మక్కామసీదు వద్ద శాస్త్రవేత్తపై దాడి!
Published Sun, Jun 22 2014 1:51 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
హైదరాబాద్: పాతబస్తీలో ఆదివారం ఉదయం దారుణం చోటు చేసుకుంది. పాతబస్తీలోని మక్కామసీదు వద్ద డీఆర్ డీఓ కు చెందిన శాస్త్రవేత్తపై కత్తితో దుండగుడు దాడి చేశారు. గుర్తుతెలియని వ్యక్తి శాస్త్రవేత్త శతపదిపై దాడి చేసినట్టు సమాచారం.
దొంగతనానికి ప్రయత్నించిన వ్యక్తిని అడ్డుకోవడంతోనే శతపదిపై దాడి జరిగినట్టు తెలుస్తోంది. అంగతకుడి దాడిలో తీవ్రంగా గాయపడిన శతపదిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. శతపది పరిస్థితి కొంత విషమంగానే ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు.
Advertisement
Advertisement