సాక్షి, చెన్నై: ప్రియురాలి కోసం వెళ్లి అడ్డంగా బుక్కైన ప్రియుడు ఆమె ఇంట్లోనే దారుణ హత్యకు గురయ్యాడు. కుటుంబీకులు అతడ్ని నరికి చంపేశారు. చిదంబరంలో ఈ ఘటన కలకలం రేపింది. రాష్ట్రంలో సాగుతున్న కులాంతర వివాహాలు, ప్రేమ వివాహాలు పరువు హత్యలకు దారి తీస్తున్న విషయం తెలిసిందే. కోర్టులు హెచ్చరించినా, పోలీసులు కఠినంగా వ్యవహరించినా, భరోసా ఇచ్చే రీతిలో ముందుకు సాగుతున్నా హత్యల పరంపర కొనసాగుతూనే ఉన్నది. ఈ పరిస్థితుల్లో కడలూరులో తాజాగా ప్రియురాలి ఇంట్లో ఉన్న ప్రియుడ్ని కుటుంబీకులు దారుణంగా హతమార్చడం కలకలం రేపింది.
కడలూరు జిల్లా చిదంబరానికి చెందిన ఆర్ముగం కుమారుడు అన్భళగన్(21). స్థానికంగా ఓ కిరాణ దుకాణం నడుపుతున్నాడు. చిదంబరం అరంగనాథన్ వీధి లో ఉన్న బాబు కుమార్తె శ్వేత (18) తో పరిచయం ప్రేమగా మారింది. ఏడాదిన్నర కాలంగా ఈ ఇద్దరు ప్రేమించుకుంటున్నారు. లాక్‌డౌన్ పుణ్యమా ప్రియురాల్ని చూడలేని పరిస్థితుల్లో పడ్డ, ఈ ప్రేమికుడు గత నెల ఆమె ఇంటి వద్దకు వెళ్లి బుక్కయ్యాడు. శ్వేత కుటుంబీకులు తీ›వ్రంగా మందలించి పంపించారు. ఈ పరిస్థితుల్లో ప్రియురాల్ని చూడలేకపోతున్న మనో వేదనతో ఉన్న అన్భళగన్ గత వారం ఓ మారు ఆ వీధిలోకి వెళ్లి చితక్కొట్టించుకు వచ్చాడు. ఈ పరిస్థితుల్లో శుక్రవారం సాయంత్రం ఆ ఇంట్లో ఎవరు లేరన్న సమాచారంతో శ్వేత కోసం వెళ్లి బుక్కైయ్యాడు. చదవండి: ఆమెకు 25.. అతడికి 18..
ఇంట్లో ఎవరు లేదన్న ఉత్సాహంతో వెళ్లిన అన్భళగన్‌కు అక్కడ ఆమె తండ్రి, తల్లి, సోదరుడు ఉండడంతో షాక్ తప్పలేదు. ఇంట్లోకి వచ్చిన అతడ్ని ఆ కుటుంబం నరికి చంపేసింది. రక్తపు మడుగులో సంఘటన స్థలంలోనే అన్భళగన్ మరణించాడు. తమ పరువును బజారు కీడ్చే రీతిలో వ్యవహరిస్తున్నాడన్న ఆగ్రహంతోనే హతమార్చినట్టుగా ఓలేఖను అక్కడ పడేసి ఆ కుటుంబం అజ్ఞాతంలోకి వెళ్లింది. ఆ ఇంటి నుంచి రక్తం వాసన వస్తుండడాన్ని గుర్తించిన పక్కింటి వారు లోనికి వెళ్లి చూడగా, మృతదేహం పడి ఉండడంతో ఆందోళనకు గురయ్యారు. పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. అక్కడ లభించిన లేఖ ఆధారంగా ప్రేమ పరువు హత్యగా తేల్చారు. బాబు(40), ఆయన భార్య సత్య (37), కుమారుడు జీవ(17), శ్వేత(18)పై కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న ఈ నలుగురి కోసం గాలిస్తున్నారు. చదవండి: మంచి మనసుకు మన్నన
Comments
Please login to add a commentAdd a comment