డొనాల్డ్ ట్రంప్- జావేద్ జరీఫ్
టెహ్రాన్ : అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్ దేశాల నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీలు వరుస ట్వీట్లతో పరస్పరం హెచ్చరికలు చేసుకున్న విషయం తెలిసిందే. అమెరికాతో పెట్టుకుంటే తీవ్ర పరిణామాలు చవి చూడాల్సి వస్తుందంటూ ట్రంప్ చేసిన హెచ్చరికలపై ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి జావేద్ జరీఫ్ స్పందించారు.
బీ కేర్‌ఫుల్...
‘అస్సలు నచ్చడం లేదు.. కొన్ని నెలల క్రితం సంభవించిన అతి పెద్ద పేలుడు శబ్దాన్ని ప్రపంచ మొత్తం విన్నది. ఇరానియన్లు కూడా ఆ శబ్దాలను విన్నారు. నాగరిక ప్రపంచంలో 40 ఏళ్లుగా ఇలాంటి శబ్దాలు వింటూనే ఉన్నాం. ఇక చాలు.. ఎన్నో సామ్రాజ్యాలు కుప్పకూలి పోవడం మేము కళ్లారా చూశాం. అంతేకాదు మేము తలచుకోవడం వల్ల కొన్ని దేశాలు ఉనికి లేకుండా పోయాయి కూడా. కాబట్టి జాగ్రత్తగా ఉండండి’ అంటూ జావేద్ ట్వీట్ చేశారు. కాగా పెద్దపులితో ఆటలు వద్దని, ఇరాన్‌తో యుద్ధమంటే అంతతేలిక కాదని హసన్ రౌహానీ ట్రంప్‌కు వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. 2015లో ఇరాన్ న్యూక్లియర్ ఒప్పందం నుంచి అమెరికా తప్పుకున్న నాటి నుంచి ఇరు దేశాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతూనే ఉంది.
COLOR US UNIMPRESSED: The world heard even harsher bluster a few months ago. And Iranians have heard them —albeit more civilized ones—for 40 yrs. We’ve been around for millennia & seen fall of empires, incl our own, which lasted more than the life of some countries. BE CAUTIOUS!
— Javad Zarif (@JZarif) July 23, 2018
Comments
Please login to add a commentAdd a comment