మల్లికార్జున్‌ అజేయ డబుల్‌ సెంచరీ | Mallikarjun Slams Double Century As Cambridge Big Victory | Sakshi
Sakshi News home page

మల్లికార్జున్‌ అజేయ డబుల్‌ సెంచరీ

Published Fri, Aug 23 2019 10:15 AM | Last Updated on Fri, Aug 23 2019 10:15 AM

Mallikarjun Slams Double Century As Cambridge Big Victory - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) ఎ1, ఎ2 డివిజన్‌ వన్డే లీగ్‌లో కేంబ్రిడ్జ్‌ ఎలెవన్‌ బ్యాట్స్‌మన్‌ జె. మల్లికార్జున్‌ (138 బంతుల్లో 201 నాటౌట్‌; 12 ఫోర్లు, 12 సిక్సర్లు) దుమ్మురేపాడు. బౌండరీలు, సిక్సర్లతో మైదానాన్ని హోరెత్తిస్తూ డబుల్‌ సెంచరీతో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. మల్లికార్జున్‌కు తోడు బౌలింగ్‌లో సాతి్వక్‌ రెడ్డి (5/38), ఆశిష్‌ శ్రీవాస్తవ్‌ (4/27) చెలరేగ డంతో గురువారం రాజుసీసీతో జరిగిన మ్యాచ్‌లో కేంబ్రిడ్జ్‌ జట్టు 242 పరుగులతో ఘనవిజయాన్ని నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన కేంబ్రిడ్జ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 2 వికెట్లకు 352 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఆకాశ్‌ యాదవ్‌ (127 బంతుల్లో 106 నాటౌట్‌; 12 ఫోర్లు) అజేయ సెంచరీతో అదరగొట్టాడు. అనంతరం భారీ లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన రాజు సీసీని సాతి్వక్‌ రెడ్డి, ఆశిష్‌ వణికించారు. వీరిద్దరి ధాటికి రాజు సీసీ 29.3 ఓవర్లలో 110 పరుగులకే కుప్పకూలింది.  

ఇతర మ్యాచ్‌ల ఫలితాలు

వరంగల్‌ జిల్లా: 163 (హితేశ్‌ యాదవ్‌ 3/14, అమోల్‌ షిండే 4/34), ఆంధ్రా బ్యాంక్‌: 164/1 (రోడ్రిగ్స్‌ 52, నీరజ్‌ బిష్త్‌ 50 నాటౌట్‌).
ఎంసీసీ: 178/7 (ప్రమోద్‌ మహాజన్‌ 84; రవీందర్‌ 5/44), అవర్స్‌ సీసీ: 78/7 (శ్రీనివాస్‌ యాదవ్‌ 3/20).
అగర్వాల్‌ సీనియర్స్‌: 152 (వీరేందర్‌ 62 నాటౌట్‌; అజీముద్దీన్‌ 4/63), గౌడ్‌ ఎలెవన్‌: 157/3 (హర్ష్‌ సంక్‌పాల్‌ 45, శ్రీకర్‌ రెడ్డి 49).
నిజామాబాద్‌ జిల్లా: 107 (దుర్గేశ్‌ 3/25), బీడీఎల్‌: 108/1 (సింహా 61 నాటౌట్‌).

