![Man kills Sister And Her Lover For Family Honour In Uttar Pradesh - Sakshi](/styles/webp/s3/article_images/2020/07/10/up.jpg.webp?itok=U1kg1B2a)
లక్నో: సినిమాను తలపించే తరహా హత్యోదంతం ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. ప్రేమజంటను చంపి ఆత్మహత్యగా చిత్రీకరించిన సంఘటన యూపీలోని సంభల్ జిల్లాలోని గధా గ్రామంలో వెలుగులోకి వచ్చింది. జూలై 1న పొలాల్లో ఓ ప్రేమ జంట మృతదేహాలు చెట్టుకు వేలాడుతూ కనిపించాయి. మృతులు సుఖియా, బంటి ఆత్మహత్య చేసుకున్నారని మొదట పోలీసులు భావించారు. మరో 6 రోజుల తర్వాత సుఖియా సోదరుడు కుల్దీప్ కూడా అక్కడే చెట్టుకు ఉరివేసుకోవడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. పోలీసులు దర్యాప్తు చేపట్టగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కుల్దీప్‌ది ఆత్మహత్య కాదని హత్య అని తేలింది. అదేవిధంగా ఆ ప్రేమజంటది కూడా ఆత్మహత్య కాదని, హత్యని పోలీసులు విచారణలో వెల్లడైంది. ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే ఈ ముగ్గురి చంపింది సుఖియా, బంటిల అన్నయ్య వినీత్. (చదవండి: కరోనా : యూపీ సర్కార్ కీలక నిర్ణయం)
కుటుంబ గౌరవం కోసం ఈ ముగ్గురిని హత్య చేసినట్టు పోలీసులు విచారణలో వినీత్ వెల్లడించాడు. సుఖియా, బంటి ఇంటి నుంచి పారిపోయి వివాహం చేసుకోవాలనుకున్నారని చెప్పాడు. వీరిద్దరూ వెళ్లిపోతే కుటుంబ పరువు పోతుందన్న భయంతో తన ముగ్గురు స్నేహితులకు రూ. 2.5 లక్షలు సుపారి ఇచ్చి హత్య చేయించినట్టు తెలిపాడు. సుఖియా, బంటిల హత్యను కుల్దీప్ తీవ్రంగా వ్యతిరేకించాడు. జరిగిన విషయం పోలీసులకు చెప్పేందుకు సిద్ధమయ్యాడు. తమ్ముడు నిజం చెబితే తన బండారం బయటపడుతుందన్న భయంతో అతడిని కూడా హత్య చేసి అక్కడే చెట్టుకు ఉరివేసినట్లు వినీత్ చెప్పాడు. అతడికి సహకరించిన ముగ్గురు స్నేహితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. (గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే హతం)
Comments
Please login to add a commentAdd a comment