యూపీలో పరువు హత్య కలకలం... | Honour killing In UP Ambedkar Nagar Father Shoots Daughter And Her Lover | Sakshi
Sakshi News home page

యూపీలో పరువు హత్య కలకలం...

Published Fri, Jun 15 2018 12:29 PM | Last Updated on Mon, Jul 30 2018 8:41 PM

Honour killing In UP Ambedkar Nagar Father Shoots Daughter And Her Lover - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

లక్నో : ఉత్తరప్రదేశ్‌లో పరువు హత్య కలకలం రేపింది. కూతురు ప్రేమ విషయం తెలుసుకున్న ఓ తండ్రి ప్రేమ జంటను తుపాకీతో కాల్చి చంపాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పూర్వ జంగ్లా అంబేద్కర్‌ నగర్‌కు చెందిన జైశ్‌రాజ్‌ అనే వ్యక్తికి ఇద్దరు కుమారులతో పాటు కుమార్తె వందన(19) ఉంది. సవారా గ్రామానికి చెందిన యువకుడు శశికాంత్‌ను ప్రేమించిన వందన.. అతడిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో గురువారం కుటుంబ సభ్యులెవరూ ఇంట్లో లేని సమయంలో తనను తీసుకు వెళ్లాల్సిందిగా శశికాంత్‌ను  కోరింది. అదే సమయంలో ఇంటికి తిరిగి వచ్చిన జైశ్‌రాజ్‌.. వందనతో మాట్లాడుతున్న శశికాంత్‌ను చూసి కోపోద్రిక్తుడయ్యాడు. వెంటనే తన వద్ద ఉన్న డబుల్‌ బ్యారెల్‌ లైసెన్స్‌డ్‌ గన్‌తో వందన, శశికాంత్‌లను కాల్చగా వారు అక్కడిక్కడే మరణించారు.

కాగా శశికాంత్‌ తండ్రి ఫిర్యాదు మేరకు జైశ్‌రాజ్‌ ‌, అతడి కుమారులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నేరం అంగీకరించిన జైశ్‌రాజ్‌ హత్యకు ఉపయోగించిన తుపాకీతో సహా స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయాడని, అతడి కుమారులు పరారీలో ఉన్నారని పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement