జింఖానా, న్యూస్‌లైన్: బ్రిలియంట్ ట్రోఫీ చెస్ టోర్నీ ఓపెన్ కేటగిరీలో చక్రవర్తి రెడ్డి టైటిల్‌ని గెలుచుకున్నాడు. బ్రిలియంట్ గ్రామర్ హైస్కూల్‌లో ఆదివారం జరిగిన ఫైనల్లో చక్రవర్తి రెడ్డి(6)... ప్రభాత్ (5)పై గెలుపొందాడు. రమణ కుమార్ (5)... రాజు (4)పై నెగ్గి రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. జూనియర్స్ కేటగిరీలో వర్షిత, అభినవ్, మేఘరనాశ్రమ్ 6 రౌండ్‌లకు గాను 5.5 పాయింట్లు సాధించడంతో టై బ్రేక్‌కు దారితీసింది. టై బ్రేక్‌లో వర్షిత్ మొదటి స్థానంలో నిలవగా... అభినవ్, మేఘనాశ్రమ్ వరుసగా రెండు, మూడు స్థానాలను కైవసం చేసుకున్నారు.
మిగతా ఫలితాలు: అండర్-14 బాలురు: 1. చేతన్ రాథోడ్, 2.ప్రణీత్; బాలికలు: 1. హరిలాస్య, 2. సాయిశృతి. అండర్-12 బాలురు: 1. మేఘనాశ్రమ్, 2. శ్రీకర్; బాలికలు: 1. మోహిని అశోక్, 2. సాధన. అండర్-10 బాలురు: 1. అభినవ్, 2. ప్రధమ్; బాలికలు: 1. సాహిత్య, 2. అంజలి. అండర్-8 బాలురు: 1. రుత్విక్ రోహన్, 2. ప్రశాంత్; బాలికలు: 1. రచిత, 2. అనూషా రెడ్డి. అండర్-6 బాలురు: 1. ప్రణయ్ వెంకేటేశ్, 2. శ్రీకర్; బాలికలు: 1. సేవిత విజు, 2. నిత్య రాజు.
చక్రవర్తికి టైటిల్
Published Mon, Jan 13 2014 12:12 AM | Last Updated on Sat, Sep 2 2017 2:34 AM
Advertisement
Advertisement