చట్టపరంగా ఎదుర్కొంటాం: అసదుద్దీన్ | we face Akbaruddin's case legally , says Asaduddin owaisi | Sakshi
Sakshi News home page

చట్టపరంగా ఎదుర్కొంటాం: అసదుద్దీన్

Published Wed, Oct 7 2015 1:23 PM | Last Updated on Thu, Jul 18 2019 2:11 PM

చట్టపరంగా ఎదుర్కొంటాం: అసదుద్దీన్ - Sakshi

చట్టపరంగా ఎదుర్కొంటాం: అసదుద్దీన్

పాట్నా: బిహార్ ఎన్నికల ప్రచారం సందర్భంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన కేసులో ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీని అరెస్ట్ చేయాలని కిషన్గంజ్ జిల్లా పోలీసులు ఆదేశాలు జారీ చేయడంపై ఆయన సోదరుడు, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ఈ కేసును చట్టపరంగా ఎదుర్కొంటామని అసదుద్దీన్ అన్నారు.

బిహార్లోని కిషన్గంజ్ పోలీసులు అక్బరుద్దీన్పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గత ఆదివారం కిషన్గంజ్ జిల్లాలోని ఓ గ్రామంలో జరిగిన ర్యాలీలో అక్బరుద్దీన్.. ప్రధాని నరేంద్ర మోదీ సహా బీజేపీ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement