిలిచినట్లు మరోమారు తేటతెల్లమైంది. కోడెల కుమారుడు, కుమార్తెపై గతంలో నమోదైన కేసుల్లో శివప్రసాదరావును సైతం నిందితుడిగానే చేర్చాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. -
ట్వంటీ ప్లస్
చక్రవర్తి, బంగార్రాజు, ఆంధ్ర అప్పాచీ, అక్షర, సంతోషిని, ఉమ ముఖ్య తారలుగా వెల్లంకి దుర్గాప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రూపం ఎస్, 20ప్లస్’. సాయిలోకేష్ ప్రొడక్షన్ పతాకంపై సి.రామాంజనేయ నిర్మించిన ఈ సినిమా పోస్టర్ని నిర్మాత సాయివెంకట్ రిలీజ్ చేసి, మాట్లాడుతూ– ‘‘పల్లెటూరి నేపథ్యంలో వినోదాత్మకంగా రూపొందిన చిత్రమిది. దుర్గాప్రసాద్ మంచి ప్రతిభ ఉన్న వ్యక్తి. తనకు ఈ సినిమాతో మంచి పేరొస్తుంది’’ అన్నారు. ‘‘దర్శకు డిగా అవకాశం ఇచ్చిన రామాంజనేయగారికి థ్యాంక్స్. వెల్లంకి విజయలక్ష్మి రాసిన పాటలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ’’ అని వెల్లంకి దుర్గాప్రసాద్ అన్నారు. ‘‘ప్రేక్షకులకు మంచి వినోదం అందించబోతున్నాం. ఆరవన్, మెలోడి శ్రీనివాస్ కలిసి ఈ చిత్రానికి మంచి సంగీతం అందించారు’’ అని రామంజనేయ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఆనంద్, సాగర్. -
చక్రవర్తికి 7 వికెట్లు
సాక్షి, హైదరాబాద్: సదర్న్ స్టార్స్ బౌలర్ చక్రవర్తి (7/42) చెలరేగడంతో ఈ జట్టు 30 పరుగుల తేడాతో లాల్‌బహదూర్ పీజీపై గెలుపొందింది. ఎ-డివిజన్ వన్డే లీగ్‌లో సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేపట్టిన సదర్న్ స్టార్స్ 195 పరుగుల వద్ద ఆలౌటైంది. రితేశ్ (64) రాణించాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన లాల్‌బహదూర్ జట్టు 165 పరుగులకే ఆలౌటైంది. దినేశ్ (58) మినహా ఇంకెవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేకపోయారు. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు యంగ్ సిటిజన్: 70 (వంశీ ఆచార్య 5/6), నటరాజ్: 71/9 (అజయ్ మూర్తి 4/8). తిరుమల: 94 (గిరి 5/22), ఎస్‌యూసీసీ: 95/5 (చరణ్ 32). సెయింట్ సాయి: 235 (జితేశ్ రెడ్డి 110, అమృత్ 48; శివేష్ 3/47), హైదరాబాద్ పాంథర్స్: 143 (జితేశ్ రెడ్డి 5/29, నిఖిల్ 3/22). -
బుద్ధి, జ్ఞానం ఉందా?
ఐసీడీఎస్ అధికారులపై తీవ్రస్థాయిలో మండిపడిన ప్రత్యేక కమిషనర్ చక్రవర్తి విజయనగరం : ‘బుద్ధి, జ్ఞానం ఉందా? కొత్తగా ఉద్యోగాల్లోకి వచ్చారు. కదలకుండా కూర్చొంటారా? ఇంటి పక్కనే ఉద్యోగం కావాలి.. ఉద్యోగం వచ్చాక పని చేయకుండా జీతం ఇవ్వాలా?’ అంటూ ఐసీడీఎస్ అధికారులపై రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమశాఖ ప్రత్యేక కమిషనర్ కేఆర్బీహెచ్ఎన్ఎస్ చక్రవర్తి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. స్థానిక విజయ నగరం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఆదివారం ఉత్తరాంధ్రలోని ఐసీడీఎస్ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీడీపీఓలు వారి పరిధిలో ఉన్న అన్ని కేంద్రాలనూ పర్యవేక్షించానని నిల్చొని ధైర్యంగా చెప్పగలరా? అని ప్రశ్నించారు. దీంతో 19 మంది సీడీపీఓలు నిల్చొన్నారు. ఉత్తరాంధ్రలో 60 మంది సీడీపీఓలు ఉన్నారని, ఇందులో 19 మంది మాత్రమే లేచారంటే.. మిగిలిన 41 మంది పని చేయనట్లేనా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014లో ఎంతమంది ఏసీడీపీఓలుగా ఉద్యోగాల్లో చేరారని అడగగా.. 14 మంది నిల్చొన్నారు. ‘మీరైనా కేంద్రాలను పూర్తిస్థాయిలో పర్యవేక్షించారా?’ అని కమిషనర్ ప్రశ్నించగా.. ఏ ఒక్కరూ పర్యవేక్షించామని చెప్పలేదు. దీంతో ఆగ్రహానికి గురైన ఆయన.. సీడీపీఓలు, ఏసీడీపీఓలు కేంద్రాలను పర్యవేక్షించకుండా ఉంటే పీడీలు ఏం చేస్తున్నారని మండిపడ్డారు. విధులు సక్రమంగా నిర్వహించకుంటే తీవ్ర చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. అంగన్వాడీ కేంద్రాలకు ఇచ్చే పౌష్టికాహారం పక్కదారి పడకూడదనే ఉద్దేశంతో.. గత ఏడాది డిసెంబర్లో ఈ-పాస్ విధానాన్ని ప్రవేశ పెట్టామన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో ఏర్పడిన ఖాళీలను ప్రతి నెలా గుర్తించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సూచించారు. కేంద్రాల్లో పనిచేస్తున్న కార్యకర్తలు, ఆయాల అధార్ నంబర్లు సేకరించాలని ఆదేశించారు. మైదాన ప్రాంతంలో ఒక రేషన్ షాపు పరిధిలో ఒకట్రెండు అంగన్వాడీ కేంద్రాలు మాత్రమే ఉండాలన్నారు. గిరిజన ప్రాం తంలో ఐదు కేంద్రాలకు మించి ఉండరాదని చెప్పారు. కేంద్రాలకు రేషన్ షా పులు దగ్గరలో ఉండేటట్లు చూసుకోవాలని తెలిపారు. పూర్వ ప్రాథమిక విద్య పూర్తిస్థాయిలో అమలయ్యేలా చూడాలని సూచించారు. ఈ సమావేశంలో రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమశాఖ జేడీ శివపార్వతి, ఆర్జేడీ కామేశ్వరమ్మ, విజయనగరం పీడీ ఏఈ రాబర్ట్స్, విశాఖపట్నం పీడీ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
విశాలాంధ్ర మహాసభ అధ్యక్షుడు చక్రవర్తితో సాక్షి వేదిక