డెక్కన్‌ వాండరర్స్‌: 309 (విశాల్‌ యాదవ్‌ 66, నూతన్‌ కల్యాణ్‌ 50, షేక్‌ మాజీద్‌ 109; అభినవ్‌ కుమార్‌ 3/47, చిరంజీవి 5/26), నిజాం కాలేజి: 87 (ఫిరాజుద్దీన్‌ 6/19).
కాంటినెంటల్‌: 160 (జైదేవ్‌ గౌడ్‌ 52; యశ్వంత్‌ 3/53, అన్వేశ్‌ 3/22), ఆక్స్‌ఫర్డ్‌ బ్లూస్‌: 44/5 (21 ఓవర్లలో).
హైదరాబాద్‌ బ్లూస్‌: 278/7 (రుతిక్‌ యాదవ్‌ 44, రవి పాండే 110; సుశీక్షిత్‌ రెడ్డి 3/40), పీకేఎంసీసీ: 190 (అనిరుధ్‌ కపిల్‌ గౌడ్‌ 44, శివ శంకర్‌ 67; రుతి్వక్‌ 5/47).
డెక్కన్‌ క్రానికల్‌: 183 (వరుణ్‌ గౌడ్‌ 44, అద్నాన్‌ 30; జితేందర్‌ 4/28), ఖల్సా: 63 (అమన్‌ ఉపాధ్యాయ్‌ 3/11, విద్యానంద్‌ రెడ్డి 4/24).
ఎలిగెంట్‌: 223 (దివేశ్‌ 66, అఫ్జల్‌ 41), శ్రీ శ్యామ్‌: 120 (ఇబ్రహీం అలీ 48; సిద్ధార్థ్‌ 3/29, పి. రాఘవ 5/45).

గెలాక్సీ: 84(శ్రవణ్‌ 3/25, మయాంక్‌ గుప్తా 3/7), ఎవర్‌గ్రీన్‌: 87/1 (రాహుల్‌ 47).

సీసీఓబీ: 267 (షేక్‌ మొహమ్మద్‌ 86, అజీజుద్దీన్‌ 55; రిషిత్‌ రెడ్డి 3/44, నితిన్‌ 3/34), బ్రదర్స్‌ ఎలెవన్‌: 235 (రిషిత్‌ రెడ్డి 62, హర్షవర్ధన్‌ 62; నోమన్‌ 3/28, అజీజుద్దీన్‌ 4/48).
ఆర్‌ దయానంద్‌: 298/3 (బెంజమిన్‌ 51, షణ్ముఖ 73, రోహిత్‌ రెడ్డి 77 నాటౌట్, విఘ్నేశ్వర్‌ 48 నాటౌట్‌), నల్లగొండ జిల్లా: 140 (మోహిత్‌ సోని 3/34, బెంజమిన్‌ 4/25).
నేషనల్‌: 133 (సహేంద్ర మల్లు 30; మెహర్‌ ప్రసాద్‌ 4/17), విజయ్‌ హనుమాన్‌: 134/6 (శ్రీకర్‌ రెడ్డి 61 నాటౌట్‌).

డెక్కన్‌ బ్లూస్‌: 76 (సయ్యద్‌ మెహదీ హసన్‌ 6/9), ఎన్స్‌కాన్స్‌: 79/2 (10.2 ఓవర్లలో).  
సాయిసత్య: 184 (ఇషాన్‌ శర్మ 48; అశ్వద్‌ రాజీవ్‌ 3/26, వెంకటేశ్‌ 3/31), తెలంగాణ: 187/7 (సూరి 49; విజయ్‌ ఆకాశ్‌ 3/35).
ఈఎంసీసీ: 258/7 (మెహుల్‌ భౌమిక్‌ 104, అసదుద్దీన్‌ 81), కొసరాజు సీసీ: 100/9. స్పోర్టివ్‌ సీసీ: 137 (విష్ణు 3/33), హెచ్‌యూసీసీ: 97/8 (అతుల్‌ వ్యాస్‌ 36 నాటౌట్‌; అశి్వన్‌ 4/13).
కరీంనగర్‌: 183/9 (రిత్విక్‌ సూర్య 76; తనయ్‌ త్యాగరాజన్‌ 3/27, దివేశ్‌సింగ్‌ 3/33), స్పోర్టిం గ్‌ ఎలెవన్‌: 184/3 (హిమాలయ్‌ అగర్వాల్‌ 89 నాటౌట్, తనయ్‌ త్యాగరాజన్‌ 68).  
పాషా బీడీ: 143/9 ( పంకజ్‌ 5/22), చీర్‌ఫుల్‌ చమ్స్‌: 144/5 (సాయి కౌశిక్‌ 60 నాటౌట్‌; ఫహీమ్‌ 3/39). 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement