
బాధిత కుటుంబ సభ్యులను విచారిస్తున్న మానవహక్కుల వేదిక సభ్యులు
ఆళ్లగడ్డ: లక్ష్మిదేవిది ముమ్మాటికీ పరువు హత్యేనని మానవహక్కుల వేదిక (హెచ్‌ఆర్‌ఎఫ్) రాష్ట్ర అధ్యక్ష, ఉపాధ్యక్షులు జగన్నాథరావు, జయశ్రీ పేర్కొన్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న మైనర్ కూతురును కన్నతండ్రే కిరాతకంగా హత్య చేసిన ఘటనపై సాక్షిలో మంగళవారం ‘కన్న తండ్రే కాలయముడు’ శీర్షికన వెలువడిన కథనానికి స్పందించిన మానవహక్కుల వేదిక సభ్యులు శుక్రవారం కోటకుందుకూరు చేరుకుని లక్ష్మిదేవిని ప్రేమ వివాహం చేసుకున్న యువకుడి కుటుంబ సభ్యులను కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లక్ష్మిదేవిని తల్లిదండ్రులు నర్సమ్మ, నరసింహులు, బాబాయి బాలకృష్ణ కొట్టి చంపి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు్ల చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. బాధితురాలిని జువైనల్ హోంలో ఉంచి రక్షణ కల్పించి ఉంటే హత్య జరిగి ఉండేదికాదన్నారు. ప్రభుత్వం స్పందించి పరువు హత్యలు జరక్కుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర కార్యదర్శి దేవంద్రబాబు ఉన్నారు