అక్బరుద్దీన్ అరెస్ట్కు ఆదేశాలు | Politician Akbaruddin Owaisi Faces Arrest | Sakshi

అక్బరుద్దీన్ అరెస్ట్కు ఆదేశాలు

Oct 7 2015 12:36 PM | Updated on Jul 18 2019 2:11 PM

అక్బరుద్దీన్ అరెస్ట్కు ఆదేశాలు - Sakshi

అక్బరుద్దీన్ అరెస్ట్కు ఆదేశాలు

బిహార్ ఎన్నికల ప్రచారంలో రెచ్చగొట్టే ప్రసంగం చేసినందుకుగాను అక్బరుద్దీన్ను అరెస్ట్ చేయాలని పోలీస్ ఉన్నతాధికారులు ఆదేశించారు.

పాట్నా: ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ వివాదంలో చిక్కుకున్నారు. బిహార్ ఎన్నికల ప్రచారం సందర్భంగా రెచ్చగొట్టే ప్రసంగం చేసిన కేసులో అక్బరుద్దీన్ను అరెస్ట్ చేయాలని కిషన్గంజ్ పోలీస్ ఉన్నతాధికారులు ఆదేశించారు. కిషన్గంజ్ పోలీసులు అక్బరుద్దీన్పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 

గత ఆదివారం కిషన్గంజ్ జిల్లాలోని ఓ గ్రామంలో జరిగిన ఎన్నికల ర్యాలీలో అక్బరుద్దీన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సహా బీజేపీ నేతలపై అక్బరుద్దీన్ తీవ్ర వ్యాఖ్యలు చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం 20 స్థానాల్లో పోటీ చేస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement