ఇరాన్ పర్యటనలో మోదీ
Published Mon, May 23 2016 11:07 AM | Last Updated on Tue, Aug 21 2018 9:33 PM
టెహ్రాన్: ప్రధాన మంత్రి నరేంద్రమోదీ రెండు రోజుల పర్యటనలో భాగంగా ఇరాన్ చేరుకున్న ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఇరాన్ అధ్యక్షుడు హసన్ రోహన్ మోదీని సైనిక వందనంతో షాదాబాద్ ప్యాలెస్ కు ఆహ్వానించారు. ఆర్థిక, వ్యూహాత్మక సంబంధాలపై ఇరాన్ నేతతో చర్చించనున్నట్టు మోదీ ట్వీట్ చేశారు.
ఇరాన్ తో భారత ప్రభుత్వం కుదుర్చుకునే చాబాహర్ ఫోర్టు ఒప్పందం దేశ అభివృద్ధిలో ఒక చారిత్రక అద్యాయంగా నిలుస్తుందని రవాణామంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. ఇరువురు నేతల సమక్షంలో ఇరు దేశాల ప్రతినిధులు ఈరోజు మధ్యాహ్నం చాబాహర్ ఫోర్టు ఒప్పందంపై సంతకాలు చేయనున్నారు. అనంతరం ఉగ్రవాదం,ఇరు దేశాల సంబంధాలపై చర్చిస్తారు. దేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన షటిల్ ఆర్ఎల్వీ-టీడీ విజయం పట్ల మోదీ ఇస్రో శాస్త్రవేత్తలకు మోదీ అభినందనలు తెలిపారు.
Advertisement
Advertisement