
కుతుబ్‌షాహీ టూంబ్స్ వద్ద హసన్ రౌహానీ
ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ హసన్ రౌహానీ రెండో రోజు నగరంలో పర్యటిస్తున్నారు.
సాక్షి, హైదరాబాద్ : ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ హసన్ రౌహానీ రెండో రోజు నగరంలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా శుక్రవారం ఉదయం షేక్‌పేట్‌లోని కుతుబ్‌షాహీ టూంబ్స్‌ను రౌహనీ సందర్శించారు. కుతుబ్‌షాహీ సమాధుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మక్కామసీదుకు చేరుకొని అక్కడ ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు.
స్వాతంత్ర్యం అనంతరం మక్కామసీదును సందర్శించిన తొలి విదేశీ దేశాధినేత హసన్ రౌహానీయే కావడం విశేషం. రెండురోజుల పర్యటన నిమిత్తం గురువారం సాయంత్రం హైదరాబాద్‌కు వచ్చిన ఆయన ముస్లిం ప్రముఖులు, రాజకీయనాయకులు, విద్యావేత్తలు, మేధావులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.