సదర్న్ స్టార్స్ బౌలర్ చక్రవర్తి (7/42) చెలరేగడంతో ఈ జట్టు 30 పరుగుల తేడాతో లాల్‌బహదూర్ పీజీపై గెలుపొందింది.
సాక్షి, హైదరాబాద్: సదర్న్ స్టార్స్ బౌలర్ చక్రవర్తి (7/42) చెలరేగడంతో ఈ జట్టు 30 పరుగుల తేడాతో లాల్‌బహదూర్ పీజీపై గెలుపొందింది. ఎ-డివిజన్ వన్డే లీగ్‌లో సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేపట్టిన సదర్న్ స్టార్స్ 195 పరుగుల వద్ద ఆలౌటైంది. రితేశ్ (64) రాణించాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన లాల్‌బహదూర్ జట్టు 165 పరుగులకే ఆలౌటైంది. దినేశ్ (58) మినహా ఇంకెవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేకపోయారు.
ఇతర మ్యాచ్‌ల స్కోర్లు
యంగ్ సిటిజన్: 70 (వంశీ ఆచార్య 5/6), నటరాజ్: 71/9 (అజయ్ మూర్తి 4/8).
తిరుమల: 94 (గిరి 5/22), ఎస్‌యూసీసీ: 95/5 (చరణ్ 32).
సెయింట్ సాయి: 235 (జితేశ్ రెడ్డి 110, అమృత్ 48; శివేష్ 3/47), హైదరాబాద్ పాంథర్స్: 143 (జితేశ్ రెడ్డి 5/29, నిఖిల్ 3/22).