స్వల్ప ఉద్రిక్తత మినహా..సామూహిక ప్రార్థనలు ప్రశాంతం
- పోలీసులపై అల్లరిమూక రాళ్ల దాడి
- రెండు వాహనాల ధ్వంసం
శాలిబండ, న్యూస్‌లైన్: స్వల్ప ఉద్రిక్తత మినహా మక్కా మసీదులోశుక్రవారం సామూహిక ప్రార్థనలు ప్రశాంతంగా ముగిశాయి. ప్రార్థనల అనంతరం బయటికి వచ్చిన కొందరు యువకులు నారే తక్బీర్ అంటూ నినాదాలు చేస్తూ మక్కా మసీదు ముందు గుమిగూడారు. వారిని పో లీసులు అక్కడి నుంచి చెదరగొట్టారు. దీంతో వారు మొఘల్‌పురా ఫైర్ స్టేషన్ వైపు వెళ్లి.. నినాదాలు చేస్తూ పోలీసులపై రాళ్లు రువ్వారు.
రెచ్చిపోయిన ఆ అల్లరిమూక రోడ్లపై ఉన్న రెండు వాహనాలను ధ్వంసం చేసింది. అక్కడి నుంచి గుంపులుగా బయలుదేరి ఆస్రా ఆసుపత్రి ముందున్న ఐడీబీఐ బ్యాంక్ అద్దాలను పగులగొట్టారు. దీంతో చార్మినార్ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో పోలీ సులు వచ్చి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కాగా, ఏం జరుగుతుందోనన్న భయంతో వ్యా పారులు తమ దుకాణాలను మూసివేశారు.
ఎమ్మెల్యే అటుగా రావడంతో...
సామూహిక ప్రార్థనల అనంతరం యువకులు బయటకు వచ్చారు. అదే సమయంలో మక్కా మసీదు వైపు చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ వాహనం వచ్చింది. ఓవైపు ఎన్నికల కౌంటింగ్ జరుగుతుండటం, ఎంఐఎం హై దరాబాద్ ఎంపీ అభ్యర్థి మొదటి రౌండ్‌లో వె నుకబడటంతో నిరాశకు గురైన ఆ యువకులు నారే తక్బీర్ అంటూ నినాదాలు చేస్తూ గుమిగూడరు. దీంతో అక్బరుద్దీన్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం యువకులు మొఘల్‌పురా వైపు వెళ్తూ రాళ ్ల దాడికి పాల్పడ్డారు.
ప్రార్థనలకు గట్టి బందోబస్తు...
కిషన్‌బాగ్‌లో ఘర్షణలు, ఎన్నికల కౌంటింగ్‌ను దృష్టిలో పెట్టుకొని శుక్రవారం మక్కా మసీదు లో జరిగిన సామూహిక ప్రార్థనలకు దక్షిణ మండలం పోలీసులు బీఎస్‌ఎఫ్, ఆర్‌ఏఎఫ్, టాస్క్‌ఫోర్స్, ఏపీఎస్‌పీ, స్థానిక పోలీసులతో భారీ బందోబస్తు నిర్వహించారు. నగర అదనపు కమిషనర్ అంజనీ కుమార్, దక్షిణ మం డలం డీసీపీ ఎస్‌ఎస్ త్రిపాఠీ బందోబస్తును పర్యవేక్షించారు. కాగా, ఐడీబీఐ బ్యాంక్ అద్దాల ను అల్లరి మూకలు ధ్వంసం చేసిన ఘటనపై హుస్సేనీ ఆలం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.